సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఈనెల 17న తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు మొత్తం ఐదు నియోజకవర్గాల్లో ఆయన రోడ్‌షోలు, పాదయాత్రలు చేపట్టనున్నారు. కార్నర్ మీటింగ్‌లలో ప్రసంగించనున్నారు. పినపాక, నర్సంపేట, వరంగల్ ఈస్ట్, వెస్ట్, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం చేయనున్నట్టు గాందీభవన్ వర్గాలు వెల్లడించాయి. వాస్తవానికి ఈనెల 17 నుంచి వరుసగా ఐదారు రోజుల పాటు రాహుల్ తెలంగాణలో పర్యటిస్తారని అనుకున్నప్పటికీ, ప్రస్తుతానికి శుక్రవారం ఒక్కరోజు షెడ్యూల్ మాత్రమే ఖరారైంది.
రాహుల్ పర్యటన ఇలా...
ఈనెల 17న ఉదయం 9:30 గంటల సమయంలో ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రా నున్న రాహుల్‌గాంధీ హెలికాప్టర్‌లో ఉద యం 11 గంటలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక చేరుకుంటారు. అక్కడ 12 గంటల వరకు రోడ్‌షో నిర్వహించి కార్న ర్ మీటింగ్‌లో ప్రసంగిస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో నర్సంపేటకు చేరుకుంటారు.
మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల వరకు అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించి రోడ్డు మార్గంలో వరంగల్ ఈస్ట్ నియోజకవర్గానికి చేరుకుంటారు. అక్కడ నుంచి పాదయాత్ర ద్వారా వెస్ట్ నియోజకవర్గానికి చేరుకుని అక్కడ కార్నర్‌మీటింగ్‌లో ప్రసంగిస్తారు. ఆ తర్వాత రోడ్డు మార్గంలో సాయంత్రం 6:30 గంటలకు రాజేంద్రనగర్‌కు వస్తారు. అక్కడ సభలో పాల్గొన్న అనంతరం ఢిల్లీ వెళ్లనున్నట్టు గాం«దీభవన్ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment