
బంజారాహిల్స్ పోలీసు స్టేషన్
సాక్షి, బంజారాహిల్స్ : షార్ట్‌ఫిలింలో హీరోయిన్‌గా నటిస్తున్న తన కుమార్తెను ప్రేమపేరుతో మోసం చేసి తీసుకెళ్లాడని ఆరోపిస్తూ బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు షార్ట్‌ఫిలిం హీరో, నిర్మాతపై కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. యూసుఫ్‌గూడ చెక్‌పోస్టు ప్రాంతానికి చెందిన మహిళ దాండియా కొరియోగ్రాఫర్‌గా పని చేస్తుండగా, ఆమె కుమార్తె(14) షార్ట్‌ఫిలిమ్స్‌లో హీరోయిన్‌గా నటిస్తోంది.
తిరుపతికి చెందిన కస్తూరి ఆనంద వర ప్రసాద్ అనే వ్యక్తి తన స్వీయ నిర్వహణలో తీస్తున్న షార్ట్‌ఫిలింలో నటించేందుకు ఆమెను హీరోయిన్‌గా బుక్ చేశాడు. కొద్ది రోజులకు వారు ప్రేమించుకుంటున్నట్లు గుర్తించిన యువతి తల్లి ఆనంద్ వివనాలపై ఆరా తీయగా అతడికి అప్పటికే పెళ్లయి, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తేలింది. దీనిపై ఆమె ఆనంద్‌ను నిలదీయగా తనకు పెళ్లి కాలేదని బుకాయించాడు. ఈ నేపథ్యంలో గత మార్చి 22న తాను ఇంట్లో లేని సమయంలో తన కుమార్తెను బలవంతంగా తీసుకెళ్లాడని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment