‘గ్రేటర్‌ వరంగల్‌’లో బీఆర్‌ఎస్‌కు షాక్‌! | - | Sakshi
Sakshi News home page

‘గ్రేటర్‌ వరంగల్‌’లో బీఆర్‌ఎస్‌కు షాక్‌!

Jan 4 2024 1:14 AM | Updated on Jan 4 2024 9:46 AM

- - Sakshi

వరంగల్‌: గ్రేటర్‌ వరంగల్‌లో పలువురు కార్పొరేటర్లు బీఆర్‌ఎస్‌కు షాక్‌ ఇచ్చారు. ఆ పార్టీకి చెందిన ఆరుగురు కార్పొరేటర్లు, పలువురు మాజీ కార్పొరేటర్లు, నాయకులు కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పశ్చిమ, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌, కేఆర్‌ నాగరాజు ఆధ్వర్యంలో హస్తం గూటికి చేరారు. బుధవారం హైదరాబాద్‌ గాంధీభవన్‌లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దీప్‌దాస్‌ మున్షీ సమక్షంలో చేరారు. ప్రజాప్రతినిధులు, నాయకులకు ఆమె పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు.

హనుమకొండ బీఆర్‌ఎస్‌కు చెందిన 7వ డివిజన్‌ కార్పొరేటర్‌ వేముల శ్రీనివాస్‌, 49వ డివిజన్‌ – మానస, 50వ డివిజన్‌ – నెక్కొండ కవిత, 9వ డివిజన్‌ – చీకటి శారద, 48వ డివిజన్‌ – షార్జా బేగం, 31వ డివిజన్‌ – మామిండ్ల రాజ య్య(రాజు) కాంగ్రెస్‌ చేరారు. అంతేకాకుండా మా జీ కార్పొరేటర్లు వీరగంటి రవీందర్‌ స్వామి చరణ్‌, తాడిశెట్టి విద్యాసాగర్‌, మోహన్‌ రావు, చీకటి ఆనంద్‌, నెక్కొండ కిషన్‌, నలుబోల సతీశ్‌, నాయకులు గోల్కొండ రాంబాబు, మైసారపు సిరిల్‌ లారెన్స్‌, సిలువేరు విజయ్‌ భాస్కర్‌, పోగుల శ్రీనివాస్‌ అధికార పార్టీలోకి వెళ్లారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు తోట వెంకన్న, జక్కుల రవీందర్‌ యాదవ్‌, పోతుల శ్రీమాన్‌ సయ్యద్‌ విజయశ్రీ, నాయకులు రజాలీ, బంక సరళ సంపత్‌ యాదవ్‌ పాల్గొన్నారు.

గాంధీభవన్‌ ఎదుట ఎమ్మెల్యేలు నాయిని, నాగరాజు, కార్పొరేటర్లు, నాయకులు

గ్రేటర్‌ పట్టుకోసం కాంగ్రెస్‌ పావులు
గ్రేటర్‌ మున్సిపాలిటీపై పట్టుబిగించేందుకు అధికార కాంగ్రెస్‌ పార్టీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా వలసల ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నికల ముందు కొందరు బీఆర్‌ఎస్‌నుంచి కాంగ్రెస్‌లో చేరారు. తాజాగా మారికొందరు పార్టీని వీడారు. ఇదిలా ఉండగా వరంగల్‌ తూర్పు, వర్ధన్నపేట నియోజకవర్గాలకు చెందిన మరికొంత మంది కార్పొరేటర్లు కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. ఆయా నియోజకవర్గాల అధికార పార్టీ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపాక పార్టీలోకి వెళ్లే అవకాశం ఉంది.

ఇవి చ‌ద‌వండి: సంచలనంగా మారిన‌ బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతలు తీవ్ర స్థాయి వాగ్వాదం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement