Komatireddy Raj Gopal Reddy Gives Clarity On Congress Party Resign Rumours, Details Inside - Sakshi
Sakshi News home page

Komatireddy Raj Gopal Reddy: ఇదంతా కేసీఆర్‌ డ్రామా.. కాంగ్రెస్‌కు రాజీనామాపై రాజగోపాల్‌ రెడ్డి క్లారిటీ

Published Sun, Jul 24 2022 12:23 PM | Last Updated on Sun, Jul 24 2022 1:17 PM

Komatireddy Raj Gopal Reddy Clarify On Congress Party Resign - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను హస్తం పార్టీని వీడుతున్నట్టు వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు.  రాజగోపాల్‌ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్‌ పార్టీ​ నుంచి తాను బీజేపీలోకి చేరుతున్నానని అసత్య ప్రచారం చేస్తున్నారు. నేను పార్టీ మారుతున్నట్టు దుష్ప్రచారం జరుగుతోంది.

ఇదంతా కేసీఆర్‌ ఆడుతున్న నాటకం. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసే ప్రసక్తే లేదు. నేను బహిరంగంగానే కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కలిశాను. అమిత్‌ షాతో రాజకీయాల గురించి మాట్లాడలేదు. నేను అమిత్‌ షాను కలిసినప్పటి నుంచి సీఎం కేసీఆర్‌కు నిద్ర పట్టడం లేదు. నేను రాజీనామా చేస్తున్నట్టు టీఆర్‌ఎస్‌ అనుకూల పేపర్లలో రాయిస్తున్నారు. రాజీనామా చేస్తున్నానని, ఉప ఎన్నిక వస్తుందని ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ పార్టీ మారాల్సి వస్తే.. సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీకి చెప్పే పార్టీ మారుతాను. నా రాజీనామాతో మునుగోడు అభివృద్ధి చెందుతుంది అనుకుంటే నేను రాజీనామా చేసేందుకు సిద్ధమే’’ అని స్పష్టం చేశారు. 

ఇది కూడా చదవండి: క్లౌడ్ బరస్ట్, పోలవరం ఎత్తు టీఆర్‌ఎస్‌కు కొత్త ఆయుధాలా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement