
సాక్షి, న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ (ఐఆర్‌సీటీసీ) ప్రధాన క్యాబ్ అగ్రిగేటర్ ఓలాతో ఒక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. దీని ప్రకారం ఐఆర్‌సీటీసీ వైబ్‌సైట్, యాప్ ద్వారా కూడా ఓలా క్యాబ్ సేవలను పొందే సౌకర్యాన్ని కల్పిస్తున్నామని సోమవారం ప్రకటించింది. ఆరు నెలల పైలట్ ప్రాజెక్టుగా దీన్ని ప్రారంభించినట్టుగా తెలిపింది..
తాజా ఒప్పందం ప్రకారం ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ మొబైల్ అప్లికేషన్, వెబ్‌సైట్ లో ఓలా క్యాబ్ బుక్ చేసుకునేందుకు వీలు కల్పించింది. ఓలా యాప్‌లో అందుబాటులో ఉన్న ధరల్లోనే ఓలా మైక్రో, ఓలా మినీ, ఓలా ఆటో, ఓలా షేర్ సేవలను నేరుగా బుక్ చేసుకునే సదుపాయాన్ని అందిస్తుంది. అంతేకాదు ఏడు రోజుల ముందు వరకు ప్రీ బుకింగ్ అవకాశం కూడా. రైల్వే స్టేషన్లలోని ఐఆర్‌సీటీసీ ఔట్‌లెట్ల ద్వారా ఓలా స్వీయ సేవలందిస్తున్న కియోస్క్ క్యాబ్లను బుక్ చేసుకునేందుకు కూడా ప్రయాణీకులను అనుమతి ఉందని ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. కాగా వివిధ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఓలా, ఉబెర్ డ్రైవర్లు దేశవ్యాప్త సమ్మె చేపట్టాయి. అలాగే అవసరమైతే నిరవధిక సమ్మకు దిగుతామని హెచ్చరించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment