సాక్షి,యాదాద్రిజిల్లా: మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ సమావేశంలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ముఖ్యమంత్రి అని సంబోధించారు.
తన నాలుక మీద మచ్చలున్నాయని, తాను ఏదైనా అంటే నిజమవుతుందని చెప్పారు. ఇప్పటికే ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సీఎం పదవి మిస్ అయిందని, ఆయన భవిష్యత్తులో కచ్చితంగా సీఎం అవుతారని రాజగోపాల్‌రెడ్డి జోస్యం చెప్పారు.
శుక్రవారం(ఆగస్టు30) భువనగిరిలో పార్లమెంట్ నియోజకవర్గస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని రాజగోపాల్‌రెడ్డి ముఖ్యమంత్రి అని సంబోధించడం ఇటు కాంగ్రెస్ వర్గాల్లో, అటు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Comments
Please login to add a commentAdd a comment