న్యూఢిల్లీ: దేశీ దిగ్గజ క్యాబ్ సర్వీసుల సంస్థ ఓలా ఆస్ట్రేలియాలో కార్యకలాపాలు విస్తరించింది. ఇది తాజాగా సిడ్నీలోనూ సేవలు ప్రారంభించినట్లు పేర్కొంది. ఓలా గత నెల పెర్త్‌లో సర్వీసులు ప్రారంభించడం ద్వారా ఆస్ట్రేలియా మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. కాగా కంపెనీ ఆస్ట్రేలియా మార్కెట్‌లోకి ప్రవేశిస్తామని జనవరిలోనే ప్రకటించింది. ఓలా ఇప్పుడు సిడ్నీలో అధికారికంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
ఇది భాగస్వామ్యాలు కుదుర్చుకోవడానికి, డ్రైవర్ పార్ట్‌నర్స్‌కు సపోర్ట్ ఇవ్వడానికి స్థానికంగా టీమ్‌ను కూడా నియమించుకుంది. ‘డ్రైవర్ పార్ట్‌నర్స్ ఇన్వెస్ట్‌మెంట్‌పై దృష్టి కేంద్రీకరించాం. కొత్త టెక్నాలజీ, శిక్షణ ద్వారా వారికి మద్దతునిస్తాం. ఆదాయ పెంపునకు మార్గాలను అన్వేషిస్తాం’ అని సంస్థ తెలిపింది. కాగా ఆస్ట్రేలియా మార్కెట్లో ఓలాకు ఉబెర్ ప్రధాన ప్రత్యర్థి. ఉబెర్ 2012లోనే ఆస్ట్రేలియాలో కార్యకలాపాలు ప్రారంభించింది.
Comments
Please login to add a commentAdd a comment