
నంద్యాలలో ప్రారంభమైన పోలింగ్
కర్నూలు: జిల్లాలోని నంద్యాలలో ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది. 2,19,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉప ఎన్నిక కోసం నియోజకవర్గ వ్యాప్తంగా 255 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 141 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకంగా పరిగణిస్తున్నారు.
40 మంది డీఎస్పీలు, 150 మంది సీఐలు నియోజకవర్గ వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత కల్పిస్తున్నారు. ఆరున్నర గంటల ప్రాంతం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరారు. మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.