pedana Municipality Chairman
-
పెడన మున్సిపల్ కమిషనర్‌పై దాడికి యత్నం
సాక్షి, పెడన(గూడూరు): మున్సిపల్ కమిషనర్‌పై పారిశుద్ధ్య కార్మికులు దాడికి పాల్పడిన ఘటన పెడన పురపాలక సంఘంలో సోమవారం చోటు చేసుకుంది. సోమవారం ఉదయం వాకింగ్‌కు వెళ్తుండగా తనపై పారిశుద్ధ్య కార్మికులు దాడికి పాల్పడ్డారంటూ కమిషనర్ ఎం.అంజయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి దాడి నుంచి త్రుటిలో తప్పించుకున్నట్లు పేర్కొన్నారు. దాడిలో డ్రైవర్‌కు గాయాలయ్యాయని తెలిపారు. అయితే తనపై కమిషనర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ పారిశుద్ధ్య కార్మికురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలంటూ కార్మికులతో కలసి పురపాలక సంఘం ఎదుట నిరసనకు దిగారు. ఘటనపై ప్రత్యేక అధికారి, బందరు ఆర్డీఓ ఎన్.ఎస్.కె.ఖాజావలి విచారణ నిర్వహించారు. ఇరువర్గాల నుంచి ఫిర్యాదులు వచ్చాయని, విచారించి చర్యలు తీసుకుంటామని ఎస్సై టి.మురళి తెలిపారు. (జగన్ బాత్రూమ్ను లోకేశ్ కడిగాడా?) -
పెడన స్థానిక సంస్థలు వైఎస్ఆర్సీపీ కైవసం
మచిలీపట్నం: ఒక్క ఓటు తేడాతో పెడన మున్సిపల్ చైర్మన్ పదవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసమైంది. టీడీపీకి చెందిన కౌన్సిలర్ స్రవంతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి బండారు ఆనంద్ ప్రసాద్ కు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో చైర్మన్ పీఠం వైఎస్ఆర్ సీపీకి దక్కింది. పెడన మున్సిపాలిటీకి గతంలో జరిగిన ఎన్నికల్లో 11 మంది కౌన్సిలర్లు వైఎస్ఆర్ సీపీ, మరో 11 మంది కౌన్సిలర్లు టీడీపీ తరపున ఎన్నికయ్యారు. ఎక్స్ అఫిషియో సభ్యుడుగా స్థానిక ఎమ్మెల్యే కాగిత వెంకటరావు ఉన్నారు. దీంతో టీడీపీదే చైర్మన్ పీఠం అనుకుంటున్న తరుణంలో... కౌన్సిలర్ స్రవంతి ట్విస్ట్ ఇచ్చారు. టీడీపీ తరఫున గెలిచిన ఆమె ........ వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి బండారు ఆనంద్ ప్రసాద్‌కు ఓటు వేశారు. దీంతో చైర్మన్ కుర్చి వైఎస్ఆర్ సీపీ ఖాతాలోకి వెళ్లింది. పెడన మున్సిపల్ చైర్మన్ ఆకస్మిక మృతి చెందారు. దీంతో చైర్మన్ ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. అలాగే పెడన మండల పరిషత్ పీఠం కూడా వైఎస్ఆర్సీపీకే దక్కింది. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి స్పష్టమైన ఆధిక్యం ఉంది. మొత్తం తొమ్మిది ఎంపీటీసీ స్థానాలలో ఐదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో ఉండగా, టీడీపీకి నలుగురే ఉన్నారు. దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అచ్యుతరాజు నేరుగా ఎన్నికయ్యారు.