సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తన ఏకైక లక్ష్యం నెరవేరిందన్నారు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇదే సమయంలో తెలంగాణలో జైలుకు వెళ్లే నేతలను తాము కాంగ్రెస్‌లో పార్టీలో చేర్చుకోము అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
కాగా, నేడు(శుక్రవారం) కాంగ్రెస్ నేతలు కురియన్ కమిటీని కలిశారు. అనంతరం, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ..‘కురియన్ కమిటీని కలిశాను. పార్లమెంట్ ఎన్నికలు ఏవిధంగా జరిగాయని అడిగారు. భువనగిరి ఇంఛార్జ్‌గా భారీ మెజార్టీతో గెలిపించానని చెప్పాను. భువనగిరిలో బీజేపీ గెలుస్తుందనే టాక్ ఉంది. కానీ, నేను ఇంఛార్జ్‌గా వెళ్లిన తర్వాత కాంగ్రెస్ విజయం సాధించింది. ఆరుగురు ఎమ్మెల్యేలు, ఒక అభ్యర్థి అందరం కలిసికట్టుగా పనిచేశాము. రెండు లక్షల మెజార్టీ వచ్చిందని చెప్పాను అని అన్నారు.
ఇదే సమయంలో రాష్ట్ర రాజకీయాలపై స్పందిస్తూ.. తెలంగాణలో నా ఏకైక లక్ష్యం నెరవేరింది. నాకు ఇంకో లక్ష్యం ఉంది.. కేసీఆర్‌ను జైలుకు పంపడమే. బీఆర్‌ఎస్ సమాధి అయ్యింది. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే. బీఆర్‌ఎస్ కుటుంబ పార్టీ. బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌వైపు చూస్తున్నారు. కాంగ్రెస్‌లో అందరికీ స్వేచ్చ ఉంటుంది. బీఆర్‌ఎస్‌లో ఎవ్వరూ ఉండరు. హరీష్ రావు బీజేపీలోకి వెళ్లేందుకు రెడీగా ఉన్నాడు. జగదీష్ రెడ్డిని మేము కాంగ్రెస్‌లో చేర్చుకోము. ఆయన జైలుకు వెళ్లే వ్యక్తి. జైలుకు వెళ్లే వారిని ఎవరిని మేము కాంగ్రెస్‌లో చేర్చుకోము’ అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment