
ఈ ప్రేమ కథ విషాదాంతం
తొమ్మిదేళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట పెళ్లయిన నెలరోజులకే బలవన్మరణం
విజయనగరం : తొమ్మిదేళ్లుగా ప్రేమించుకున్నారు. కులాలు వేరైనా ఒకటిగా ఉందామని కలలు ఉన్నారు. పెద్దలకు తెలియకుండా ప్రేమ పెళ్లి చేసుకున్నారు. కానీ వారి ప్రేమకథ నెల రోజుల్లోనే విషాదాంతమైంది. స్నేహితులు, పోలీసుల కథనం ప్రకారం మేరకు... నెల్లిమర్ల మండలం మొయిద గ్రామానికి చెందిన కాకర్ల గుణశేఖర్(30), బెరైడ్డి స్రవంతి తొమ్మిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. గుణశేఖర్ మన్యపూరిపేటలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. స్రవంతి వైజాగ్‌లోని తన అక్క వద్ద ఉంటూ ఒక కార్పొరేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేసేది.
కులాలు వేరు కావడంతో తమ ప్రేమను పెద్దలు అంగీకరించరని జూన్ 20న విశాఖపట్నంలోని ఓ శివాలయంలో పెళ్లి చేసుకున్నారు. పూల్‌బాగ్‌కాలనీలో గుణశేఖర్ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. స్రవంతితో ఆమె తల్లిదండ్రులు మాట్లాడడం మానేశారు. దీంతో మనోవేదనకు గురైన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటి వచ్చి విషయం తెలుసుకున్న గుణశేఖర్ స్రవంతి లేని జీవితం తనకు వద్దంటూ అదే ఫ్యానుకే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.