
సాక్షి, చెన్నై: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో తమిళ యువ నటుడు జై నేరాన్ని అంగీకరించాడు. అతడు నేరాన్ని అంగీకరించినందుకుగానూ సైదాపేట కోర్టు శనివారం రూ.5,200 జరిమానా విధించింది. అంతేకాకుండా జై ఆరు నెలల పాటు వాహనం నడపరాదని న్యాయస్థానం ఆదేశించింది. కాగా జై గత నెల 21న మద్యం తాగి కారు నడుపుతూ స్థానిక అడయారు బ్రిడ్జి సమీపంలోని గోడను ఢీకొన్నాడు. దీనిపై ఆ ప్రాంత ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి సైదాపేట మేజిస్ట్రేట్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో గురువారం విచారణకు రాగా, అతడు కోర్టుకు హాజరు కాలేదు. దీంతో న్యాయమూర్తి అతడిపై అరెస్ట్ వారెంట్ జారీ చేస్తూ నిన్న కోర్టుకు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment