
సాక్షి, హైదరాబాద్: రెండు అక్షరాల ప్రేమ.. రెండు మనసులను, రెండు కుటుంబాలను ఒక్కటి చేస్తుంది. అదే ప్రేమ రెండు జీవితాలను కూడా నాశనం చేస్తుంది. అనేక కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చుతోంది. ప్రేమించిన వారిని ప్రాణంలాగా చూసుకోవాల్సిన వారే పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు. ప్రేమ కోసం ప్రాణాలు తీసుకోవడమే కాకుండా ప్రాణాలు తీసేందుకు కూడా వెనకాడటం లేదు. తాజాగా ప్రియురాలి పెళ్లిలో ప్రియుడి ఆత్మహత్య చేసుకున్న ఘటన లంగర్‌హౌజ్‌లో చోటుచేసుకుంది. తన ప్రేమించిన యువతి మరో వ్యక్తిని పెళ్లి చేసుకోడాన్ని ప్రియుడు జీర్ణించుకోలేకపోయాడు.
దీంతో యువతి పెళ్లి జరుగుతున్న చోటుకు చేరుకున్న ప్రియుడు మనస్తాపం చెంది పెళ్లి మండపంలోనే పెట్రోల్ పోసుకొని కాల్చుకున్నాడు. అంతటితో ఆగకుండా యువకుడి శరీరానికి మంటలంటుకోవడంతో అలాగే వెళ్లి వధువును హత్తుకున్నాడు. అలెర్ట్ అయిన బంధువులు వధువును వెంటనే పక్కకు జరిపారు. వధువుకు స్వల్ప గాయాలవ్వడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. అయితే తీవ్రగాయాలపాలైన ప్రియుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
చదవండి: రెచ్చిపోయి చితకబాదిన పోలీసులు.. కోర్టు సీరియస్
Comments
Please login to add a commentAdd a comment