
ఎక్సైజ్ కార్యాలయానికి వెళ్లిన నటుడు
డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వర్ధమాన నటుడు నందు శుక్రవారం నాంపల్లి ఎక్సైజ్ కార్యాలయానికి వెళ్లాడు.
హైదరాబాద్: డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వర్ధమాన నటుడు నందు శుక్రవారం నాంపల్లి ఎక్సైజ్ కార్యాలయానికి వెళ్లాడు. అయితే, అక్కడ అధికారులు లేకపోవడంతో వెనుదిరిగాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. తనకు ఎక్సైజ్ శాఖ నుంచి ఎలాంటి నోటీసులు అందలేదని తెలిపారు. డ్రగ్స్ సరఫరాదారు కెల్విన్ ఎవరో తనకు తెలియదని, అయితే మీడియాలో వస్తున్న కథనాలను స్పందించి అవి తప్పని రుజువు చేసుకోవడానికే వచ్చినట్లు వివరించాడు.
తాను ఇప్పటి వరకు డ్రగ్స్ తీసుకోలేదన్నాడు. ఇంకా అనుమానం ఉంటే రక్త పరీక్షలకు సైతం తాను సిద్ధమని చెప్పాడు. తన కుటుంబ సభ్యులకు తనను తాను రుజువు చేసుకోవడానికి ఎక్సైజ్ కార్యాలయానికి వచ్చానన్నాడు. ఒక వేళ తనకు ఎక్సైజ్ శాఖ నుంచి నోటీసులు వస్తే కచ్చితంగా హాజరవుతానన్నాడు.