పార్టీ మారితే.. ఫోర్జరీ కేసు కంచికేనా! | - | Sakshi
Sakshi News home page

పార్టీ మారితే.. ఫోర్జరీ కేసు కంచికేనా!

Published Tue, Jun 11 2024 1:14 AM | Last Updated on Tue, Jun 11 2024 10:16 AM

-

 నగరపాలక సంస్థలో మార్ట్‌గేజ్‌ ఫైల్స్‌లో కమిషనర్‌ సంతకాలు ఫోర్జరీ

 ఈ వ్యవహారంలో మేయర్‌ భర్త జయవర్ధన్‌ ప్రమేయం ఉందన్న ఆరోపణ

 టీడీపీలో చేరాలని, లేదంటే కేసులు తప్పవని బెదిరింపులు

 వెనుక నుంచి నడిపిస్తున్న నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి

వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసిన మేయర్‌ దంపతులు

 కేసుల నుంచి తప్పించుకునేందుకే యూటర్న్‌

నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రమాణ స్వీకారానికి ముందే కక్ష సాధింపు రాజకీయ క్రీడకు తెర తీశారు. నెల్లూరు మేయర్‌ దంపతులు వైఎస్సార్‌సీపీ వీడి టీడీపీలో చేరే విధంగా తెర వెనుక కుట్రలకు వ్యూహ రచన చేశారు. నెల్లూరు నగరపాలక సంస్థలో మార్ట్‌గేజ్‌ ఆస్తులను కమిషనర్‌ సంతకాలు ఫోర్జరీతో రిలీజ్‌ చేసిన వ్యవహారంలో మేయర్‌ పోట్లూరి స్రవంతి భర్త జయవర్ధన్‌ పాత్రను తెరపైకి తెచ్చారు. 

మేయర్‌ దంపతులు పార్టీ మారకపోతే కేసులు నమోదు చేయించి జైలుకు పంపిస్తామని ఎమ్మెల్యే కోటంరెడ్డి బెదిరింపులతో కేసుల భయంతో జయవర్ధన్‌ నాలుగు రోజులుగా పరారీలో ఉన్నాడు. ఈ క్రమంలో సోమవారం మేయర్‌ స్రవంతి దంపతులు మీడియా ముందుకు వచ్చి వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తప్పు చేశాం.. క్షమించి అక్కున చేర్చుకోండంటూ నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని కోరారు. దీన్ని బట్టి కోటంరెడ్డి బెదిరింపులతో కేసుల నుంచి తప్పించుకునేందుకు యూటర్న్‌ తీసుకున్నట్లు వైఎస్సార్‌సీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. 

నెల్లూరు (బారకాసు): వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసిన మేయర్‌ దంపతులు టీడీపీ కండువా కప్పు కోవడం ఖాయంగా కనిపిస్తోంది. నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్‌ పదవి గిరిజన మహిళకు రిజర్వేషన్‌ అయింది. నెల్లూరులోని 54 డివిజన్లలో రెండు డివిజన్లు గిరిజనులకు కేటాయించారు. దీంతో అప్పటి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అనుచరుడిగా ఉన్న పోట్లూరి జయవర్ధన్‌ భార్య స్రవంతి గిరిజనులకు రిజర్వ్‌ అయిన 12వ డివిజన్‌ నుంచి బరిలోకి దింపారు. 

అప్పటి మంత్రి పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్‌ సహకారంతో ఏకగ్రీవంగా ఎంపిక చేసి, మేయర్‌ పదవిని సైతం కట్టబెట్టించారు. అయితే శ్రీధర్‌రెడ్డి వైఎస్సార్‌సీపీని వీడి టీడీపీలో చేరిన క్రమంలో మేయర్‌ స్రవంతి దంపతులు సైతం ఆయన వెంట వెళ్లిపోయారు. అప్పట్లో శ్రీధర్‌రెడ్డితో ఉంటామని బహిరంగంగానే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో నెల్లూరు నగర పాలక సంస్థలో జరిగిన సమావేశంలో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లుకు. మేయర్‌కు వాగ్వాదం జరిగింది. 

ఈ సందర్భంగా నెల్లూరు దర్గామిట్ట పోలీస్‌స్టేషన్‌లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఇలా కొన్ని నెలలుపాటు శ్రీధర్‌రెడ్డి వర్గంలోనే ఉన్నారు. ఆ తర్వాత అప్పటి ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డిని నెల్లూరు రూరల్‌ నియోజకవర్గానికి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తగా నియమించింది. దీంతో ఆదాల బాధ్యతలు చేపట్టిన తర్వాత మేయర్‌ దంపతులు తిరిగి వైఎస్సార్‌సీపీ గూటికి చేరారు. తాజాగా మరోసారి మేయర్‌ దంపతులు వైఎస్సార్‌సీపీ వీడారు. గతంలో ఒకసారి టీడీపీ కండువా కప్పుకున్న వీరు మరోమారు ఆ పార్టీ కండువా కప్పుకోవడం ఖాయంగా స్పష్టమవుతోంది.

మేయర్‌ భర్తపై ఫోర్జరీ ఆరోపణలు
తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యేగా కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి గెలుపొందారు. ఈ నేపథ్యంలో నగర పాలక సంస్థలో ఫోర్జరీ వ్యవహారం సంచలనం రేపింది. ఈ ఫోర్జరీ వ్యవహారంలో మేయర్‌ స్రవంతి భర్త ప్రమేయం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో అప్పటి నుంచి మేయర్‌ భర్త జయవర్ధన్‌ పరారీలో ఉన్నాడు. నెల్లూరు నగరంలో భవన నిర్మాణాలకు సంబంధించి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ లేకుండానే దాదాపు 70 భవనాలకు సంబంధించిన మార్టిగేజ్‌ చేసిన ఆస్తులను మాన్యువల్‌గా కమిషనర్‌ ఇచ్చినట్లుగా ఫోర్జరీ సంతకాలు చేసిన లేఖలతో విడుదల చేయడం జరిగింది. దీంతో ప్రభుత్వానికి రూ.కోట్లు నష్టం చేకూరింది. 

ఈ విషయంపై ఓ న్యాయవాది నగర పాలక సంస్థ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పరిశీలించిన కమిషనర్‌ టౌన్‌ప్లానింగ్‌ విభాగంలోని బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్లు ప్రవీణ్‌, దేవేందర్‌లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. 72 గంటల్లో ఇందుకు సంబంధించి వివరణ ఇవ్వాలని పేర్కొన్నా రు. వీరిచ్చే వివరణతో తదుపరి చర్యలు ఉంటాయని కమిషనర్‌ స్పష్టం చేశారు. ఆ గడువు సోమవారం సాయంత్రంతో పూర్తి కానున్న నేపథ్యంలో ఈ విషయంపై విచారణ మొదలు కానుంది. విచారణలో వాస్తవాలు బయటకు వస్తే జరిగిన ఫోర్జరీ వ్యవహారంతో తమకెక్కడ ఇబ్బందులు తలెత్తుతాయన్న భయంతోనే మేయర్‌ దంపతులు యూటర్న్‌ తీసుకున్నారని వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. 

సోమవారం మేయర్‌ దంపతులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమకు పార్టీలు ముఖ్యం కాదని తమకు రాజకీయ భిక్ష పెట్టి ఇంతటి గౌరవప్రదమైన పదవిలో ఉండేలా చేసిన వ్యక్తి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ముఖ్యమన్నారు. తాము తప్పు చేసి వైఎస్సార్‌సీపీలో చేరామని తమని క్షమించి అక్కున చేర్చుకోవాలని ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డిని మీడియా ద్వారా కోరుతున్నామన్నారు. ఫోర్జరీ వ్యవహారంపై విలేకర్లు ప్రశ్నించిన దానికి మేయర్‌ జవాబిస్తూ ఫోర్జరీ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని అధికారులను తాను కోరుతున్నాని, అందు లో తన భర్తపై వచ్చిన ఆరోపణలు రుజువైతే తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తామన్నారు. ఈ క్రమంలోనే మేయర్‌ భర్త జయవర్ధన్‌ కూడా స్పందిస్తూ ఫోర్జరీ విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆ విషయంలో తన ప్రమేయం ఉన్నట్లుగా విచారణలో రుజువైతే ఏశిక్షకై నా తాను సిద్ధంగా ఉంటానని తెలియజేశారు.

రాజీనామాతో ఫోర్జరీ కేసు నీరుగారేనా...
మేయర్‌ దంపతులు వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేశారు. వీరు టీడీపీలో చేరితో ఫోర్జరీ వ్యవహారం నుంచి తప్పించే అవకాశం ఉంటుందా?. ఈ కేసును కంచికే చేరుతుందా? అనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఫోర్జరీ వ్యవహారాన్ని అధికారులు నీరు గార్చినట్లే భావించాల్సి ఉంటుంది. లేకుంటే నిజంగా ఫోర్జరీ జరిగితే అందుకు బాధ్యులపై చర్యలు తీసుకుంటారా? మేయర్‌ భర్తకు సంబంధం ఉందని రుజువైతే అందుకు బాధ్యులైన ఆయనతో పాటు అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే. ఏదీ ఏమైనా మేయర్‌ దంపతులు వైఎస్సార్‌పీకి రాజీనామా చేసేందుకు నిర్ణయం తీసుకున్నామనే విషయం నేడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రమాణ స్వీకారానికి ముందే కక్ష సాధింపు రాజకీయ క్రీడకు తెర తీశారు. నెల్లూరు మేయర్‌ దంపతులు వైఎస్సార్‌సీపీ వీడి టీడీపీలో చేరే విధంగా తెర వెనుక కుట్రలకు వ్యూహ రచన చేశారు. నెల్లూరు నగరపాలక సంస్థలో మార్ట్‌గేజ్‌ ఆస్తులను కమిషనర్‌ సంతకాలు ఫోర్జరీతో రిలీజ్‌ చేసిన వ్యవహారంలో మేయర్‌ పోట్లూరి స్రవంతి భర్త జయవర్ధన్‌ పాత్రను తెరపైకి తెచ్చారు. మేయర్‌ దంపతులు పార్టీ మారకపోతే కేసులు నమోదు చేయించి జైలుకు పంపిస్తామని ఎమ్మెల్యే కోటంరెడ్డి బెదిరింపులతో కేసుల భయంతో జయవర్ధన్‌ నాలుగు రోజులుగా పరారీలో ఉన్నాడు. ఈ క్రమంలో సోమవారం మేయర్‌ స్రవంతి దంపతులు మీడియా ముందుకు వచ్చి వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తప్పు చేశాం.. క్షమించి అక్కున చేర్చుకోండంటూ నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని కోరారు. దీన్ని బట్టి కోటంరెడ్డి బెదిరింపులతో కేసుల నుంచి తప్పించుకునేందుకు యూటర్న్‌ తీసుకున్నట్లు వైఎస్సార్‌సీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేస్తున్నాం  
నెల్లూరు మేయర్‌ దంపతులు
నెల్లూరు (బారకాసు): తాను తన భర్త వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు నెల్లూరు నగర పాలక సంస్థ మేయర్‌ పోట్లూరి స్రవంతి చెప్పారు. సోమవారం స్థానిక నగర పాలక సంస్థ కార్యాలయంలోని మేయర్‌ తన చాంబర్‌లో భర్తతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకున్నా తనకు కార్పొరేటర్‌ టికెట్‌ ఇప్పించడంతో పాటు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా చేయడం అనంతరం మేయర్‌ పదవి కట్టబెట్టిన వ్యక్తి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అని చెప్పారు. తన భర్త జయవర్థన్‌ 15 ఏళ్లుగా స్టూడెంట్‌ నాయకుడిగా ఉన్నప్పటి నుంచి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అనుచరుడిగా ఆయన అడుగు జాడల్లో కొనసాగుతూ వచ్చారన్నారు. 

తన భర్త మంచితనం, ఆయన చేసిన సేవలు గుర్తింపు కారణంగానే ఈ రోజు తాను మేయర్‌ పదవిలో ఉన్నానన్నారు. ఇదంతా కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చలువేనని తెలియజేశారు. శ్రీధర్‌రెడ్డి తమ దంపతులను ఆయన కుటుంబ సభ్యులుగా చూసుకున్నారన్నారు. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వైఎస్సార్‌సీపీని వీడినప్పుడు కూడా తాము మాత్రం శ్రీధర్‌రెడ్డిని వీడేది లేదని ఆ నాడు మీడియా సమావేశంలో చెప్పడం జరిగిందని గుర్తు చేశారు. అయితే అధికారంలో ఉన్న వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు తమను బలవంతం చేయడం వల్లనే తప్పని పరిస్థితుల్లో తాము శ్రీధర్‌రెడ్డిని వీడి వైఎస్సార్‌సీపీలో చేరడం జరిగిందని తెలియజేశారు. తాము రాజకీయంగా శ్రీధర్‌రెడ్డిని వీడామే తప్ప మానసికంగా ఆయనతోనే ఉన్నామని స్పష్టం చేశారు. కాగా, మేయర్‌ దంపతులను పార్టీలో చేర్చుకునేది లేదని నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రకటించడం కొసమెరుపు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement