దేశంలో లోక్‌సభ ఎన్నికలు కొనసాగున్నాయి. వివిధ పార్టీలు మ్యానిఫెస్టోలు విడుదల చేసి, ప్రచారాలు ముమ్మరం చేశాయి. దేశరాజధాని ఢిల్లీలో జరిగే లోక్‌సభ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తరపున ప్రచారం చేయనున్నారు.
సీఎం భగవంత్ మాన్ మే 11న తూర్పు ఢిల్లీ, దక్షిణ ఢిల్లీలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఇందుకోసం సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ ఢిల్లీలో రోడ్ షో నిర్వహించారు. ఢిల్లీ సీఎం జైలుకు వెళ్లిన తర్వాత సునీతా కేజ్రీవాల్ రాజకీయాల్లో చురుకుగా మారారు.
ఈసారి ఢిల్లీలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తోంది. ఆప్ నాలుగు స్థానాల్లో, కాంగ్రెస్ మూడు స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టాయి. ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలకు మే 25న ఆరో దశలో ఓటింగ్ జరగనుండగా, జూన్ 4న ఫలితాలు రానున్నాయి. ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను మే 21న ఈడీ అరెస్టు చేసింది. అప్పటి నుంచి కేజ్రీవాల్ తీహార్ జైలులో కస్టడీలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment