సాక్షి, హైదరాబాద్: అన్ని సమస్యలకు తన రాజీనామానే పరిష్కారం అంటూ తెలంగాణ కాంగ్రెస్ నేత, మునుగోడు(నల్లగొండ) ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన కామెంట్లు చర్చనీయాంశంగా మారాయి.
మంగళవారం సాయంత్రం మీడియా ముందుకు రానున్నట్లు ప్రకటించిన ఆయన.. ఆ మీడియా సమావేశంలోనే కాంగ్రెస్ పార్టీకి తన రాజీనామా ప్రకటించే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. అసలు ప్రెస్‌మీట్‌లో ఏం చెప్పబోతున్నానే దానిపై ఆసక్తి నెలకొంది. గత కొంతకాలంగా తెలంగాణ కాంగ్రెస్ పరిణామాలపై ఆయన అసంతృప్తిగా ఉన్నారు. సీనియర్లు మంతనాలు జరిపినా లాభం లేదు. చివరికి పెద్దలతో ఢిల్లీకి రావాలంటూ కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ పంపిన రాయబారానికి సైతం కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పందించలేదు.
ఈ తరుణంలో.. పార్టీ వ్యతిరేక మంతనాలు సాగిస్తున్నారంటూ కాంగ్రెస్ ఆయనపై గుర్రుగా ఉంది. అయితే ఏ క్షణమైనా కాంగ్రెస్ వేటు వేసే అవకాశం ఉండడంతో.. తానే పార్టీని వీడాలని ఆయన ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన రాజీనామానే అన్ని సమస్యలకు పరిష్కారం అని వ్యాఖ్యానించినట్లు స్పష్టం అవుతోంది.
అంతేకాదు.. కాంగ్రెస్‌ను వీడి కాషాయపు పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు ఈ వారంలోనే ఆయన సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతారు-బండి సంజయ్
Comments
Please login to add a commentAdd a comment