జయం రవి మరో సాహసం.. | No dialogues for Jayam Ravi in 'Vanamagan' | Sakshi
Sakshi News home page

జయం రవి మరో సాహసం..

Published Sat, Apr 22 2017 3:56 PM | Last Updated on Fri, Aug 17 2018 2:34 PM

జయం రవి మరో సాహసం.. - Sakshi

జయం రవి మరో సాహసం..

తమిళ దర్శకుడు ఎఎల్ విజయ్ దర్శకత్వంలో జయం రవి హీరోగా నటించిన 'వనమగన్' చిత్రానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.

చెన్నై: తమిళ దర్శకుడు ఎ.ఎల్. విజయ్ దర్శకత్వంలో జయం రవి హీరోగా నటించిన 'వనమగన్' చిత్రానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.  ప్రయోగాలకు పెట్టింది పేరైన రవి ఈ సినిమాలో మరో సాహసం చేశాడట. వనమగన్‌(అడవిపుత్రుడు)  సినిమాలో  టార్జన్ గెటప్‌లో  అలరించనున్న  రవిప్రాత్రకు  అస్సలు డైలాగులే వుండవట.  గిరిజన యువకుడి ప్రాతలో డిఫరెంట్ జానర్‌లో ప్రేక్షకుల ముందుకురాబోతున్నాడని సమాచారం.

ఫాంటసీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో  కీలకపాత్ర పోషలించిన హాస్య నటుడు  తంబి రామయ్య రవి పాత్రకు అస్సలు మాటలు వుండవన్న విషయాన్ని రివీల్‌ చేశారు.  రవి నటనపై ప్రశంసలు కురిపించారు.  ఎలాంటి డైలాగులు లేకుండా పూర్తిగా  హావ భావాల ద్వారా నటనను పండించడం అంత సులువైంది కాదని, కానీ రవి అద్భుతంగా  కనిపించారని చెప్పారు.  శనివారం జరిగిన ఈ చిత్రం ఆడియో లాంచ్‌ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.  ఈ రకమైన పాత్రను అంగీకరించింనందుకు రవికి హాట్స్‌ ఆఫ్‌ అని వ్యాఖ్యానించారు.  అలాగే హీరోయిన్‌  సయేషా సైల్ పై కూడా ఆయన ప్రశంసలు కురిపించారు.  నటనలో ఆమె నిబద్ధత తనను  ఆశ్చర్యపరిచిందని పేర్కొన్నారు.

కాగా ఇప్పటికే రిలీజైన్‌ ‘వనమగన్'  ఫస్ట్‌లుక్‌  బాగానే ఆకట్టుకుంది.   కారెక్టర్‌ అనుగుణంగా  ట్రైబల్‌ యువకుడిగా  ఊడలను పట్టుకుని వేలాడుతున్న పోస్టర్‌కి మంచి స్పందన  లభించింది.  హారీస్‌ జయరాజ్‌ సంగీత సారధ్యం వహించిన ఈ  మూవీ మే నెలలో రిలీజ్‌ చేసేందుకు చిత్ర యూనిట్‌ప్లాన్‌ చేస్తోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement