నటుడు బాలాజీపై చీటింగ్‌ కేసు నమోదు | Criminal Case Filed On Actor Balaji | Sakshi

నటుడు బాలాజీపై చీటింగ్‌ కేసు నమోదు

Published Sun, May 13 2018 9:36 AM | Last Updated on Fri, Aug 17 2018 2:31 PM

Criminal Case Filed On Actor Balaji - Sakshi

నటుడు బాలాజీ

బంజారాహిల్స్‌: సినీ, బుల్లితెర నటుడు బాలాజీపై జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు నమోదైంది. తన నుంచి బలవంతంగా కిడ్నీ సేకరించి బాలాజీ భార్యకు అమర్చారని, ఇందుకోసం తనతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించి మోసం చేశారంటూ యూసుఫ్‌గూడ యాదగిరినగర్‌కు చెందిన పెల్లూరి భాగ్యలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు చేశారు. ఈమేరకు పోలీసులు బాలాజీపై ఐపీసీ సెక్షన్‌ 420, 506, సెక్షన్‌ 19 ఆఫ్‌ ది ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ ఆర్గాన్స్‌ యాక్ట్‌ 1994 కింద కేసు నమోదు చేశారు.

వివరాల్లోకి వెళితే.. ఫిలింనగర్‌ రోడ్‌ నెం.9లో నివసించే బాలాజీ తన భార్య కృష్ణవేణికి 2016 ఆగస్టు 26న తనను మభ్యపెట్టి విజయవాడలోని విజయ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌లో తన కిడ్నీ తీసుకున్నారని ఆమె ఆరోపించారు. తాను కిడ్నీ ఇస్తున్న సందర్భంలో సినిమాలు, టీవీల్లో అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారని, ఒక ఇల్లు కూడా కొనిస్తామని చెప్పారని ప్రతి నెలా రూ.15 వేలు ఆర్థిక సాయం చేయడంతో పాటు కుటుంబ ఖర్చుల కోసం రూ.20 లక్షలు ఇస్తామని చెప్పారన్నారు. అయితే ఇందులో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని భాగ్యలక్ష్మి ఫిర్యాదులో పేర్కొన్నారు. న్యాయ సలహా అనంతరం అన్ని ధృవపత్రాలు సేకరించి బాలాజీపై కేసు నమోదు చేశామని అయితే కిడ్నీ అమరిక విజయవాడలో జరిగింది కాబట్టి కేసును అక్కడికి బదిలీ చేస్తున్నట్లు సీఐ ఎం.చంద్రశేఖర్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement