
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికను వెంటనే నిర్వహించేందుకు వీలుగా వాస్తవ నివేదికను ఈసీకి డీజీపీ, సీఎస్‌ల ద్వారా పంపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ డిమాండ్ చేశారు. ఇప్పుడు వాయిదా వేసినా, ఎన్ని కుట్రలు చేసినా ఉప ఎన్నికల్లో గెలిచేది ఈటల రాజేందరేనని సీనియర్ నేత ఏపీ జితేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఓటమి భయంతోనే రాష్ట్రంలోని పరిస్థితులపై సీఎస్, డీజీపీలతో వాస్తవ విరుద్ధ నివేదికలను ప్రభుత్వం ఈసీకి పంపిందని వారు ముగ్గురు వేర్వేరు ప్రకటనల్లో ఆరోపించారు.
అక్కడ టీఆర్‌ఎస్ ఓడిపోతోందని రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం ఇచ్చిన నివేదికలతోనే కేసీఆర్ కుట్రకు దిగారని జితేందర్‌రెడ్డి ఆరోపించారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి ప్రభుత్వం తప్పుడు నివేదికలతో ఎన్నికలను వాయిదా వేయించిందన్నారు. రాష్ట్రంలో కరోనా ఉధృతి తగ్గిపోయిందని టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రకటించిం దని, ఉపఎన్నికలకు మాత్రం కరోనా అడ్డుగా మారిందా అని ఎస్.కుమార్ ప్రశ్నించారు. రాష్ట్రంలో అన్ని విద్యాసంస్థలు, బార్లు, రెస్టారెంట్లకు మినహాయింపులు ఇచి్చన కేసీఆర్ ప్రభుత్వం.. ఇప్పుడు ఉపఎన్నికలకు భయపడి కొత్త నాటకానికి తెరతీసిందని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment