సాక్షి, హైదరాబాద్: క్యాబ్ బిల్లు విషయంలో తనపై ఆరోపణలు చేస్తున్న డ్రైవర్‌పై నటి ముమైత్ ఖాన్ గురువారం పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘రెండు రోజుల నుంచి నాపై జరుగుతున్న ఆరోపణలపై ఫిర్యాదు ఇచ్చాను. నా మీద వస్తున్న వార్తలు అన్ని అవాస్తవాలు.12 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో ఉన్నాను. నా క్యారెక్టర్ ఏంటో అందరికీ తెలుసు. నాకు క్యాబ్ డ్రైవర్‌ని చీట్ చేయాల్సిన అవసరం ఏంటి. కొన్ని మీడియా చానళ్లు నా పరువుకి భంగం కలిగేలా వార్తలు ప్రసారం చేశాయి. నా క్యారెక్టర్‌ను జడ్జ్ చేసే అధికారం మీకు ఎక్కడిది. ఒక్కసారి ఆలోచించండి. క్యాబ్ డ్రైవర్ కి 23500 చెల్లించాను. అయినా డ్రైవర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు. డ్రైవర్ రాజు నన్ను వేధించాడు. ఫ్లయిట్స్‌లో పెట్స్‌ను అనుమతించకపోవడంతో క్యాబ్‌లో వెళ్లాను.’ అన్నారు ముమైత్. (చదవండి: థియేటర్‌లో తొలి సినిమా కరోనా వైరస్: ఆర్జీవీ)
ఇక తన క్యాబ్‌లో గోవా టూర్ వెళ్లొచ్చిన ముమైత్ రూ.15 వేల వరకు బాకీ పడిందని రాజు అనే క్యాబ్ డ్రైవర్ మీడియాకు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ మొత్తం తిరిగి చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. మూడు రోజులు గోవాకు కారు బుక్ చేసుకున్న ముమైత్ ఖాన్.. ఆ తర్వాత టూర్‌ని ఎనిమిది రోజులకు పొడిగించిందని రాజు తెలిపాడు. టోల్ చార్జీలకు, డ్రైవర్ అకామిడేషన్‌కు డబ్బులు ఇవ్వలేదని చెప్పాడు. మరో డ్రైవర్‌కు ఇలా జరగకూడదని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment