Goa Tour
-
సోలోగా.. జాలీగా
చేతిలో పాస్‌పోర్టు.. బ్యాగులో మూడు, నాలుగు డ్రెస్సులు, అవసరమైన డబ్బులు.. అంతే.. విమానం ఎక్కేయడం, విదేశాలకు చెక్కేయడమే. ముందుగా వీసా అవసరం లేకుండా వెళ్లగలిగే దేశాలను చుట్టేసి వచ్చేయడమే. ఇది సోలో టూరిస్టుల నయా ట్రెండ్. అదీ గ్రేటర్ హైదరాబాద్ నగరవాసుల్లో మరింత ఎక్కువగా కనిపిస్తోంది. నిమిషం తీరికలేని హడావుడి జీవితంలో కాస్త ఉపశమనం పొందేందుకు విదేశాల బాటపడుతున్నారు. వివిధ దేశాలకు చెందిన పర్యాటక సంస్థలు, ట్రావెల్ ఏజెన్సీలు రకరకాల టూరిస్టు ప్యాకేజీలు, రాయితీలతో హైదరాబాదీలను ఆకట్టుకుంటున్నాయి. ..: సాక్షి, హైదరాబాద్ :..సోలో టూర్లో ఇలా..సోలో టూరిస్టులు చాలా వరకు డమ్మీ హోటల్ బుకింగ్‌లతో ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంటారు. వెళ్లిన దేశాల్లో డార్మిటరీలు, హాస్టల్ సదుపాయం ఉన్నచోట రాత్రి బస చేస్తారు. చిన్న హోటళ్లలో భోజనం చేస్తారు. వీటన్నింటి వల్ల ఖర్చు చాలా వరకు తగ్గుతుంది.⇒ ఒక నగరం నుంచి మరో నగరానికి వెళ్లాల్సివచ్చినప్పుడు.. రాత్రి పూట రైళ్లలో ప్రయాణం చేయడం వల్ల ఎక్కడో ఒకచోట బసచేయాల్సిన అవసరం కూడా ఉండదు. విమాన చార్జీలు, స్థానిక రవాణా చార్జీలు మాత్రమే సోలో టూరిస్టుల బడ్జెట్లో ఎక్కువ ఖర్చు కింద లెక్క.⇒లగేజీ తక్కువే. దీంతో ప్రత్యేకంగా హోటల్లోనే ఉండాలనే ఇబ్బంది కూడా ఉండదు.వీసాలు సులువుగా వస్తుండటంతో..శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతిరోజు సుమారు 15 వేల మంది వివిధ దేశాలకు వెళుతుండగా..అందులో 60శాతం వరకు ‘సోలో టూరిస్టులే’ ఉంటున్నట్లు టూర్ ఆపరేటర్లు చెప్తున్నారు. గోవా, జైపూర్, కశ్మీర్ వంటి పర్యాటక, వినోద ప్రాంతాలకు వెళ్లినట్టుగానే.. ఇప్పుడు సిటీ టూరిస్టులు విదేశీ టూర్లకు వెళ్తున్నారని అంటున్నారు. కోవిడ్ అనంతరం పరిస్థితుల్లో మార్పు వచ్చిందని.. చాలా దేశాలు పర్యాటకులను ఆకట్టుకునేందుకు ‘వీసా ఆన్ అరైవల్, ఫ్రీ వీసా’ వంటివి అందిస్తున్నాయని చెప్తున్నారు.సర్క్యూట్ టూర్లుసాధారణంగా నగర పర్యాటకులు దుబాయ్, సింగపూర్ పర్యటనలకు ఎక్కువగా వెళ్తారు. ఇంటిల్లిపాది కలిసి ఏదో ఒక దేశంలో పర్యటిస్తారు. ఈ మేరకు టూరిస్టు సంస్థలు వీసాతో కలిపి టూర్ ప్యాకేజీలు అందజేస్తాయి. ఇలా నలుగురు కుటుంబ సభ్యులు కలిసి వెళ్లినప్పుడు ఒకటి కంటే ఎక్కువ దేశాల్లో పర్యటించడం కష్టమే. ఫ్యామిలీగా వెళ్లే టూర్లు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ తదితర యూరప్ దేశాలకు ఎక్కువ. కానీ సోలో టూర్లు వీటికి పూర్తి భిన్నంగా ఉంటున్నాయి. సోలో టూరిస్టులు ఒకసారి ఇంటి నుంచి బయలుదేరితే మూడు, నాలుగు దేశాల్లో పర్యటించేలా ప్రణాళికలను రూపొందించుకుంటున్నారు.ప్రస్తుతం మలేసియా, థాయ్‌లాండ్, శ్రీలంక, మాల్దీవులు, నేపాల్ ఉచిత వీసా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. దీంతో ఎక్కువ మంది ఈ దేశాల్లో పర్యటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. సింగపూర్‌కు ఈ–వీసా సదుపాయం ఉంది. దీంతో చాలా మంది సింగపూర్‌కు ఈ–వీసాపై వెళ్లి అక్కడి నుంచి మలేసియా, థాయ్‌లాండ్‌లనూ చుట్టి వచ్చేస్తున్నారు. ఇక ఇండోనేషియా, కంబోడియా, వియత్నాం తదితర దేశాలు వీసా ఆన్ అరైవల్ సదుపాయం అందిస్తున్నాయి. సోలో టూరిస్టులు ఈ దేశాలకు కూడా ఎక్కువగా వెళ్తున్నట్లు పర్యాటక సంస్థలు చెప్తున్నాయి. కంబోడియాలోని పల్లవుల నాటి అంగ్‌కోర్‌వాట్ దేవాలయం, ఇండోనేషియాలోని బాలి, జావా, సుమత్రా తదితర ద్వీపాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయని అంటున్నాయి.వియత్నాంలో బైక్ రైడింగ్సిటీ టూరిస్టులను కొంత కాలం నుంచి విశేషంగా ఆకట్టుకుంటున్న మరో పర్యాటక దేశం వియత్నాం. తక్కువ విమానచార్జీలతో ఈ చిన్న దీవుల దేశంలో పర్యటించవచ్చు. ఇండోనేషియాలోని బాలి బీచ్ కల్చర్ పర్యాటకులను ఆకట్టుకుంటుండగా.. వియత్నాంలో బైక్ రైడింగ్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్లిన పర్యాటకులు అద్దె బైక్‌లపై ఉత్తరం నుంచి దక్షిణం వరకు రైడ్ చేసేందుకు ఇష్టపడుతున్నారు. ‘వియత్నాం చిన్న దేశం. ఉత్తరం నుంచి దక్షిణం వరకు 2,000 కిలోమీటర్లలోపే ఉంటుంది.బైక్‌పై ప్రయాణం ఎంతో అద్భుతంగా ఉంటుంది’’ అని నగరానికి చెందిన టూరిస్టు సుబ్బారెడ్డి తెలిపారు. దేశ, విదేశాలకు చెందిన టూరిస్టులు బైక్ రైడింగ్ కోసం వియత్నాంకు వస్తారని చెప్పారు. ఇక తక్కువ బడ్జెట్లో సందర్శించే సదుపాయమున్న మరో దేశం ఫిలిప్పీన్స్. దీవుల సముదాయమైన ఈ దేశంలో పర్యటించడం హైదరాబాద్ నుంచి గోవా ట్రిప్పు కోసం వెళ్లినట్లుగానే సింపుల్‌గా ఉంటుంది. వీసా ఆన్ అరైవల్, ఈ–వీసా సదుపాయాలున్న తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ తదితర దేశాలకు కూడా సిటీ పర్యాటకులు వెళ్తున్నారు.వేర్వేరు దేశాలకు వెళ్తూ ఉంటా..2013 నుంచీ విదేశాల్లో పర్యటిస్తున్నాను. ఇప్పటివరకు 65 దేశాలు తిరిగాను. విదేశాల్లో విభిన్నమైన, వైవిధ్యమైన సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజల జీవన విధానం, ఆహార అలవాట్లు వంటివి తెలుసుకోవడం, పరిశీలించడం నాకెంతో ఇష్టం. ఎక్కడికెళ్లినా అక్కడి ప్రజలతో మమేకమవుతాను. పర్యాటక ప్రదేశాలను సందర్శించడం కంటే అక్కడి ప్రజలను కలిసేందుకే ఇష్టపడతాను. – సుబ్బారెడ్డి, రెగ్యులర్ టూరిస్ట్2 నెలలకోసారి మలేసియా వెళ్తా..కనీసం రెండు, మూడు నెలలకు ఒకసారి మలేసియాకు వెళ్తాను.ఏదో ఒక ప్రాంతంలో పర్యటిస్తాను. అక్కడి తెలుగు సంఘాల ఆధ్వర్యంలో నడిచే స్కూళ్లలో పిల్లలకు తెలుగు బోధిస్తాను.దాంతో మలేసియాతో ఒక అనుబంధం ఏర్పడింది. – రాఘవాచార్య, టీచర్ఇదీ రాకపోకల లెక్క (సుమారుగా)..⇒ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతిరోజు రాకపోకలు సాగించే ప్రయాణికులు 65,000 నుంచి 70,000⇒ అందులో దేశీయ ప్రయాణికులు 55,000⇒ అంతర్జాతీయ ప్రయాణికులు దాదాపు 15,000⇒ సోలో టూరిస్టులు 7,000 నుంచి 9,000 -
సత్తెనపల్లి: తీవ్ర విషాదం నింపిన గోవా ట్రిప్
సత్తెనపల్లి: తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సత్తెనపల్లి వాసులు మృతి చెందిన ఘటన శుక్రవారం ఉదయం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. సత్తెనపల్లికి చెందిన సినిమా థియేటర్ యజమాని షేక్ షుకూర్ (55)తోపాటు షేక్ బాషా (52), కొఠారు అంజయ్య కలిసి కారులో ఈనెల 22న గోవా ట్రిప్ వెళ్లారు. ట్రిప్ ముగించుకుని బుధవారం సాయంత్రం కారులో తిరుగు ప్రయాణమయ్యారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామ సమీపంలో 167వ జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న లారీని కారు వేగంగా వెళ్ళి ఢీకొట్టింది. కారు లారీ కింద ఇరుక్కుపోగా లారీ డ్రైవర్ గమనించకుండా కొంత దూరంపాటు లారీ నడుపుకుంటూ వెళ్ళాడు. దీంతో కారు నుజ్జునుజ్జు అయింది. ముందు సీటులో ఉన్ను షేక్ బాషా, వెనుక సీట్లో ఉన్న షేక్ షుకూర్ అక్కడికక్కడే మృతి చెందారు. వెనుక సీటులో ఉన్న కొఠారు అంజయ్యకు కాలు, చెయ్యి, నడుముకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించారు. డ్రైవర్ ప్రశాంత్ కుమార్ సీట్ బెల్ట్ ధరించడం వల్ల అతనికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. షుకూర్‌కు భార్య, ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. పిల్లులు ముగ్గురికి వివాహాలయ్యాయి. షేక్ బాషాకు భార్య, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉండగా కుమార్తెకు వివాహమైంది. ఇద్దరూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో విషాదం అలుముకుంది. రెండు కుటుంబాల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. షేక్ షుకూర్ ఎంతో జాగ్రత్తపరుడు. ఆయనకు లిఫ్ట్, ఫ్లైట్ అంటే భయం. ఎన్ని మెట్లు అయినా ఎక్కేవారు. ఎంత దూరమైనా కారులోనే ప్రయాణించేవారు. చివరికి కారు ప్రయాణమే ఆయనను తిరిగిరాని లోకాలకు చేర్చింది. ప్రమాద విషయం తెలియగానే మరో సినిమా థియేటర్ యజమాని షేక్ సలాం, షుకూర్ కుమారులు కారులో ఘటనా స్థలానికి వెళ్లారు. గురువారం అర్ధరాత్రికి మృతదేహాలను సత్తెనపల్లికి తీసుకువచ్చారు. -
ప్రియురాలితో గోవా టూర్ కోసం ఏం చేశాడో తెలిస్తే షాకే!
సాక్షి, బెంగళూరు: ప్రియురాలితో గోవా విహారయాత్రకు వెళ్లేందుకు ఇంట్లోనే చోరీకి పాల్పడిన యువకుడిని మంగళవారం ఆడుగోడి పోలీసులు అరెస్ట్‌చేశారు. ఆడుగోడి మహాలింగేశ్వరబండె ఏరియాలో సోదరుడు సల్మాన్‌తో కలిసి నిందితుడు మహమ్మద్ ఇర్ఫాన్ ఉంటున్నాడు. సల్మాన్ సేల్స్‌మ్యాన్‌గా పనిచేస్తుంటే ఇర్ఫాన్ బలాదూర్‌గా తిరిగేవాడు. ఇటీవల ఓ యువతిని ప్రేమించాడు. ఆమె గోవా టూర్‌కు తీసుకెళ్లాలని కోరింది. సరేనన్న ఇర్ఫాన్ డబ్బుల కోసం ఆలోచించి ఇంట్లోనే చోరీకి ప్లాన్ చేశాడు. బీరువాలో ఉన్న 103 గ్రాముల బంగారు నగలు తీసుకుని ఉడాయించాడు. విషయం తెలిసి సల్మాన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు గోవాకు వెళ్లి షికార్లు చేస్తున్న ఇర్ఫాన్‌ను అరెస్ట్‌చేసి అతడి వద్ద నుంచి 103 గ్రాముల బంగారు ఆభరణాలు, కొంత డబ్బును స్వాధీనం చేసుకున్నామని ఆగ్నేయవిభాగ డీసీపీ సీకే.బాబా తెలిపారు. చదవండి: (నివేదన ప్రేమవివాహం.. ఇంటికి వచ్చి చూసే సరికి..) -
New Rules In Goa: గోవాలో ఈ పనులు చేస్తే భారీగా జరిమానా
పనాజీ: గోవా వెళ్లి స్నేహితులతో పార్టీ చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే, ఈ కొత్త నిబంధనలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. లేదంటే భారీగా జరిమానా పడే అవకాశం ఉంది. గోవాలో పర్యటకాన్ని మరింత బలోపేతం చేసే దిశగా, టూరిస్టు ప్రాంతాలు పరిశుభ్రంగా, సురక్షితంగా ఉండేందుకు అక్కడి ప్రభుత్వం కఠిన నిబంధనలను తీసుకొచ్చింది. ఆయా నిబంధనలను అతిక్రమిస్తే భారీగా జరిమానాలు విధిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు అక్టోబర్ 31వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. ‘ఓ వ్యక్తి, కంపెనీ, సంఘం, సంస్థ ఏదైనా నిబంధనలు ఉల్లఘిస్తే రూ.5000 జరిమానా విధిస్తాం. ఆ ఫైన్ రూ.50,000 వరకు సైతం ఉండవచ్చు. ఐపీసీలోని సెక్షన్ 188 ప్రకారం చర్యలు ఉంటాయి.’ అని గవర్నమెంట్ ఆర్డర్లో పేర్కొంది. కొత్త నిబంధనల ప్రకారం బీచ్‌లోని బహిరంగ ప్రదేశాల్లో వంట చేయటం, డ్రైవింగ్ వంటివి నిషేదం. బీచ్‌లో చెత్త పారవేయటం, మద్యం బాటిళ్లను పగలగొడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. కొద్ద నిబంధనలు ఇలా.. ► ఇకపై బీచ్‌లో డ్రైవింగ్ చేయకూడదు. బహిరంగ ప్రదేశంలో వంట వండటం నిషేదం. ► బీచ్‌లో చెత్త వేయటం, తాగి పడేసే బాటిళ్లను పగలగొట్టటం నేరం. ► టూరిస్టులతో పాటు వారికి సేవలందిస్తున్న వివిధ సంస్థలు, వ్యాపారస్తులకు సైతం కొత్త నిబంధనలు వర్తిస్తాయి. ► వాటర్ స్పోర్ట్స్ కేవలం గుర్తింపు పొందిన ప్రాంతాల్లోనే నిర్వహించాలి. ► టికెట్ల జారీ గుర్తింపు పొందిన కౌంటర్ల వద్దే నిర్వహించాలి. బహిరంగంగా టికెట్లు జారీ చేయకూడదు. ► తోపుడి బండిపై వ్యాపారం చేసే వారు పర్యటకులకు అడ్డుపడితే జరిమానా పడుతుంది. ► ఎవరైనా టూరిస్టులను డబ్బులు అడగడం, అల్లర్లు సృష్టించటం చేస్తే చర్యలు తప్పవు. ► నిబంధనలను అతిక్రమించిన వారికి రూ.5వేల నుంచి రూ.50వేల వరకు జరిమానా విధించనున్నారు. ఇదీ చదవండి: పీఎంగా రిషి సునాక్ తొలిసారి బిగ్ యూ-టర్న్.. ఆ నిర్ణయంలో మార్పు -
స్నేహితుడి భార్యపై కన్నేశాడు.. గోవా ట్రిప్ ప్లాన్ చేసి..
సాక్షి, గుంటూరు: రెండు సంవత్సరాల కిందట తాడికొండ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఇద్దరు యువకుల మిస్సింగ్ కేసును ఛేదించినట్లు నార్త్ జోన్ డీఎస్పీ జే రాంబాబు తెలిపారు. రూరల్ సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తాడికొండ మండలం లాం గ్రామానికి చెందిన శాఖమూరి అజయ్‌సాయి, గుంటూరు నెహ్రూనగర్‌కు చెందిన చల్లపల్లి ఫణికృష్ణ(25)లు స్నేహితులు. వారిద్దరూ స్నేహితులతో కలిసి మద్యం సేవించేవారు. ఈ నేపథ్యంలో హతుడు చల్లిపల్లి ఫణికృష్ణ, నిందితుడు అజయ్‌సాయి భార్యపై కన్నేశాడు. ఈ విషయాన్ని సాయికి చెప్పడంతో పాటు ఆమె డెలివరీకి వెళ్లిన సమయంలో ఎప్పుడూ వస్తుందంటూ వేధించేవాడు. ఈ నేపథ్యంలో ఫణికృష్ణను అంతమొందించేందుకు సాయి ప్రణాళిక రూపొందించాడు. ఇద్దరూ కలిసి గోవా ట్రిప్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. 2020 ఫిబ్రవరి 16వ తేదీన రాత్రి 11 గంటలకు కారులో ఇద్దరూ బయలేదేరారు. మంజునాథ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వేసిన స్థలాలలో పిచ్చి మొక్కలు పెరిగి ఉండడంతో ఖాళీ స్థలంలో కూర్చుని ఇద్దరూ మద్యం సేవిస్తున్నారు. చదవండి: (కోడి కూరతో అన్నం పెట్టమన్నాడు.. ఆ మాటకు గొడ్డలితో నరికేశాడు) అజయ్‌సాయి భార్య గురించి అసభ్యంగా మాట్లడడంతో ఆగ్రహం చెందిన అతను పక్కనే ఉన్న రాయితో కృష్ణ తలపైన కొట్టి చంపాడు. ముందుగా అనుకున్న ప్రకారం కారులో తెచ్చుకున్న పెట్రోల్‌తో హతుడిని తగులపెట్టి సమీపంలో తన పర్సు, ఓటర్ ఐడీ, ఆధార్‌కార్డు వదిలి కారులో తన బట్టల బ్యాగ్‌ను వుంచి హతుడికి చెందిన బట్టల బ్యాగ్, సెల్‌ఫోన్, పెన్‌డ్రైవ్, ఎస్డీ కార్డు తీసుకుని పారిపోయాడు. చదవండి: (వివాహేతర సంబంధం.. ఒకే గదిలో ముగ్గురు.. చివరకు..) అదే నెలలో 19వ తేదీన సాయి తల్లి శైలజ తన కుమారుడితోపాటు అతని స్నేహితుడు ఫణికృష్ణ కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. తాడికొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అప్పటి నుంచి అజయ్‌సాయి అదృశ్యమయ్యాడు. చివరకు ఈనెల 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. హత్య చేసిన విషయాన్ని పోలీసులకు వివరించాడు. దీంతో నిందితుడిని కోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించినట్లు తెలిపారు. సమావేశంలో రూరల్ సీఐ వి భూషణం, తాడికొండ ఎస్ఐ వెంకటాద్రి, సిబ్బంది పాల్గొన్నారు. -
మోదీ బలపడుతున్నారంటే.. కాంగ్రెస్‌దే పాపం
పనాజీ: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ప్రధానమంత్రి మంత్రి నరేంద్ర మోదీ బలపడడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని నిందించారు. కాంగ్రెస్ రాజకీయాల్ని సీరియస్‌గా తీసుకోవడం లేదని, దీంతో మోదీ బలీయమైన శక్తిగా మారుతున్నారని దుయ్యబట్టారు. మోదీకి ప్రచారం చేయడానికి కాంగ్రెస్ ఉన్నట్టుగా అనిపిస్తోందని అన్నారు. మరోవైపు బీజేపీపై కూడా విమర్శనాస్త్రాలు సంధించారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దాదాగిరిని సహించే ప్రసక్తే లేదని దీదీ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న గోవాలో మూడు రోజుల పర్యటనను ముగించుకున్న మమతా బెనర్జీ శనివారం విలేకరులతో మాట్లాడారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని రేసులో మీరుంటారా అని విలేకరుల అడిగిన ప్రశ్నకు తాను ఎప్పుడూ ఎల్ఐపీ (లెస్ ఇంపార్టెంట్ పర్సన్)గా , వీధిపోరాటాలు చేసే వ్యక్తిగా ఉండాలనే కోరుకుంటున్నానని చెప్పారు. కాంగ్రెస్ నిర్ణయాలు తీసుకోలేదు: కాంగ్రెస్ పార్టీకి నిర్ణయాలు తీసుకోవడం చేతకావడం లేదని దీంతో దేశం బాధపడే పరిస్థితులు వచ్చాయని మమత వ్యాఖ్యానించారు. ‘‘కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను ఏ మాత్రం సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఆ పార్టీ వల్లే మోదీ మరింత శక్తిమంతంగా ఎదుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీకి టీఆర్పీ రేటింగ్లా ఉంది. ఆ పార్టీ సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల దేశం బాధపడాల్సి వస్తోంది. ప్రతిపక్షాలు ఐక్యంగా ముందుకు సాగడానికి కాంగ్రెస్‌కు ఎన్నో అవకాశాలు వచ్చినా ఆ పార్టీ అందిపుచ్చుకోలేదు. ఆ పార్టీ నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితుల్లో ఉంటే దేశం ఎందుకు నష్టపోవాలి’’ అని మమత ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమయంలో తమ పార్టీతో జత కట్టే అవకాశాన్ని కాంగ్రెస్ వదులుకొని లెఫ్ట్‌తో చేతులు కలిపిందని, అలా చేయడం వల్ల ఒక్క స్థానంలో కూడా వాళ్లు గెలవలేకపోయారని ఎద్దేవా చేశారు. బీజేపీతో పోరాడడానికి బదులు కాంగ్రెస్ పార్టీ తమతో పెట్టుకుందని, దానికి తగ్గ ఫలితాన్ని చూసిందని మమత వ్యాఖ్యానించారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటేనే రాష్ట్రాలు బాగుంటాయని, అప్పుడే కేంద్ర ప్రభుత్వం కూడా బాగుంటుందని మమత అన్నారు. -
న్యూయర్: గోవా వెకేషన్ టూర్లో చైసామ్..
-
పంజాగుట్ట పీఎస్‌లో ముమైత్ ఖాన్ ఫిర్యాదు
-
రాజు నన్ను వేధించాడు: ముమైత్ ఖాన్
సాక్షి, హైదరాబాద్: క్యాబ్ బిల్లు విషయంలో తనపై ఆరోపణలు చేస్తున్న డ్రైవర్‌పై నటి ముమైత్ ఖాన్ గురువారం పంజాగుట్ట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘రెండు రోజుల నుంచి నాపై జరుగుతున్న ఆరోపణలపై ఫిర్యాదు ఇచ్చాను. నా మీద వస్తున్న వార్తలు అన్ని అవాస్తవాలు.12 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో ఉన్నాను. నా క్యారెక్టర్ ఏంటో అందరికీ తెలుసు. నాకు క్యాబ్ డ్రైవర్ని చీట్ చేయాల్సిన అవసరం ఏంటి. కొన్ని మీడియా చానళ్లు నా పరువుకి భంగం కలిగేలా వార్తలు ప్రసారం చేశాయి. నా క్యారెక్టర్‌ను జడ్జ్ చేసే అధికారం మీకు ఎక్కడిది. ఒక్కసారి ఆలోచించండి. క్యాబ్ డ్రైవర్ కి 23500 చెల్లించాను. అయినా డ్రైవర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు. డ్రైవర్ రాజు నన్ను వేధించాడు. ఫ్లయిట్స్‌లో పెట్స్‌ను అనుమతించకపోవడంతో క్యాబ్‌లో వెళ్లాను.’ అన్నారు ముమైత్. (చదవండి: థియేటర్లో తొలి సినిమా కరోనా వైరస్: ఆర్జీవీ) ఇక తన క్యాబ్‌లో గోవా టూర్ వెళ్లొచ్చిన ముమైత్ రూ.15 వేల వరకు బాకీ పడిందని రాజు అనే క్యాబ్ డ్రైవర్ మీడియాకు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ మొత్తం తిరిగి చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. మూడు రోజులు గోవాకు కారు బుక్ చేసుకున్న ముమైత్ ఖాన్.. ఆ తర్వాత టూర్‌ని ఎనిమిది రోజులకు పొడిగించిందని రాజు తెలిపాడు. టోల్ చార్జీలకు, డ్రైవర్ అకామిడేషన్‌కు డబ్బులు ఇవ్వలేదని చెప్పాడు. మరో డ్రైవర్‌కు ఇలా జరగకూడదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పాడు. -
ముమైత్ ఖాన్ మోసం చేసింది: క్యాబ్ డ్రైవర్
-
ముమైత్ ఖాన్ మోసం చేసింది: క్యాబ్ డ్రైవర్
సాక్షి, హైదరాబాద్: సినీ నటి ముమైత్ ఖాన్ డబ్బులు ఎగ్గొట్టిందని ఓ క్యాబ్ డ్రైవర్ ఆరోపించాడు. తన క్యాబ్‌లో గోవా టూర్ వెళ్లొచ్చిన ముమైత్ రూ.15 వేల వరకు బాకీ పడిందని రాజు అనే క్యాబ్ డ్రైవర్ మీడియాకు తెలిపాడు. ఆ మొత్తం తిరిగి చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. మూడు రోజులు గోవాకు కారు బుక్ చేసుకున్న ముమైత్ ఖాన్.. ఆ తర్వాత టూర్‌ని ఎనిమిది రోజులకు పొడిగించిందని రాజు తెలిపాడు. టోల్ చార్జీలకు, డ్రైవర్ అకామొడేషన్‌కు డబ్బులు ఇవ్వలేదని చెప్పాడు. మరో డ్రైవర్‌కు ఇలా జరగకూడదని అన్నాడు. ఘటనపై క్యాబ్ డ్రైవర్ అసోసియేషన్‌తో చర్చించిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపాడు. (చదవండి: నా బలం నాకు తెలుసు) -
సెలబ్రేషన్@గోవా
నాగచైతన్య, సమంతల పెళ్లి గతేడాది గోవాలో జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. మళ్లీ చైతన్య, సమంత గోవా వెళ్లారు. గురువారం నాగచైతన్య పుట్టినరోజు. ఈ సందర్భంగా గోవా వెళ్లారు చై, సామ్. బర్త్‌డే వేడుకలను గోవాలో సెలబ్రేట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ‘హోమ్ స్వీట్ హోమ్ గోవా’ అని ఇన్స్టాగ్రామ్ స్టేటస్‌లో పేర్కొన్నారు సమంత. ఇక సినిమాల విషయానికి వస్తే... ‘మజిలీ’ (వర్కింగ్ టైటిల్) సినిమాలో నాగచైతన్య, సమంత కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. వెంకటేశ్, నాగచైతన్యల ‘వెంకీమామ’ సినిమా డిసెంబర్లో స్టార్ట్ కానుంది. అలాగే సమంత నటించనున్న లేడీ ఒరియంటెడ్ మూవీ ‘మిస్. గ్రానీ’కి సంబంధించిన ప్రీ–ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా చిత్రీకరణ వచ్చే ఏడాది ప్రారంభం అవుతుంది. -
గోవా చుట్టొద్దామా?
ప్రియురాలు ప్రియాంక చోప్రా నూతన గృహ ప్రవేశానికి ఫారిన్ నుంచి బాయ్‌ఫ్రెండ్, హాలీవుడ్ స్టార్ సింగర్ నిక్ జోనస్ ఇండియా వచ్చిన సంగతి తెలిసిందే. శనివారం వీళ్లిద్దరూ కొత్త ఇంట్లో డిన్నర్ చేయడమే కాదు.. వాన చినుకుల్లో ప్రియాంక డ్యాన్స్ కూడా చేశారు. ఈ పోస్ట్‌లను నిక్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ డిన్నర్లో ప్రియాంక తల్లి మధు చోప్రా కూడా పాల్గొన్నారు. నిక్ ఇండియాలో ఉన్నన్ని రోజులు ప్రేమికుడితో షికార్లు కొడదాం అనుకొనుంటారు ప్రియాంక. వీళ్లిద్దరూ కలసి గోవా షికారుకు బయల్దేరారు. వీరితో పాటు ప్రియాంక కజిన్, హీరోయిన్ పరిణీతీ చోప్రా, బ్రదర్ సిద్ధార్థ్ కూడా జాయిన్ అయ్యారట. ఇలా చెట్టా పట్టాలేసుకొని తిరుగుతున్న ఈ జంట భార్యాభర్తలవుతారా? వెయిట్ అండ్ సీ. -
రాహుల్ వచ్చారు.. ఎమ్మెల్యే వెళ్లిపోయారు!
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గోవా పర్యటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఆయన అలా అడుగుపెట్టారో లేదో, పలువురు నేతలు ఆ పార్టీని వీడి వెళ్లిపోతున్నారని చెప్పారు. ''గోవాలో రాహుల్ గాంధీ పర్యటన ప్రభావం ఏంటో చూడండి.. మొదటిరోజు ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేశారు'' అని మార్గోవా నియోజకవర్గంలో జరిగిన విజయ్ సంకల్ప్ ర్యాలీ సందర్భంగా పర్సేకర్ అన్నారు. ఈనెల 17వ తేదీ శనివారం నాడు రాహుల్ గాంధీ గోవాలో పర్యటించగా.. అదే రోజు ఆ పార్టీ ఎమ్మెల్యే మౌవిన్ గోడిన్హో రాజీనామా చేసి, బీజేపీలో చేరారు. రెండో రోజు కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి మనోహర్ అస్గావ్కర్ కూడా ఆ పార్టీని వదిలిపెట్టి వెళ్లిపోయారని.. ఇప్పుడు ఇంకెంత మంది ఆ పార్టీని వీడి బయటకు వస్తారో చూడాల్సి ఉందని అన్నారు. అస్గావ్కర్ ఎంజీపీలో చేరారు. తన ర్యాలీకి కనీసం 50 వేల మంది తక్కువ కాకుండా తీసుకురావాలని స్థానిక నాయకులకు రాహుల్ గాంధీ చెప్పగా.. కేవలం కొన్ని వేల మంది మాత్రమే వచ్చారని సీఎం అన్నారు. బస్సులన్నీ ఖాళీగా వచ్చాయని ఎద్దేవా చేశారు. -
సెల్ఫీ తీస్తుండగా ప్రమాదం
ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు పనాజి: గోవా పర్యటనకు వచ్చిన ఇద్దరు మహిళలు సెల్ఫీ కారణంగా తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం పనాజిలోని ఓ రిసార్టులో భవనం ఒకటో అంతస్తు వరకు వేసిన పరంజాపైకి 20 ఏళ్లకుపైబడిన ఇద్దరు మహిళలు ఎక్కారు. వారు తమ సెల్‌ఫోన్‌తో సెల్ఫీ తీసుకుంటుండగా పరంజా ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో వారు కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే వారిని మణిపాల్‌లోని ఆసుపత్రికి తరలించారు. ఆ మహిళల వెన్నెముకలకు తీవ్రగాయాలయ్యాయని ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్ శేఖర్ సల్కార్ తెలిపారు. ఆ మహిళల వివరాలు వెల్లడించేందుకు ఆసుపత్రి వర్గాలు నిరాకరించాయి. ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. -
నయా సాల్.. గోవా టూర్
న్యూ ఇయర్.. కామన్ పీపుల్‌కి పబ్బులు, క్లబ్బులు, రిసార్టులు, రెస్టారెంట్లను తలచుకొనే, వీలైతే వాటిని కలుసుకునే సందర్భం. కానీ సిటీలోని పార్టీ వెన్యూలు చూసి.. చూసి.. వెళ్లి విసిగిపోయిన వారికి మాత్రం టూర్ టైమ్. పండగ పూట కూడా పాత వంటేనా.. అనే ఫీలింగ్‌తో కొత్త ఏడాదికి వెల్కమ్ చెప్పడానికి ఏ ఊరెళ్లాలా అని ప్లాన్ చేసుకుంటారు పార్టీ యానిమల్స్. బృందాలుగా సెలబ్రేషన్స్‌కు చెక్కేసే వారి అభిరుచులకు అనుగుణంగా ఆఫర్లతో సిద్ధంగా ఉంటారు టూర్ ఆపరేటర్స్. - ఎస్.సత్యబాబు గోవాలో పాపులరైన ‘సన్‌బర్న్’ పార్టీ.... పార్టీ ప్రియుల ఆకాంక్షలకు రెక్కలొచ్చాయి. నిబంధనలు, తనిఖీల మధ్య చేసుకునే పార్టీలంటే విసిగి పోతున్నారు. అలాంటి వారికి స్వేచ్ఛగా, యథేచ్ఛగా విహరించే అవకాశాన్ని అందిస్తూ.. ఆహ్వానించే ఏకైక గమ్యంగా స్థిరపడిపోతోంది గోవా. రావా అంటున్న గోవా.. చుట్టూ సముద్రం, దాని మీద తేలియాడే క్రూయిజ్ కేసినోలు.. దేశ విదేశీ పర్యాటకుల ప్రవాహం.. బీర్లనూ, మనసులనూ పొంగించే బీచ్ ఫెస్టివల్స్.. ఎక్సైజ్ పన్ను మినహాయింపు పుణ్యమాని తక్కువ ధరల్లో లభించే ‘కిక్కు’.. ఇంకేం కావాలి? అందుకే సిటీలోని పేజ్‌త్రీ పీపుల్, సోషలైట్స్, సినీ సెలబ్రిటీలు మొత్తం గోవాకే జై కొడుతున్నారు. పాకెట్ ఫ్రెండ్లీ.. ‘సిటీలోని సిసిలైన పార్టీ లవర్స్‌లో 90 శాతం గోవాలోనే ఉంటారు. కాస్త ట్రెడిషనల్‌గా ఉండేవారు మాత్రమే ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు’ అని చెప్పారు డీజే మూర్తి. దాదాపు 20 ఏళ్లుగా సిటీలో డీజేగా చేస్తున్న మూర్తి.. గత కొన్నేళ్లుగా క్రమం తప్పకుండా గోవాలోనే ప్లే చేస్తున్నారు. ఈసారి కూడా మరో రెండ్రోజుల్లో గోవా వెళ్తానని చెప్పారు. కాస్త సమయం ఉన్నవారు క్రిస్మస్కు సైతం గోవాలోనే ఉండేలా ప్లాన్ చేసుకుంటుంటే, కొందరు నెలాఖరున వెళ్లి రెండ్రోజులకే పరిమితమవుతున్నారు. ‘సిటీలో స్టార్ హోటల్లో న్యూ ఇయర్ ఈవెంట్ అంటే కపుల్ పాస్ కనీసం రూ.15 వేలు. దాదాపు అంతే మొత్తంలో గోవా వెళ్లి వచ్చేయొచ్చు’అని చెప్పారు ఐటీ ఉద్యోగి కిరణ్. ట్రావెలర్స్ క్యూ.. కిరణ్ లాంటి వాళ్లకు గోవా టూర్‌ని ఇలా పాకెట్ ఫ్రెండ్లీగా మార్చడమనే ఘనత టూర్ ఆపరేటర్లకే దక్కుతుంది. న్యూ ఇయర్ టైమ్‌లో గో... గోవా అంటూ హుషారుగా సాగిపోయేవారు పెరుగుతుండడంతో ఆపరేటర్లు ఆఫర్ల వర్షం కురిపిస్తున్నారు. నూతన సంవత్సరారంభ వేళ.. సముద్ర తీర సంబరాల్లో మునిగితేలేందుకు.. సిటీ నుంచి అక్కడికి వెళ్లి రావడానికి అయ్యే ఖర్చు ఎంతో తెలుసా? రూ.5600 మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని.. అది కూడా అక్కడ బస, ఆహారంతో కలిపి అని సిటీకి చెందిన పవన్ తేజ టూర్స్ అండ్ ఆపరేటర్స్ నిర్వాహకులు చెప్తుంటే ఆశ్చర్యమనిపించక మానదు. ఇలాంటి ఆకట్టుకునే ఆఫర్లతో సిటీజనుల్ని గోవాకు పరుగులు పెట్టిస్తున్నారు ఆపరేటర్లు. ఫుల్ డిమాండ్ సిటీ నుంచి గోవాకు న్యూ ఇయర్ టైమ్‌లో ఉన్నంత రద్దీ మరెప్పుడూ ఉండదు. టూర్ ఆపరేటర్లు ఈ క్రేజ్‌ను తమకు యూజ్‌ఫుల్‌గా మార్చుకోవాలని ప్రయత్నిస్తారు. ఈ సీజన్లో గోవాకు అతి తక్కువ ఖరీదులో ట్రిప్ అందిస్తున్న టూర్ ఆపరేటర్స్ మేమే అని ధైర్యంగా చెప్పగలం. కేవలం రూ.6 వేలలోపే గోవాకి రాకపోకలు, బస అన్నీ కలిపి అందిస్తున్నాం. - వి.రాజశేఖర్‌రావు, ఎండీ, వింగో వెకేషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్