కేజ్రీవాల్పై రె'ఢీ': జయప్రద | ready to contest Kejriwal: actress Jayaprada | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్పై రె'ఢీ': జయప్రద

Published Thu, Jan 15 2015 11:41 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

కేజ్రీవాల్పై రె'ఢీ':  జయప్రద - Sakshi

కేజ్రీవాల్పై రె'ఢీ': జయప్రద

న్యూఢిల్లీ : సమాజ్ వాదీ పార్టీ మాజీ ఎంపీ, సినీనటి జయప్రద త్వరలో భారతీయ జనతా పార్టీలో చేరనున్నట్లు సమాచారం. ఆమె త్వరలోనే కాషాయ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జయప్రద బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షాను కూడా కలిసినట్లు సమాచారం.

 

 ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ అధ్యక్షుడు కేజ్రీవాల్ పై పోటీకి  సిద్ధమన్న జయప్రద వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరోవైపు శనివారం ఢిల్లీ వెళ్లనున్న ఆమె బీజేపీ పెద్దలను కలవనున్నారు. ఢిల్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కమలనాథులు...జయప్రదను పార్టీలోకి తీసుకుని, కేజ్రీవాల్ పై పోటీకి నిలబెట్టనున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా కమలం హవా కొనసాగుతున్న నేపథ్యంలో  ఆమె చివరకు బీజేపీ వైపు మొగ్గు చూశారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement