ఆ వృద్ధురాలిని కాపాడరూ!
ట్వీటర్‌లో కేటీఆర్‌కు వినతి..
వెంటనే స్పందించిన మంత్రి
హైదరాబాద్: హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్ బాపూఘాట్ వద్ద చెత్త కుప్పలో 60 ఏళ్ల వృద్ధురాలు పడి ఉన్న విషయాన్ని స్థానిక వ్యక్తి మంత్రి కేటీఆర్‌కు ట్వీటర్ ద్వారా సమాచారం అందించాడు. దీనికి స్పందించిన మంత్రి వృద్ధురా లిని కాపాడాలని అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో వైద్య బృం దం, పోలీసులు, 108 సిబ్బంది అక్కడికి చేరుకొని వృద్ధురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.