బీజేపీ గూటికి అంబరీష్!
సాక్షి, బెంగళూరు: ప్రముఖ నటుడు, కాంగ్రెస్ సీనియర్ నేత అంబరీష్.. త్వరలో బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక రాష్ట్రంలోని మండ్య ఎమ్మెల్యే అయిన అంబరీష్ సీఎం సిద్ధరామయ్య కేబినెట్‌లో కొంతకాలం మంత్రిగా పనిచేశారు. వివిధ కారణాలతో కొద్దినెలలకే ఉద్వాసనకు గురయ్యారు.
అప్పటినుంచి పార్టీతో అంటీముట్టనట్టుగా ఉన్న ఆయన దుబాయ్ పర్యటనలో ఉండగా, కర్ణాటక బీజేపీ నాయకులు అశోక్, సతీష్‌రెడ్డిలు సమావేశమై బీజేపీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. బీజేపీలో మంచి స్థానంతో పాటు రాజ్యసభ సీటు ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.