
సాక్షి, తిరుమల: ముగుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. శనివారం తన పుట్టినరోజు సందర్భంగా శ్రీవారిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాత్రమే గట్టి పోటీ ఉంటుందని తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీ పాతాళంలోకి వెళ్లిపోయిందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు ప్రజలు తమ వైపే ఉన్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మెజారిటీ ఎంపీ స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని చెప్పారు. దేశంలో ఇండియా కూటమి బలంగా పుంజుకుంటుందని, బీజేపీకి గెలుపు అంత ఈజీ కాదన్నారు. ఏ సర్వేల్లోనూ ప్రజా నాడి బయటకు రాలేదన్నారు. ఏపీలో ప్రజల నాడి సస్పెన్స్‌గా కొనసాగుతుందని తెలిపారు .
Comments
Please login to add a commentAdd a comment