
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఎపిసోడ్ తర్వాత మీడియా ముందుకు వచ్చిన రేవంత్ రెడ్డి.. బీజేపీ విసిరిన ఎంగిలి మెతుకులు కోసమే పార్టీ మారారని రాజగోపాల్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
‘కాంట్రాక్టుల కోసం, ఆర్థిక అవసరాల కోసమే పార్టీ మార్పు. ఏనుగులు తినే వాడు పోయి, పీనిగులు తినే వాడు వచ్చాడు. ఇతర పార్టీల నుంచి వ్యక్తులను తీసుకుంటున్నారు. నరేంద్ర మోదీని తెలంగాణ సమాజం బహిష్కరించాలి. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ. ఏపీలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది.. అయినా సోనియా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. ఈడీ ద్వారా కేసులు పేట్టి వేదింపులు చేస్తున్నారు. సోనియా మీద గౌరవం ఉందని తియ్యని మాటలు మాట్లాడారు.సోనియాను ఈడి ప్రశ్నిస్తే , రాజగోపాల్ మాత్రం అమిత్ షా విసిరి కుక్క బిస్కెట్లు కోసం వెళ్లారు’ అని రేవంత్ విమర్శించారు.