
చౌటుప్పల్: మునుగోడు నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ రూ.2 వేల కోట్లు ఇస్తే వెంటనే తన పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సవాల్ విసిరారు. తన నియోజకవర్గంలో ఉన్న 20 వేల దళిత కుటుంబాలున్నాయన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ రాజకీయలబ్ధి కోసం హుజూరాబాద్‌లో అమలు చేస్తోన్న దళితబంధును రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వకుండా ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.