పెడన స్థానిక సంస్థలు వైఎస్ఆర్సీపీ కైవసం | YSRCP Won pedana Municipality Chairman Seat | Sakshi
Sakshi News home page

పెడన స్థానిక సంస్థలు వైఎస్ఆర్సీపీ కైవసం

Published Thu, Sep 29 2016 12:14 PM | Last Updated on Sat, Aug 11 2018 4:24 PM

పెడన స్థానిక సంస్థలు వైఎస్ఆర్సీపీ కైవసం - Sakshi

పెడన స్థానిక సంస్థలు వైఎస్ఆర్సీపీ కైవసం

మచిలీపట్నం: ఒక్క ఓటు తేడాతో పెడన మున్సిపల్ చైర్మన్ పదవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసమైంది. టీడీపీకి చెందిన కౌన్సిలర్ స్రవంతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి బండారు ఆనంద్ ప్రసాద్ కు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో చైర్మన్ పీఠం వైఎస్ఆర్ సీపీకి దక్కింది. పెడన మున్సిపాలిటీకి గతంలో జరిగిన ఎన్నికల్లో 11 మంది కౌన్సిలర్లు వైఎస్ఆర్ సీపీ, మరో 11 మంది కౌన్సిలర్లు టీడీపీ తరపున ఎన్నికయ్యారు.

ఎక్స్ అఫిషియో సభ్యుడుగా స్థానిక ఎమ్మెల్యే కాగిత వెంకటరావు ఉన్నారు. దీంతో టీడీపీదే చైర్మన్ పీఠం అనుకుంటున్న తరుణంలో... కౌన్సిలర్ స్రవంతి ట్విస్ట్ ఇచ్చారు. టీడీపీ తరఫున గెలిచిన ఆమె ........ వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి బండారు ఆనంద్ ప్రసాద్కు ఓటు వేశారు. దీంతో చైర్మన్ కుర్చి వైఎస్ఆర్ సీపీ ఖాతాలోకి వెళ్లింది. పెడన మున్సిపల్ చైర్మన్ ఆకస్మిక మృతి చెందారు. దీంతో చైర్మన్ ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే.

అలాగే పెడన మండల పరిషత్ పీఠం కూడా వైఎస్ఆర్సీపీకే దక్కింది. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి స్పష్టమైన ఆధిక్యం ఉంది. మొత్తం తొమ్మిది ఎంపీటీసీ స్థానాలలో ఐదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో ఉండగా, టీడీపీకి నలుగురే ఉన్నారు. దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అచ్యుతరాజు నేరుగా ఎన్నికయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement