తమ సమస్యలు వివరించేందుకు ఓలా క్యాబ్ సంస్థకు వెళితే బౌన్సర్లతో క్యాబ్ డ్రైవర్లపై దాడి చేయించినందుకు నిరసనగా శుక్రవారం అర్ధరాత్రి నుండి జనవరి 4 వరకు రాష్ట్ర వ్యాప్తంగా క్యాబ్‌ల బంద్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ క్యాబ్స్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివ ఉల్‌కుందకోర్ తెలిపారు. అసోసియేషన్‌లో ఉన్న ఏడు వేల మందితో పాటు అన్ని సం ఘాల క్యాబ్ డ్రైవర్స్, ఓనర్స్ కూడా బంద్ లో పాల్గొంటారన్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో శివ మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని ఓలా, ఉబర్ కార్పొరేట్ సంస్థలు ప్రకటనలు చేసి నెలకు రూ.70 వేల నుండి రూ.లక్ష సంపాదించవచ్చని నమ్మబలికి ఈఎంఐ పద్ధతిలో కార్లు కొనేలా చేశారన్నారు.