న్యూఢిల్లీ: ఎన్నికల వేళ ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్)కి ఎన్నికల కమిషన్(ఈసీ)కి షాక్ ఇచ్చింది. ఎన్నికల ప్రచార సభలో భాగంగా ఆప్ వాడుతున్న పాటలో పలుసార్లు రిపీట్ అవుతున్న నినాదం పట్ల ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. పాటలో మార్పులు చేయాలని ఆప్‌ను ఆదేశించింది.
పాటలో మార్పులు చేసిన తర్వాత మళ్లీ తమ ఆమోదం తీసుకోవాలని కోరింది. ఎన్నికల ప్రచార ప్రకటనలో ‘జైల్ కె జవాబ్ మే హమ్ ఓట్ సే దేంగె’అన్న నినాదం వచ్చినపుడు కేజ్రీవాల్ జైళ్లో ఉన్న చిత్రాన్ని ప్రదర్శిస్తున్న గుంపు అంతా కలిసి న్యాయవ్యవస్థను దూషించినట్లుగా పాటలో ఉంది. న్యాయవ్యవస్థపై నిందలు వేయడం ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమేనని ఈసీ పేర్కొంది.
కాగా, తమ ప్రచార ప్రకటనపై ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలు బీజేపీ కుట్ర అని ఆప్ మండిపడింది. ఎన్నికల చరిత్రలో ఒక ప్రచార పాటపై నిషేధం విధించడం ఇదే మొదటిసారని ఆప్ నేత, ఢిల్లీ మంత్రి అతిషి అన్నారు. సీబీఐ, ఈడీలపై నిందలు వేస్తే ఎన్నికల కమిషన్ తమ ప్రచార పాటపై నిషేధం విధించడమేంటని ప్రశ్నించారు. ఈడీ, సీబీఐలు తమని అక్రమ అరెస్టులు చేస్తున్నప్పుడు ఎన్నికల కమిషన్ ఎందుకు స్పందించలేదో చెప్పాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment