
ఓటు వేసిన శిల్పా, కుటుంబసభ్యులు
నంద్యాల ఉప ఎన్నికలో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
సాక్షి, నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికలో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సంజీవ్‌నగర్ బూత్ నంబర్ 81కి కుటుంబ సమేతంగా వచ్చిన శిల్పా.. ఓటు వేశారు. కాగా, ఉప ఎన్నికలో అధికార పార్టీ తెలుగుదేశం, ప్రతిపక్షం వైఎస్‌ఆర్‌సీపీల మధ్య ప్రధాన పోటీ ఉంటుందని భావిస్తున్న విషయం తెలిసిందే.