భయపెట్టడానికి రెడీ అవుతున్న నమిత | actress Namita new movie pottu | Sakshi
Sakshi News home page

భయపెట్టడానికి రెడీ అవుతున్న నమిత

Published Tue, Mar 28 2017 1:59 AM | Last Updated on Wed, Apr 3 2019 9:12 PM

భయపెట్టడానికి రెడీ అవుతున్న  నమిత - Sakshi

భయపెట్టడానికి రెడీ అవుతున్న నమిత

నటి నమితను ఇప్పటివరకూ కలల రాణిగానే భావిస్తారు అభిమానులు. అలా తనకే సొంతమైన అందాలతో యువతను గిలిగింతలు పెట్టిన ఈ సూరజ్‌ బ్యూటీ ఇప్పుడు తెరపై బీభత్సం సృష్టించడానికి రెడీ అవుతున్నారు. చాలా గ్యాప్‌ తరువాత నమిత నాయకిగా నటిస్తున్న చిత్రం పొట్టు. నటుడు భరత్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఇందులో ఇనియ, సృష్టిడాంగే ఇతర కథానాయికలుగా నటిస్తున్నారు. తంబిరామయ్య, భరణి, నాన్‌కడవుల్‌ రాజేంద్రన్, ఊర్వశి మొదలగు పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని షాలోమ్‌ స్టూడియోస్‌ పతాకంపై జాన్‌మ్యాక్స్, జాన్‌ కలిసి నిర్మిస్తున్న చిత్రం పొట్టు. వడివుడైయాన్‌ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రానికి అమ్రిష్‌ సంగీతం అందిస్తున్నారు.

ఇందులో నటి నమిత ఆహార్యం, అభినయం విభిన్నంగా ఉంటాయి. అటు మృగం, ఇటు మనిషి కలిసిన ఒక వింత గెటప్‌లో కనిపించే నమిత వెండితెరపై బీభత్సం సృష్టిస్తారంటున్నారు చిత్ర దర్శకుడు విడివుడైయాన్‌. దీని గురించి ఆయన తెలుపుతూ పొట్టు పూర్తి హారర్‌ కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఇందులో నటుడు భరత్‌ తొలిసారిగా అమ్మాయి వేషంలో కనిపిస్తారన్నారు. ఇక నమిత ఇప్పటి వరకూ నటించనటువంటి విభిన్న పాత్రలో నటిస్తున్నారని చెప్పారు. ఇందులోని అడి పోడీ సంఢాలి అనే పాటను ఇటీవల కేరళలోని అధిరంబిలి ప్రాంతంలో నదిలో చిత్రీకరించినట్లు తెలిపారు.

ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు చెప్పారు. షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని తమిళంలో పొట్టు, తెలుగులో బొట్టు, హిందీలో బింది పేర్లతో త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement