ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్ : లంగర్‌హౌజ్‌లో ఓ లారీ బీభత్సం సృష్టించింది. ముందుగా వెళ్తున్న ఓలా క్యాబ్‌ను వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటన లంగర్‌హౌజ్ ఫ్లైఓవర్‌పైన తెల్లవారు జాము మూడు గంటల ప్రాంతంలో జరిగింది. వివరాలు.. AP02U6023 నెంబరు గల లారీ ముందుగా వెళ్తున్న హ్యుండాయ్ కారు (TS10UB1830)ను వెనకనుంచి బలంగా ఢీకొట్టింది. ఘటనలో కారు నుజ్జునుజ్జు కాగా.. డ్రైవర్‌తో సహా అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుల్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుమన్నామని, దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment