ఉచిత క్యాబ్ సర్వీస్‌ను ప్రారంభిస్తున్న సీపీ అంజనీకుమార్
సాక్షి, సిట్యీబ్యూరో: లాక్‌డౌన్ నేపథ్యంలో రవాణా సౌకర్యం లేకుండా ఇబ్బందులుపడుతున్న వారి కోసం ఎలైట్ క్యాబ్స్ ఉచిత సేవలు అందిస్తోంది. మహేంద్రా లాజిస్టిక్స్ లిమిటెడ్ సహకారంతో నిర్వహిస్తున్న ఈ సర్వీస్‌ను సిటీ కొత్వాల్ అంజనీకుమార్ మంగళవారం బషీర్‌బాగ్‌లోని నగర పోలీసు కమిషనర్ కార్యాలయం వద్ద జెండా ఊపి ప్రారంభించారు. నగర కమిషనరేట్ పరిధిలో పనిచేసే ఈ క్యాబ్ సర్వీస్‌ను పొందాలకునేవారు 84339 58158కు ఫోన్ చేయాలి. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 5 క్యాబ్‌లు, సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు 2 క్యాబ్‌లు ఉచిత సర్వీసును అందించనున్నాయి.
ఎవరు వినియోగించుకోవచ్చు?
♦ సీనియర్ సిటిజన్స్, ఒంటరిగా ప్రయాణించే పసిబిడ్డల తల్లులు, ఫిజికల్లీ చాలెంజ్డ్ వ్యక్తులు.. నిత్యావసర వస్తువులు, ఔషధాలు తెచ్చుకోవడానికి, బ్యాంకులు, పోస్టాఫీసులకు వెళ్లి వచ్చేందుకు..
♦ అవసరార్థులకు నిత్యావసాలు, ఆహారం, ఔషధాలు పంపిణీ చేసే కార్యకర్తల రవాణా కోసం..
♦ హృద్రోగులు, చిన్నారుల టీకాలు వేయించడానికి నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఆస్పత్రులు, డిస్పెన్సరీలకు వెళ్లి రావడానికి..
♦ ఆరోగ్య శాఖ సంబంధిత రంగాలకు చెందిన ఉద్యోగులు తమ విధులకు వెళ్లడానికి, రావడానికి..
వీరికి సేవలు అందించరు
♦ కోవిడ్ సంబంధిత లక్షణాలతో బాధపడుతున్నవారికి..
♦ రక్తస్రావంతో కూడిన గాయాలున్నవారికి, హార్ట్ ఎటాక్, కార్డియాక్ అరెస్ట్ వంటి బాధితులు, నెలలు నిండిన గర్భిణులకు..
Comments
Please login to add a commentAdd a comment