
రాజగోపాల్‌రెడ్డి-అమిత్ షా(ఫైల్‌ఫోటో)
హైదరాబాద్: బీజేపీ నేత రాజగోపాల్‌రెడ్డికి హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. ఢిల్లీకి రావాలని రాజగోపాల్‌రెడ్డికి పిలుపు రావడంతో ఆయన బయల్దేరి వెళ్లారు. రాజగోపాల్‌రెడ్డితో పాటు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు పిలుపు రావడంతో ఇద్దరు కలిసి ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. మంగళవారం వీరివురూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు.
ఇటీవల మునుగోడులో జరిగిన ఉప ఎన్నికకు సంబంధించి వీరితో అమిత్ షా చర్చించే అవకాశం ఉంది. బీజేపీ ఓటమికి గల కారణాలను అమిత్ షా అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. అలాగే తెలంగాణ రాజకీయాలపై కూడా సుదీర్ఘంగా చర్చించే అవకాశాలు కనబుడుతున్నాయి. రాబోవు శాసనసభ ఎన్నికల్లో గెలిచి తెలంగాణలో పాగా వేయాలని చూస్తున్న బీజేపీ.. అందుకోసం ఇప్పట్నుంచీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే ఈటల, రాజగోపాల్‌రెడ్డిలకు పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది.