గత నెల 30న ఓలా క్యాబ్ డ్రైవర్‌పై ఆరుగురు ఆఫ్రిక న్లు దాడికి పాల్పడిన కేసుకు సంబంధించి నైజీరియాకు చెందిన జానెట్(26) అనే యువతిని శుక్రవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
గత నెల 30న ఓలా క్యాబ్ డ్రైవర్‌పై ఆరుగురు ఆఫ్రిక న్లు దాడికి పాల్పడిన కేసుకు సంబంధించి నైజీరియాకు చెందిన జానెట్(26) అనే యువతిని శుక్రవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇదే కేసులో రువాండాకు చెందిన కెఫా అనే మహిళను ఘటన జరిగిన రోజునే అరెస్టు చేశారు. వీరివురు నిందితులు తమ వీసా గడువు ముగిసినప్పటికే దేశంలో నివసిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
కాగా, కెఫా ఇదివరకే ఒకసారి బెంగళూరులో అరెస్టు అయ్యిందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. జానెట్‌కు సంబంధించిన రికార్డులను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం...గత 30న ద్వారక వెళ్లేందుకు కెఫా, జానెట్‌లు ఓలా సర్వీసెస్‌కు చెందిన క్యాబ్‌ను బుక్ చేసుకున్నారు.
క్యాబ్ రాజ్‌పూర్ ఖుర్ద్ వచ్చేసరికి ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులు అతడి కోసం వేచిచూస్తున్నారు. వారందరూ మద్యం తాగి ఉన్నారని డ్రైవర్ ఆరోపించాడు. నలుగురి కంటే ఎక్కువ మంది క్యాబ్‌లో తీసుకెళ్లేందుకు కుదరదని అతడు చెప్పడంతో వారితో తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. దీంతో ఆఫ్రికన్లు తనని తీవ్రంగా కొట్టారని క్యాబ్ డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ నలుగురు నిందితులను కూడా గుర్తించామని, వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.