
‘ఇక బీజేపీ, జనసేన కలిసి ముందుకు సాగుతాయి.. తిరుపతి ఉప ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థే బరిలోకి దిగుతారు..’ అంటూ ఆయా పార్టీల నేతలు ఆర్భాటంగా ప్రకటించేశారు. ఇప్పుడు అభ్యర్థి విషయంలో మిత్రభేదాన్ని పాటిస్తున్నారు. ‘నువ్వా..నేనా’ అంటూ కాలుదువ్వుతున్నారు. ఎవరికివారే ప్రణాళికలు రచించుకుంటున్నారు. కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటున్నట్టు నటిస్తున్నారు. లోలోపల ఒకరిపై ఒకరు కారాలుమిరియా లు నూరుతూ బయట చిరునవ్వులు చిందిస్తున్నా రు. రాజకీయ ‘పవనం’ ఎప్పుడు రూటు మార్చు తుందో.. కమల వికాసం ఏ మాయ చేస్తుందో తెలియక కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారు.
సాక్షి, తిరుపతి : అభ్యర్థి ఎంపిక విషయంలో మిత్రపక్షాల మధ్య రచ్చ రాజుకుంటోంది. బయటకు ఒకటిగా ఉన్నా లోలోపల కత్తులు నూరేలా చేస్తోంది. తిరుపతి ఉపఎన్నికలపై బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు జనసేన శ్రేణులు రగిలిపోయేలా మార్చింది. ఇన్నాళ్లూ ఉపఎన్నికలో ఎవరు నిలవాలనే విషయమై ఓ కమిటీ తేలుస్తుందని చెప్పుకుంటూ వచ్చిన జనసేన నేతలు ఇప్పుడు బీజేపీ నేతల తీరుపై ఒంటికాలుతో లేసేలా చేసింది. రెండు రోజుల క్రితం దగ్గుబాటి పురందేశ్వరి ఇంట్లో నిర్వహించిన బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో మిత్రపక్షాన్ని దూరంగా పెట్టాలని నిర్ణయించింది. విషయం తెలుసుకున్న జనసేన నేతలు మిత్రభేదం తప్పద ని మండిపడుతున్నారు. ఇక సఖ్యత కుదరదని, సొంతంగా బరిలోకి దిగడమే మంచిదని యోచిస్తున్నారు. ఈనెల 21న తిరుపతిలో జరిగే జనసేన కీలక సమావేశంలో ఆ విషయా న్ని ప్రకటించే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం.
ఉప ఎన్నికలే లక్ష్యంగా రథయాత్ర
తిరుపతి ఉప ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ నేతలు రథయాత్ర చేపట్టాలని కోర్ కమిటీలో నిర్ణయించారు. రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ శ్రేణులు కలిసి ఆలయాలపై చేస్తున్న కుట్రల విషయాన్ని పోలీసుశాఖ ఆధారాలతో బయటపెట్టిన విషయం తెలిసిందే. అయితే కమలనాథులు అవేవీ పట్టించుకోకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని టార్గ్‌ట్‌గా చేసుకుని కపిలతీర్థం నుంచి రథయాత్ర ప్రారంభించి రామతీర్థం వరకు చేపట్టాలని నిర్ణయించారు. ఫిబ్రవరి 4న తిరుపతి కపిలతీర్థం నుంచి ప్రారంభించి ఎనిమిది రోజులపాటు సాగే ఈ యాత్రలో పీఠాపురం, అంతర్వేది, విజయవాడ, నెల్లూరు, శ్రీశైలం ప్రాంతాల్లో సభలను నిర్వహించాలని నిశ్చయించారు. ఈ రథయాత్రలో మత విద్వేషాలు రెచ్చగొట్టి, దాని ద్వారా సెంటిమెంట్‌ను రాజేసి తిరుపతి ఉప ఎన్నికన్నలో ప్రయోజనం పొందాలన్నదే లక్ష్యంగా కమలనాథులు ముందుకు సాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉంటే జనసేన శ్రేణులు తిరుపతి ఉప ఎన్నిక విషయంలో తమను అవమానిస్తున్న బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని పావులు కదుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
బయటపెట్టిన విషయం తెలిసిందే. అయితే కమలనాథులు అవేవీ పట్టించుకోకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని టార్గ్‌ట్‌గా చేసుకుని కపిలతీర్థం నుంచి రథయాత్ర ప్రారంభించి రామతీర్థం వరకు చేపట్టాలని నిర్ణయించారు. ఫిబ్రవరి 4న తిరుపతి కపిలతీర్థం నుంచి ప్రారంభించి ఎనిమిది రోజులపాటు సాగే ఈ యాత్రలో పీఠాపురం, అంతర్వేది, విజయవాడ, నెల్లూరు, శ్రీశైలం ప్రాంతాల్లో సభలను నిర్వహించాలని నిశ్చయించారు. ఈ రథయాత్ర లో మత విద్వేషాలు రెచ్చగొట్టి, దాని ద్వారా సెంటిమెంట్‌ను రాజేసి తిరుపతి ఉప ఎన్నికన్నలో ప్రయోజనం పొందాలన్నదే లక్ష్యంగా కమలనాథులు ముందుకు సాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉంటే జనసేన శ్రేణులు తిరుపతి ఉప ఎన్నిక విషయంలో తమను అవమానిస్తున్న బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని పావులు కదుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
పోటీ చేసేది బీజేపీ అభ్యర్థే!
తిరుపతిలో జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పోటీలో ఉంటారని బీజేపీ నేతలు పైకి చెబుతున్నా లోపల మాత్రం అధికారికంగా అభ్యర్థిని ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కోసం పార్టీ శ్రేణులంతా పనిచేయాలని ఆ పార్టీ కోర్ కమిటీ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ప్రతి మండలానికి ఒక బృందాన్ని పంపాలని, ముఖ్యమైన వారికి నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. ఎన్నికలు పూర్తయ్యేవరకు అంతా తిరుపతిలోనే ఉండాలని హుకుం జారీ చేసింది. బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే పార్టీ అభ్యర్థిని ప్రకటించడమే తరువాయిగా తెలుస్తోంది.
నోటిఫికేషన్ వచ్చి క్షేత్రస్థాయిలో దిగేవరకు అభ్యర్థి ప్రకటన విషయాన్ని బయటపెట్టే అవకాశం లేదని విశ్వసనీయ సమాచారం. కాకపోతే జనసేన అధినేత పవన్‌కల్యాణ్ నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక బీజేపీ నేతలు పూటకోమాట మాట్లాడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. తిరుపతి ఉపఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లో కూడా జనసేనకు పోటీ చేసే అవకాశం ఇవ్వకూడదని ఇప్పటికే బీజేపీ నేతలు గట్టిగా నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. బీజే పీ అభ్యర్థిగా రావెల కిషోర్‌బాబు పోటీచేసే అవకాశాలు న్నట్లు పార్టీలో అంతర్లీనంగా చర్చ కూడా జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment