సాక్షి, న్యూఢిల్లీ: ‘ఇప్పుడు తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ మూడు రంగుల కాంగ్రెస్ కాదు. అది పసుపు కాంగ్రెస్. రేవంత్‌రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్‌ను కొనుక్కొని కబ్జా చేసుకు న్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ వ్యవహారం వెనుక ఉన్నారు. రేవంత్‌రెడ్డి అనుచరులతో పిలిపించుకొనే ‘సీఎం’ అంటే చంద్రబాబు ముద్దుబిడ్డ రేవంత్‌రెడ్డి అనే అర్థం. చంద్రబాబు డైరెక్షన్‌లోనే హైదరాబాద్‌లోని సీమాంధ్ర పెట్టుబడిదారులు రేవంత్‌ను ముందుపెట్టుకుని.. తెలంగాణను వశం చేసుకోవాలని చూస్తున్నారు’ అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మండిపడ్డారు.
ఇప్పటికైనా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు గుర్తించాలన్నారు. శనివారం ఢిల్లీలో బీజేపీ సీనియర్ నేత వివేక్ వెంకట స్వామితో కలిసి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ చుగ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లతో రాజగోపాల్‌రెడ్డి భేటీ అయ్యారు. అనంతరం తెలంగాణభవన్‌లో మీడి యాతో మాట్లాడారు.
టీఆర్‌ఎస్, కాంగ్రెస్ కొట్టుకుపోతాయి
ఎమ్మెల్యేగా తాను ప్రజాసమస్యలపై అసెంబ్లీలో, బయటా పోరాటం చేశానని రాజగో పాల్‌రెడ్డి పేర్కొన్నారు. ఉప ఎన్నిక అవసరం లేదన్న ఆలోచనతోనే ఇన్ని రోజులు పార్టీ మారలేదని.. కానీ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొ న్నారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ మునుగోడు ఉప ఎన్నిక సునామీలో కొట్టుకుపోతాయ న్నారు. ఈనెల 8వ తేదీ తర్వాత స్పీకర్‌ను కలిసి రాజీనామా లేఖ ఇస్తానని.. అవసరమైతే ఆయన ఇంటి ముందు కూర్చొని అయినా రాజీనామాను ఆమోదింప చేసుకుంటానని చెప్పారు.
రేవంత్‌తో కాంగ్రెస్ మునుగుతోంది..
రాష్ట్రంలో టీఆర్‌ఎస్ గ్రాఫ్ పడిపోతోందని.. రేవంత్‌రెడ్డి చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మునుగుతోందని రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. ‘టీడీపీలో చెడ్డ పనులు చేసినందుకే రేవంత్‌ను జైలుకు పంపించారు. రేవంత్ భాషను చూసి ప్రజలు అసహ్యించుకుంటు న్నారు’ అని రాజగోపాల్‌రెడ్డి తెలిపారు.
చదవండి: నోరు జారా.. క్షమించండి: అద్దంకి
Comments
Please login to add a commentAdd a comment