Langar Houz
-
వెంటాడిన మృత్యువు!
సాక్షి, సిటీబ్యూరో/లంగర్‌హౌస్: మద్యం మత్తులో కారు నడుపుతూ వచ్చిన వ్యక్తి శనివారం రాత్రి లంగర్‌హౌస్‌లోని మిలటరీ వాటర్ ట్యాంక్ వద్ద చేసిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన భార్యాభర్తలు మోన ఠాకూర్, దినేష్ గిరిలను యాక్సిడెంట్స్ వెంటాడాయి. మోన కుటుంబంలో ఇద్దరు ప్రమాదాల బారినేపడి మృతి చెందగా..దినేష్‌ను రెండేళ్ల క్రితం ఓ ‘నిషా’చరుడు ఢీ కొట్టాడు. అప్పట్లో తీవ్రగాయాలతో బయటపడినా..ఇప్పుడు మరో మందుబాబు డ్రైవింగ్‌కు భార్యతో సహా అశువులుబాశారు. మోన ప్రస్తుతం నాలుగు నెలల గర్భవతి కావడంతో కుటుంబీకులు, తల్లిని కోల్పోవడంతో ఇద్దరు చిన్నారులు తల్లడిల్లిపోతున్నారు. అప్పుడు బతికిపోయినా ఇప్పుడు... బంజారాహిల్స్‌కు చెందిన దినేష్ గిరికి, ఇద్దరు పిల్లలు పుట్టాక భర్త నుంచి విడిపోయిన లంగర్‌హౌస్‌కు చెందిన మోన ఠాకూర్‌కు 2022లో వివాహం నిశ్చయమైంది. ఆ ఏడాది అక్టోబర్ 6న దినేష్ తన ద్విచక్ర వాహనంపై ట్యాంక్‌బండ్ నుంచి ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. లక్డీకాపూల్ ప్రాంతంలో మద్యం మత్తులో కారు నడుపుతూ వచ్చిన పవన్ రెండు ద్విచక్ర వాహనాలను ఢీ కొట్టాడు. వాటిలో ఓ వాహనంపై ఉన్న దినేష్ కు ముఖం, తల, ఛాతి భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. దాదాపు నెల రోజులు ఆస్పత్రిలో చికిత్స పొంది బయటపడ్డారు. అప్పటికీ వివిధ సర్జరీల కారణంగా పూర్తిగా కోలుకోవడానికి ఏడు నెలలు పట్టింది. దీంతో మోనతో జరగాల్సిన పెళ్లి ఆలస్యమై... 2023 మే 25న ఒక్కటయ్యారు.ఆమె కుటుంబంలోనూ విషాదాలెన్నో... లంగర్‌హౌస్ పెన్షన్‌పురకు చెందిన మోన ఠాకూర్ కుటుంబంలోనూ విషాదాలు ఎన్నో ఉన్నాయి. ఈమె తండ్రి భగవాన్ సింగ్ మొదటి భార్య ఇందిర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. రెండో భార్య రత్నభాయికి పుట్టిన సంతానమే మోన. మొదటి భార్య కుమారుడు బచ్చన్ (మోన సవతి సోదరుడు) వెల్డింగ్ పనులు చేస్తూ జీవించే వారు. 2007 మేలో తన సమీప బంధువుతో ద్విచక్ర వాహనంపై వెళ్తూ శంషాబాద్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. శనివారం రాత్రి లంగర్‌హౌస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్తతో సహా మోన కన్నుమూసింది. ఆ సమయానికి ఆమె నాలుగు నెలల గర్భవతి కావడంతో కుటుంబీకులు, బంధువులు తీవ్ర విషాదంలో ముగినిపోయారు. సొంత తండ్రి వద్ద దొరకని ప్రేమ దినేష్ వద్ద... మోనకు మొదటి భర్త ద్వారా ఇద్దరు కుమార్తెలు కలిగారు. ప్రేరణ శ్రీ (12) తొమ్మిదో తరగతి, ధ్రితి శ్రీ (9) ఐదో తరగతి చదువుతున్నారు. ఒకేసారి రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు మృతి చెందడంతో వీళ్లు అనాథలుగా మారారు. తమ సొంత తండ్రి నిత్యం గొడవలు పడేవాడని, తమను వేధించేవాడని ఈ చిన్నారులు చెబుతున్నారు. దినేష్ గిరి సవతి తండ్రి అయినప్పటికీ..సొంత బిడ్డల్లా ప్రేమగా చూసుకునేవాడని చెప్తూ కన్నీరుమున్నీరవుతున్నారు. తాము తల్లిదండ్రులతో కలిసి గడిచిన 18 నెలల్లో ఎన్నో సందర్శనీయ ప్రాంతాలకు వెళ్లి సరదాగా గడిపి వచ్చామని జ్ఞాపకం చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు ఎక్కడకు వెళ్లినా తమను తీసుకునే వెళ్లేవారని, అయితే పరీక్షల కారణంగా ఇటీవల గోవా వెళ్లలేకపోయామని చెప్తున్నారు. దీంతో గోవా నుంచి వచ్చిన రోజే తాము కోరడంతో ఆహారం తేవడానికి వెళ్లి కన్నుమూశారని బాధగా చెప్తున్నారు. ప్రణయ్‌ను పోలీసు కస్టడీకి కోరాంలంగర్హౌస్ రోడ్డు ప్రమాదం కేసులో నిందితుడు ప్రణయ్‌ను అరెస్టు చేశాం. ఆదివారం రాత్రి కోర్టులో ప్రవేశపెట్టే సమయానికి మత్తు నుంచి బయటపడ్డాడు. ప్రమాదం జరిగిన విషయం కూడా తనకు తెలియదని, మద్యం మత్తులో ఏమి చేశానో తెలియదని చెబుతున్నాడు. స్నేహితులతో కాకుండా తాను ఒక్కడినే మద్యం తాగానని చెబుతున్నాడు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టడానికి నిందితుడిని పోలీసు కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరాం. – కె.రఘుకుమార్, లంగర్‌హౌస్ ఇన్స్పెక్టర్ -
లంగర్ హౌస్ కారు ఘటనలో ప్రాణాలు విడిచిన నవ దంపతుల తల్లిదండ్రుల ఆవేదన
-
హైదరాబాద్ లంగర్ హౌస్ లో కారు బీభత్సం
-
హైదరాబాద్‌లో జవాన్ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్మీ సెంటర్లో ఆర్మీ జవాన్ గన్‌తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పంజాబ్‌కు చెందిన రాజిందర్ బుధవారం తెల్లవారుజామున తన వద్ద ఉన్న తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. చదవండి: రమేష్ కుమార్ జైస్వాల్ ఎక్కడ? -
మరో వ్యక్తితో ప్రియురాలి పెళ్లి.. మండపంలోనే ప్రియుడి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: రెండు అక్షరాల ప్రేమ.. రెండు మనసులను, రెండు కుటుంబాలను ఒక్కటి చేస్తుంది. అదే ప్రేమ రెండు జీవితాలను కూడా నాశనం చేస్తుంది. అనేక కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చుతోంది. ప్రేమించిన వారిని ప్రాణంలాగా చూసుకోవాల్సిన వారే పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు. ప్రేమ కోసం ప్రాణాలు తీసుకోవడమే కాకుండా ప్రాణాలు తీసేందుకు కూడా వెనకాడటం లేదు. తాజాగా ప్రియురాలి పెళ్లిలో ప్రియుడి ఆత్మహత్య చేసుకున్న ఘటన లంగర్‌హౌజ్‌లో చోటుచేసుకుంది. తన ప్రేమించిన యువతి మరో వ్యక్తిని పెళ్లి చేసుకోడాన్ని ప్రియుడు జీర్ణించుకోలేకపోయాడు. దీంతో యువతి పెళ్లి జరుగుతున్న చోటుకు చేరుకున్న ప్రియుడు మనస్తాపం చెంది పెళ్లి మండపంలోనే పెట్రోల్ పోసుకొని కాల్చుకున్నాడు. అంతటితో ఆగకుండా యువకుడి శరీరానికి మంటలంటుకోవడంతో అలాగే వెళ్లి వధువును హత్తుకున్నాడు. అలెర్ట్ అయిన బంధువులు వధువును వెంటనే పక్కకు జరిపారు. వధువుకు స్వల్ప గాయాలవ్వడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. అయితే తీవ్రగాయాలపాలైన ప్రియుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. చదవండి: రెచ్చిపోయి చితకబాదిన పోలీసులు.. కోర్టు సీరియస్ -
లారీ ఢీ.. నుజ్జునుజ్జయిన ఓలా క్యాబ్
సాక్షి, హైదరాబాద్ : లంగర్‌హౌజ్‌లో ఓ లారీ బీభత్సం సృష్టించింది. ముందుగా వెళ్తున్న ఓలా క్యాబ్‌ను వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటన లంగర్‌హౌజ్ ఫ్లైఓవర్పైన తెల్లవారు జాము మూడు గంటల ప్రాంతంలో జరిగింది. వివరాలు.. AP02U6023 నెంబరు గల లారీ ముందుగా వెళ్తున్న హ్యుండాయ్ కారు (TS10UB1830)ను వెనకనుంచి బలంగా ఢీకొట్టింది. ఘటనలో కారు నుజ్జునుజ్జు కాగా.. డ్రైవర్‌తో సహా అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుల్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుమన్నామని, దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆ వృద్ధురాలిని కాపాడరూ!
ట్వీటర్లో కేటీఆర్‌కు వినతి.. వెంటనే స్పందించిన మంత్రి హైదరాబాద్: హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్ బాపూఘాట్ వద్ద చెత్త కుప్పలో 60 ఏళ్ల వృద్ధురాలు పడి ఉన్న విషయాన్ని స్థానిక వ్యక్తి మంత్రి కేటీఆర్‌కు ట్వీటర్ ద్వారా సమాచారం అందించాడు. దీనికి స్పందించిన మంత్రి వృద్ధురా లిని కాపాడాలని అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో వైద్య బృం దం, పోలీసులు, 108 సిబ్బంది అక్కడికి చేరుకొని వృద్ధురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. -
లంగర్ హౌజ్‌లో కిడ్నాప్ కలకలం
-
రూ.లక్ష విలువైన గుట్కాలు స్వాధీనం
హైదరాబాద్ : నగరంలోని లంగర్‌హౌస్ పరిధిలో రూ.లక్ష విలువైన గుట్కాలను పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులు గుట్కాలను ఆటోలో తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కుక్కకాటుతో చిన్నారి జీవితంలో చీకట్లు
లంగర్‌హౌస్ (హైదరాబాద్) : కుక్క కాటుకు గురైన ఓ చిన్నారి తన జీవితాన్ని కోల్పోయింది. మెదడుకు తీవ్ర గాయం కావటంతో జీవచ్ఛవంలా గడపాల్సిన దయనీయ స్థితిలో కన్నవారికి తీవ్ర వేదనను మిగిల్చింది. ఈ సంఘటన లంగర్‌హౌస్‌లో చోటు చేసుకుంది. ఎస్సై ఐలయ్య తెలిపిన వివరాల ప్రకారం... లంగర్ హౌస్ డిఫెన్స్ కాలనీలో అమీన్ ఉల్ రెహమాన్ ఇంట్లో సమీఉల్ రెహమాన్ అనే వ్యక్తి కుటుంబంతో అద్దెకు ఉంటున్నాడు. ఈ నెల 7వ తేదీన సమీ కుమార్తె ఆయేషా (8) ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా అమీన్ పెంపుడు కుక్క దాడి చేసి, తీవ్రంగా గాయపరిచింది. తలకు తీవ్ర గాయం కాగా వెంటనే ఆస్పత్రికి తరలించారు. దాదాపు లక్ష రూపాయలు వెచ్చించి ఆమెకు ఆపరేషన్ చేయించారు. అయితే మెదడుకి తీవ్ర గాయం కావటంతో ఇక ఆ బాలికకు ఏమీ గుర్తుండవనే నిజాన్ని వైద్యులు చెప్పటంతో సమీఉల్ రెహమాన్ హతాశుడయ్యాడు. యజమాని పెంపుడు కుక్క పలువురిపై దాడి చేసి గాయపరిచిందని, అలా వదిలేయవద్దని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని సమీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు అమీన్ ఉల్ రహమాన్, వాచ్‌మన్ హుస్సేన్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉంది. చలాకీగా కళ్ల ముందు ఆడుతూ, నవ్వుతూ తిరిగిన తమ కుమార్తె ఒక్కసారిగా ఇలా మారిపోవడంతో ఆమె తల్లిదండ్రుల రోదనకు అంతే లేకుండా పోయింది. -
మంటల్లో చిక్కుకుని యువకుడు మృతి
లంగర్‌హౌస్ (హైదరాబాద్) : ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకుని ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన హైదరాబాద్ లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... లంగర్‌హౌస్ అంబేద్కర్ నగర్లో నివాసముండే దర్శన్ కుమారుడు గిరి(22) వృత్తిరీత్యా పెయింటర్. ఉండే ఇల్లు ఇరుకుగా ఉండడంతో పక్కనే గుడిసె ఏర్పాటు చేసుకొని అందులో వంట చేసుకుంటున్నారు. కాగా ఆదివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో గిరి పక్కనే ఉన్న గుడిసెలోకి వంట చేస్కోవడానికి వెళ్లాడు. కొద్దిసేపటికి అరుపులు వినిపించడంతో స్థానికులు వెళ్లి చూడగా గిరి మంటల్లో చిక్కుకొని ఉన్నాడు. వెంటనే స్పందించిన వారు మంటలు ఆర్పారు. దీనిపై సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని కొన ఊపిరితో ఉన్న గిరిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యం ప్రారంభించేలోపు అతను మృతిచెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
చలాన్ రాశాడని ట్రాఫిక్ ఎస్సైపై దాడి
లంగర్‌హౌస్ (హైదరాబాద్) : విధుల్లో ఉన్న ట్రాఫిక్ ఎస్సైపై మళ్లీ దాడి జరిగింది. కొద్ది నెలల్లోనే వివిధ ప్రాంతాల్లో ఈ ఎస్సైపైనే దాదాపు 20 సార్లకు పైగా దాడి జరగడం చర్చనీయాంశంగా మారింది. లంగర్‌హౌస్ పోలీసుల కథనం ప్రకారం... టి.మధు టోలీచౌకీ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా పని చేస్తున్నారు. శనివారం ఈయన మొఘల్‌నగర్ రింగ్‌రోడ్డు వద్ద విధులు నిర్వహిస్తున్నారు. కాగా మధ్యాహ్నం సమయంలో గుడిమల్కాపూర్ వైపు నుంచి ఓ లారీ అత్తాపూర్ వైపు వెళ్తోంది. ఎస్సై మధు ఆ లారీని ఆపారు. ప్రవేశం లేని సమయంలో లారీతో ఈ రోడ్డుపైకి ఎలా వచ్చావని డ్రైవర్‌ను ప్రశ్నించి, రూ.1100 చలాన్ విధించారు. అంతలోనే లారీ యజమాని సయ్యద్ హరీషుద్దీన్ అక్కడకు చేరుకుని ఎస్సైతో వాగ్వాదానికి దిగాడు. 'మా లారీలను పార్కు చేసే ప్రాంత సమీపానికి వచ్చి చలాన్లు రాసి వేధిస్తావా?' అని దుర్భాషలాడి ఎస్సైపై దాడి చేశాడు. ఎస్సై ఫిర్యాదు మేరకు లంగర్‌హౌస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.