మైత్రేయి రామకృష్ణన్... కెనడాలో పుట్టి పెరిగిన తమిళ అమ్మాయి. నెట్‌ఫ్లిక్స్ టీన్ కామెడీ సిరీస్ ‘నెవర్ హ్యావ్ ఐ ఎవర్’లో లీడ్‌రోల్ కోసం పదిహేను వేలమంది పోటీ పడ్డారు, అందులో నుంచి మైత్రేయిని ఎంపిక చేశారు. ‘దేవి విశ్వకుమార్’ పాత్ర ఆమెకు మాంచి పేరు తీసుకువచ్చింది. హాలివుడ్ సినిమాలకు దారి చూపించింది. (చదవండి: సంధ్య థియేటర్లో అల్లు అర్జున్ ఫ్యామిలీ సందడి)
అమెరికన్ ఫాంటసీ కామెడీ ఫిల్మ్ ‘టర్నింగ్ రెడ్’లో నటించింది. ఈ సినిమా విడుదలైతే... హాలివుడ్‌లో అవకాశాల జోరు పెరుగుతుంది. ‘బ్రేక్ ఔట్ యాక్టర్’గా ‘టైమ్–100’ ఇన్‌ఫ్లూయెన్షల్ పీపుల్–2021 జాబితాలో మైత్రేయి పేరు చోటుచేసుకుంది. బాలీవుడ్‌లోనూ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. (చదవండి: ‘రాధేశ్యామ్’ సీక్రెట్ చెప్పేసిన డైరెక్టర్, ఫ్యాన్స్‌లో మరింత ఆసక్తి..)
Comments
Please login to add a commentAdd a comment