
ప్రియాంక చోప్రా, నిక్ జోనస్
ప్రియురాలు ప్రియాంక చోప్రా నూతన గృహ ప్రవేశానికి ఫారిన్ నుంచి బాయ్‌ఫ్రెండ్, హాలీవుడ్ స్టార్ సింగర్ నిక్ జోనస్ ఇండియా వచ్చిన సంగతి తెలిసిందే. శనివారం వీళ్లిద్దరూ కొత్త ఇంట్లో డిన్నర్ చేయడమే కాదు.. వాన చినుకుల్లో ప్రియాంక డ్యాన్స్ కూడా చేశారు. ఈ పోస్ట్‌లను నిక్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ డిన్నర్‌లో ప్రియాంక తల్లి మధు చోప్రా కూడా పాల్గొన్నారు. నిక్ ఇండియాలో ఉన్నన్ని రోజులు ప్రేమికుడితో షికార్లు కొడదాం అనుకొనుంటారు ప్రియాంక. వీళ్లిద్దరూ కలసి గోవా షికారుకు బయల్దేరారు. వీరితో పాటు ప్రియాంక కజిన్, హీరోయిన్ పరిణీతీ చోప్రా, బ్రదర్ సిద్ధార్థ్ కూడా జాయిన్ అయ్యారట. ఇలా చెట్టా పట్టాలేసుకొని తిరుగుతున్న ఈ జంట భార్యాభర్తలవుతారా? వెయిట్ అండ్ సీ.
Comments
Please login to add a commentAdd a comment