nationality
-
జాతీయత కొరవడిన పార్టీ.. స్వార్థ ప్రయోజనానికే పెద్దపీట
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమర్థ సారథ్యంలో అప్రతిహతంగా పురోగమిస్తున్న భారత్ కీర్తి బావుటా విశ్వ వినీలాకాశంలో ఇప్పుడు మరింత పైఎత్తున ఎగురుతోంది. మొట్ట మొదటి సారిగా జీ–20 అధ్యక్ష హోదా చేపట్టి విశ్వవేదికపై తన సత్తాను భారత్ మరో మారు చాటి చెప్పింది. ఐరోపా యూనియన్ సహా 19 దేశాలు సభ్యులుగా ఉన్న గొప్ప వేదిక ఇది. ప్రపంచ జీడీపీలో 90 శాతం, అంతర్జాతీయ వాణిజ్యంలో 80 శాతం, ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతులు జీ–20 దేశాలవే. ప్రపంచ ఆర్థిక వ్యవహారాల్లో జీ–20 పాత్ర ఏమిటో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇతర దేశాల తలరాతను శాసిస్తూ లాభార్జనే ధ్యేయమైన రెండు ఆర్థిక నమూనాలు ఇప్పుడు ప్రపంచంలో కొనసాగుతున్నాయి. ఆధిపత్యం చలాయిస్తూనే తమ ఉత్పత్తులతో విదేశా లను ముంచెత్తే పాశ్చాత్య నమూనా ఒక వైపు, ఆర్థికంగా బలహీనంగా ఉన్న దేశాలకు అప్పుల వలవేసి దివాలా తీయించే చైనా నయా వలసవాద నమూనా మరొక వైపు ఉన్నాయి. దీనికి పూర్తి భిన్నంగా విశ్వ మానవ సౌభ్రాతృత్వ స్ఫూర్తితో భారత్ ముందుకు సాగుతోంది. కోవిడ్ కష్ట కాలంలో ప్రపంచాన్ని భారత్ ఆదుకున్న తీరే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ఇటువంటి భారత్ జీ–20కి నాయకత్వ స్థానంలో ఉండి చేయగలిగింది ఎంతో ఉంది. డిసెంబర్ ఒకటో తేదీన జీ–20 అధ్యక్ష హోదా స్వీకరించిన భారత్, వచ్చే 12 నెలల కాలంలో దేశవ్యాప్తంగా 200 పైగా సమావేశాలు నిర్వ హించాలని నిశ్చయించింది. అందుకోసం రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు డిసెంబర్ 5న ఒక సన్నాహక సమావేశానికి కేంద్రం ఆహ్వానం పలికింది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, డీఎంకే అధినేత స్టాలిన్ సహా దాదాపు అన్ని పార్టీల అధ్యక్షులు హాజరైన ఆ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం డుమ్మా కొట్టారు. దేశాన్ని ఉద్ధరిస్తానని ‘భారాసా’గా పేరు మార్చుకున్న తెరాస అధ్యక్షుడు యావత్ దేశానికి గర్వకారణమైన ఒక కీలక సమావేశాన్ని బహిష్కరించి దేశం పట్ల తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. జాతీయ ప్రాధాన్యం కలిగిన అంశాల విషయంలో ఆ పార్టీ నిబద్ధత ఏ పాటిదో ఆదిలోనే అర్థమయ్యింది. దేశ హితం కన్నా కేవలం స్వార్థ రాజకీయ ప్రయోజనానికే పెద్దపీట వేయడం ఇందుకు కారణం. వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో జరగనున్న జీ–20 దేశాల శిఖరాగ్ర సమావేశానికి వ్యూహాలపై చర్చలు జరిపేందుకు, సూచనలు స్వీకరించేందుకు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి హాజరుకాని కేసీఆర్, అందుకు కారణాలేమిటో చెప్పగలరా? సొంత లాభాపేక్షే తప్ప తెలంగాణ ప్రజానీకం బాగోగుల గురించి ఆయనకు ఏమాత్రం పట్టింపులేదని దీనివల్ల స్పష్టంగా తెలియడం లేదా? కేంద్ర ప్రభుత్వం ఆయనను ఆహ్వానించినప్పటికీ, సమావేశానికి కావాలనే హాజరు కాకపోవడం... జాతీయ రాజకీయాల్లో కీలక, క్రియాశీలక పాత్ర పోషించాలనుకుంటున్న కేసీఆర్‌కు ఎంత మాత్రం తగని పని. జాతీయ రాజకీయాల్లో రాణించడానికి కావలసిన కలుపుగోలుతనం ఇదేనా? చారిత్రక అవకాశాలను ఇలా చేజేతులా వదిలేసుకోవడం కేసీఆర్‌కు అలవాటైన పనే. జీ–20 సమావేశాలు రాష్ట్ర ప్రభుత్వాల ముందు అనేక అవకాశాల తలుపులు తెరవబోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంతో కలిసి తమ రాష్ట్రాల్లో తాజా పెట్టుబడులకు బాటలు వేయడానికి మంచి అవకాశం లభిస్తోంది. తెలంగాణకు చెందిన అనేకమంది సౌదీ అరేబియాలో ప్రవాసం ఉంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్‌లో దౌత్య కార్యాలయం ఏర్పాటు చేయాల్సిందిగా సౌదీ అరేబియాను తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థించింది. కేంద్ర ప్రభుత్వంతో కలిసి సౌదీ అరేబియా రాజకీయ నాయకత్వంతో చర్చలు జరిపి సానుకూల ఫలితం రాట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ వేదికను ఉపయోగించుకునే అవకాశం ఉంది. జీ –20 అధ్యక్ష హోదా భారత్‌కు దక్కడంతో ఎంతో స్ఫూర్తి పొందిన సిరిసిల్ల పట్టణానికి చెందిన హరిప్రసాద్, స్వయంగా జీ–20 లోగో నేసి ప్రధానమంత్రికి పంపించారు. హరిప్రసాద్ వంటి వారి నుంచి స్ఫూర్తి పొంది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ హితం కోసం కాకపోయినా.. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యానైనా కేంద్రంతో కలిసి ముందడుగు వేస్తారా? (క్లిక్ చేయండి: సందేహాలు తీరకుండా చర్యలెలా?) - కిశోర్ పోరెడ్డి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి -
బ్రేక్ ఔట్ యాక్టర్.. తమిళ అమ్మాయి!
మైత్రేయి రామకృష్ణన్... కెనడాలో పుట్టి పెరిగిన తమిళ అమ్మాయి. నెట్‌ఫ్లిక్స్ టీన్ కామెడీ సిరీస్ ‘నెవర్ హ్యావ్ ఐ ఎవర్’లో లీడ్‌రోల్ కోసం పదిహేను వేలమంది పోటీ పడ్డారు, అందులో నుంచి మైత్రేయిని ఎంపిక చేశారు. ‘దేవి విశ్వకుమార్’ పాత్ర ఆమెకు మాంచి పేరు తీసుకువచ్చింది. హాలివుడ్ సినిమాలకు దారి చూపించింది. (చదవండి: సంధ్య థియేటర్లో అల్లు అర్జున్ ఫ్యామిలీ సందడి) అమెరికన్ ఫాంటసీ కామెడీ ఫిల్మ్ ‘టర్నింగ్ రెడ్’లో నటించింది. ఈ సినిమా విడుదలైతే... హాలివుడ్లో అవకాశాల జోరు పెరుగుతుంది. ‘బ్రేక్ ఔట్ యాక్టర్’గా ‘టైమ్–100’ ఇన్ఫ్లూయెన్షల్ పీపుల్–2021 జాబితాలో మైత్రేయి పేరు చోటుచేసుకుంది. బాలీవుడ్‌లోనూ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. (చదవండి: ‘రాధేశ్యామ్’ సీక్రెట్ చెప్పేసిన డైరెక్టర్, ఫ్యాన్స్‌లో మరింత ఆసక్తి..) -
‘జాతీయత లేని’ షేర్ అలీ కేష్వానీ..
సాక్షి, సిటీబ్యూరో: 2004లో కేసు నమోదైంది... 2013లో పీటీ వారెంట్‌పై సిటీకి వచ్చాడు... 2015లో అతడిపై కేసు వీగిపోయింది... అయిననా ఇప్పటికీ చర్లపల్లి కేంద్రం కారాగారంలోనే మగ్గుతున్నాడు... అతడే ‘జాతీయత లేని’ షేర్ అలీ కేష్వానీ నేపథ్యం. అతడు పాకిస్థాన్ జాతీయుడని ఆరోపించిన పోలీసులు, కాదు భారతీయుడినే అంటూ వాదించిన కేష్వానీ ఇద్దరూ ఆధారాలు చూపించడంలో విఫలం కావడమే ఇందుకు కారణం. ఏడు పదుల వయస్సులో ఉన్న ఇతను అటు పాకిస్థానీ, ఇటు భారతీయుడు కాకపోవడంతో ఏ కేసూ లేకపోయినా నాలుగేళ్లుగా కారాగారంలోనే మగ్గుతున్నాడు. అర్షద్ మహమూద్ అలియాస్ అర్షద్ మాలిక్ పాకిస్థాన్‌లోని రహీమైఖర్‌ఖాన్ జిల్లా ఖాన్పూర్కు చెందిన వాడు. 2002 నవంబర్‌లో పాకిస్థానీ ఇంటెలిజెన్స్ అధికారులు ఫీర్జీ, లియాఖత్‌లు అతడిని కలిసి తమ తరఫున పని చేయడానికి భారత్ వెళ్లాల్సిందిగా కోరారు. అందుకు అర్షద్ అంగీకరించడంతో రహీమైఖర్‌ఖాన్‌లో దాదాపు మూడు నెలల పాటు సాంకేతిక పరిజ్ఞానం, ఆయుధాల వినియోగం సహా వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చారు. భారత ఆర్మీ యూనిట్లే టార్గెట్‌గా చేసుకున్న పాకిస్థాన్ అధికారులు అర్షద్‌ను పంపాలని నిర్ణయించడంతో శిక్షణ మొత్తం ఆ కోణంలోనే నడిచింది. ఆర్మీలో ఉండే అధికారుల ర్యాంకులు, వారి విధులు, ఆర్మీ యూనిట్లు ఉన్న లొకేషన్లు, కంప్యూటర్ ద్వారా మ్యాపుల అధ్యయనం, ఈ–మెయిల్ ద్వారా సంప్రదింపులు జరపడం నేర్పారు. శిక్షణ పూర్తయిన తరవాత పాకిస్థానీ పాస్‌పోర్ట్ ఇచ్చి బంగ్లాదేశ్ రాజధాని ఢాకా పంపారు. అక్కడ అతడిని కలిసిన పాకిస్థాన్ గూఢచార సంస్థ ప్రతినిధులు బంగ్లాదేశ్ పాస్‌పోర్ట్ ఇచ్చి 2003 మార్చిలో బెహ్‌రామ్‌పూర్ మీదుగా కోల్‌కతా పంపారు. కోల్‌కతా, ముంబైలో కొన్ని ప్రాంతాలను పరిశీలించిన అనంతరం అదే ఏడాది మేలో తిరిగి ఢాకా వెళ్లాడు. హైదరాబాద్‌లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలంటూ పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారుల నుంచి 2003 జూలైలో ఆదేశాలు అందడంతో అదే ఏడాది ఆగస్టులో భోపాల్ మీదుగా కోల్‌కతా చేరుకున్నాడు. అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకున్న అతను ముత్యాల్బాగ్ ప్రాంతంలో ఓ అద్దె గదిలో మకాం ఏర్పాటు చేసుకున్నాడు. వైద్య పరికరాలు అమ్మే చిన్న వ్యాపారినని, కోల్‌కతా నుంచి వచ్చినట్లు చెప్పుకునేవాడు. పగలంతా ఆర్మీ ప్రాంతాల్లో తిరిగి రాత్రి కింగ్‌కోఠి అగర్వాల్ ఛాంబర్స్‌లోని హైదరాబాద్ సైబర్ కేఫ్ నుంచి ఈ–మెయిల్స్ ద్వారా రక్షణ రహస్యాలను చేరవేసేవాడు. ఇందుకు ప్రతిఫలంగా పాకిస్థాన్ నుంచి ఫీర్జీ హవాలా ద్వారా ఎప్పటికప్పుడు ఇతనికి సొమ్ము పంపేవాడు. నగరంలో కొరియర్ సర్వీసు నిర్వహించే మిలింద్ దత్తాత్రేయ ద్వారా పలుమార్లు అర్షద్‌కు వేల రూపాయలు అందేవని పోలీసులు ఆరోపించారు. 2004 మార్చి 9న సైబర్ కేఫ్‌లో ఉన్న అర్షద్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి రక్షణ రంగానికి సంబంధించిన కొన్ని కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ ఫ్లాపీ, కెమెరా, ఆర్మీ లోకేషన్స్ ఫొటోలు, సికింద్రాబాద్–హైదరాబాద్ ప్రాంతాల్లోని ఆర్మీ లోకేషన్స్ స్కెచ్‌లు, ఆర్మీ అధికారుల టెలిఫోన్ డైరెక్టరీలు, రూ.10 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అతని గదిలో బూట్లలో దాచి ఉంచిన మరో రూ.21 వేలు స్వాధీనం చేసుకున్నారు. అర్షద్ ఈ–మెయిల్స్, ఫోన్ల ద్వారా పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారులతో రెగ్యులర్ టచ్‌లో ఉండేవాడు. కొన్ని ఈ–మెయిల్ కాపీలను సైతం అర్షద్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. తొలుత అబిడ్స్ పోలీసుస్టేషన్లో నమోదైన ఈ కేసు అనంతరం (సిట్)కు బదిలీ అయింది. అతడి విచారణ నేపథ్యంలోనే ఈ రహస్యాల చేరవేతలో తనకు షేర్ అలీ కేశ్వానీ సహకరించినట్లు చెప్పడంతో అతడిని రెండో నిందితుడిగా చేర్చారు. అయితే అప్పటికే కేశ్వానీని ఆగ్రా పోలీసులు అరెస్టు చేశారు. 2004 జనవరిలో పట్టుబడిన ఇతగాడిపై అక్కడ కేసు విచారణ పూర్తికావడం, జైలు శిక్ష సైతం విధించడంతో సుదీర్ఘకాలం సిటీకి తీసుకురాలేదు. ఐదేళ్ల విచారణ అనంతరం నాంపల్లి కోర్టు మాలిక్‌కు 2009లో జీవితఖైదు విధించింది. మూడో నిందితునిగా ఉన్న కొరియర్ సర్వీస్ నిర్వాహకుడు, హవాలా ఆరోపణలు ఎదుర్కొన్న మిలింద్ దత్తాత్రేయను నిర్ధోషిగా ప్రకటించింది. ఆగ్రా జైలులో శిక్ష అనుభవిస్తున్న కేశ్వానీని 2013లో సిటీకి తీసుకువచ్చారు. అతడిపై కోర్టు విచారణ జరిపినప్పటికీ పోలీసులు సరైన ఆధారాలు సమర్పించలేకపోవడంతో 2015 మార్చి 9న కేసు వీగిపోయింది. అర్షద్ మాలిక్ పాకిస్థానీ కావడంతో పాటు బంగ్లాదేశ్‌కు చెందిన బోగస్ పాస్‌పోర్ట్‌తో భారత్‌లోకి వచ్చారు. అరెస్టు సందర్భంలో దానిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఇతడు పాస్‌పోర్ట్ లేని విదేశీయుడిగా మారిపోయాడు. కేశ్వానీ విషయానికి వస్తే ఇతగాడు పాకిస్థానీ అని ఆరోపించిన పోలీసులు అందుకు ఆధారాలు చూపలేకపోయారు. తాను భారతీయుడినే అంటున్న కేశ్వానీ సైతం ఎలాంటి «ధ్రువీకరణలు సమర్పించలేదు. దీంతో ఇలాంటి వారు శిక్షాకాలం పూర్తయినా, కేసు వీగిపోయినా జైలు నుంచి బయటకు పంపాలంటే ఆయా దేశాలు సదరు వ్యక్తి మా పౌరుడే అని అంగీకరిస్తూ ప్రత్యేకంగా పాస్‌పోర్ట్, వీసా జారీ చేసి తమ ఆధీనంలోకి తీసుకోవాలి. ఈ కేసులో అర్షద్ తమ జాతీయుడేనని అంగీకరించడంతో 2017లో అతడిని పాక్‌కు పంపించేశారు. కేశ్వానీని ఆ దేశం ‘ఓన్’ చేసుకోకపోవడంతో ఇప్పటికే చర్లపల్లి జైలులోనే ఉంచారు. ఇదే కేసులో మిగిలిన నిందితులైన బంగ్లాదేశ్, పాకిస్థానీయులు ఫజల్ ఉర్ రెహమాన్, రజాక్, రషీద్, లియాఖత్, పీర్జీ అలియాస్ కరీంభాయ్లు ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు. -
12 ఏళ్ల కుమార్తె నగ్న చిత్రాలు ఆన్లైన్లో..
సాక్షి, సిటీబ్యూరో: ‘ఆమె’ కోసం అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించి... సైబర్ నేరంలో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు పట్టుబడిన పాకిస్థాన్ జాతీయుడు మహ్మద్ ఉస్మాన్ ఇక్రమ్ కేసులో అధికారులు అత్యంత కీలకమైన ‘కాన్సులర్ యాక్సస్’ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. తీహార్ జైల్లో రెండు రోజుల క్రితం ఈ తంతు పూర్తి చేశారు. అతడి జాతీయత నిర్ధారణలో ఈ ఘట్టం అత్యంత కీలకమని, ఈ నేపథ్యంలో పాకిస్థాన్ కాన్సులేట్ అధికారులకు అనేక కీలక పత్రాలు అందించామని సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి సోమవారం తెలిపారు. ఇతడికి ఆ దేశం జారీ చేసిన పాస్‌పోర్ట్, దాని ఆధారంగా తీసుకున్న వీసాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాల్సిందిగా కోరుతూ ఇప్పటికే లేఖ రాశారు. ఈ ఏడాది జూన్ ఆఖరి వారంలో ఢిల్లీ వెళ్లిన ప్రత్యేక బృందం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) ద్వారా ఈ లేఖను పంపారు. భారతీయుడిగా నమ్మించి వివాహం... పాతబస్తీకి చెందిన ఓ మహిళ కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లింది. అక్కడ ఆమెకు పాకిస్థానీ మహ్మద్ ఉస్మాన్ ఇక్రమ్ అలియాస్ మహ్మద్ అబ్బాస్ ఇక్రమ్‌తో పరిచయం ఏర్పడింది. తాను భారతీయుడినేనని, స్వస్థలం ఢిల్లీ అని నమ్మించిన అతగాడు ఆమెను వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లకు అసలు విషయం తెలియడంతో సదరు మహిళ హైదరాబాద్ తిరిగి వచ్చేసింది. 2011లో ఉస్మాన్ సైతం హైదరాబాద్‌కు వచ్చాడు. అప్పట్లో తాను ఆరు నెలల విజిట్ వీసాపై వచ్చానంటూ చెప్పాడు. వాస్తవానికి దుబాయ్ నుంచి నేపాల్ వరకు విమానంలో వచ్చిన అతను అక్కడి నుంచి రోడ్డు, రైలు మార్గాల్లో ఢిల్లీ వెళ్లి అట్నుంచి హైదరాబాద్ చేరుకున్నాడు. ‘కూతురినే’ వేధించి కటకటాల్లోకి... ఇక్రమ్ వచ్చిన ఆరు నెలలకు ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు అతడిని దూరంగా ఉంచింది. దీంతో కక్షకట్టిన అతను ఆమె 12 ఏళ్ల కుమార్తె నగ్న చిత్రాలు తీయడంతో పాటు కొందరికి ఆన్లైన్లో విక్రయించానంటూ ఆమెను బెదిరించాడు. తనకు డబ్బు ఇవ్వకపోతే సదరు ఫొటోలను బయటపెడతానంటూ బాధితురాలి స్నేహితురాలికీ వాట్సాప్ సందేశం పంపాడు. అతడి వేధింపులు తాళలేక బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. గత నెలలో నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. విచారణ నేపథ్యంలో అబ్బాస్ పేరుతో అనేక బోగస్ ధ్రువీకరణలు పొందిన ఉస్మాన్ పాస్‌పోర్ట్ సైతం తీసుకున్నట్లు వెల్లడైంది. సర్టిఫికెట్ల ఆధారంగా కొన్ని ప్రైవేట్ ఉద్యోగాలు చేసినట్లు బయటపడింది. నిర్థారించాలంటే ‘ధ్రువీకరించాల్సిందే’... ఇతడిని అరెస్టు చేసినప్పుడు మహారాష్ట్రలోని ఓ ప్రైవేట్ విద్యా సంస్థలో టెన్త్ నుంచి డిగ్రీ చదివినట్లు ఉన్న సర్టిఫికెట్లతో పాటు అబ్బాస్ పేరుతో గోల్నాక చిరునామాతో 2012లో తీసుకున్న భారత పాస్‌పోర్ట్, ఆధార్ సహా ఇతర గుర్తింపుకార్డులతో పాటు పాక్ పాస్‌పోర్ట్‌నకు చెందినదిగా అనుమానిస్తున్న ఓ పేజీ జిరాక్సు ప్రతిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సర్టిఫికెట్ల ఆధారంగా 2003లో టెన్త్, 2003–05ల్లో ఇంటర్, 2005–08ల్లో డిగ్రీ పూర్తి చేసినట్లు ఉంది. ఇప్పటికే వీటిని తయారు చేసి ఇచ్చిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అయినా ఇవన్నీ తప్పని తేలాలంటే ఆ సమయంలో ఇక్రమ్ భారత్‌తో లేనట్లు నిర్థారించాల్సి ఉంది. వాస్తవానికి ఇక్రమ్ 2009 వరకు పాకిస్థాన్ పాస్‌పోర్ట్‌తో దుబాయ్‌లో ఉన్నాడు. అతడు పాక్ జాతీయుడనే అంశంతో పాటు ఈ విషయాన్నీ పాక్ «ధ్రువీకరిస్తేనే బోగస్ వ్యవహారం నిర్థారణ సాధ్యమవుతుంది. ఈ నేపథ్యంలో ఎంఈఏ ద్వారా ఇప్పటికే లేఖ రాశారు. తీహార్‌కు వచ్చిన కాన్సులేట్ అధికారులు... దాదాపు వారం రోజుల క్రితం సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు ఇక్రమ్‌ను కోర్టు అనుమతితో తీహార్ జైలుకు తరలించారు. రెండు రోజుల క్రితం జైలులో ఇక్రమ్‌ను కలిసిన పాకిస్థాన్ కాన్సులేట్ అధికారులు అతడితో మాట్లాడటంతో పాటు సైబర్ క్రైమ్ పోలీసులు ఇచ్చిన డాక్యుమెంట్లు తీసుకున్నారు. ఇతడి అరెస్టు నేపథ్యంలో స్వాధీనం చేసుకున్న పాక్ పాస్‌పోర్ట్ జిరాక్సు ప్రతినీ అధికారులకు కాన్సులేట్ వారికి అందించారు. దీన్నే సాంకేతికంగా ‘కాన్సులర్ యాక్సస్’ గా పేర్కొంటారని అధికారులు తెలిపారు. ఈ వివరాలు సరిచూసిన తర్వాత కాన్సులేట్ అధికారుల జవాబు ఇవ్వడంతో పాటు ఇక్రమ్‌కు అవసరమైన ట్రావెల్ డాక్యుమెంట్లను జారీ చేస్తారు. వీటి ఆధారంగానే ఈ కేసులో శిక్ష పడితే అది పూర్తయిన తర్వాత, వీగిపోతే తక్షణం ఇక్రమ్ పాక్ వెళ్లడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ ఇక్రమ్ తమ పౌరుడు కాదని పాక్ జవాబు ఇస్తే... అసలు ఈ కేసులో సాంకేతిక ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో దీనిపై పాక్ నుంచి సమాధానం వచ్చిన తర్వాతే ఎలా ముందుకు వెళ్లాలన్నది నిర్ణయించనున్నారు. -
‘పాకిస్తానీని పెళ్లి చేసుకున్న మీరు..’
సాక్షి, ముంబై : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కతువా గ్యాంగ్‌రేప్, హత్య, ఉనావో అత్యాచార కేసు గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఈ ఘటనలను ఖండిస్తూ ఫర్హాన్ అక్తర్, రితేశ్ దేశ్‌ముఖ్, జావేద్ అక్తర్‌తో పాటు పలువురు సెలబ్రిటీలు ట్వీట్ చేస్తున్నారు. తాజాగా టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా కూడా ఈ దురాగతాలను ఖండిస్తూ ట్వీట్ చేయగా ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ‘ఇదేనా మనం కోరుకున్న దేశం. ఎనిమిదేళ్ల బాలికకు కుల, మత, లింగ, వర్ణ భేదాలకు అతీతంగా మనం అండగా నిలబడలేకపోతే మనం ఇంకే విషయంపైనా పోరాడలేం. అది మానవత్వం అనిపించకోదు కూడా’ అంటూ భావోద్వేగంతో సానియా ట్వీట్ చేశారు. సానియా ట్వీట్‌కు స్పందించిన ఓ నెటిజన్.. ‘గౌరవనీయులైన మేడమ్.. మీరు ఏ దేశం గురించి మాట్లాడుతున్నారు. నాకు తెలిసి మీరు ఒక పాకిస్తానీని పెళ్లాడారు కదా. మీకు భారత్‌తో ఇంకా సంబంధం ఉందా. పాకిస్తాన్ టెర్రరిస్టుల చేతుల్లో ప్రాణాలు కోల్పోతున్న అమాయక ప్రజల గురించి మీరు ట్వీట్ చేస్తే బాగుంటుంది అంటూ వ్యంగంగా ట్వీట్ చేశారు. అయితే సానియా మీర్జా కూడా ఏమాత్రం తగ్గలేదు. ఎవరిని పెళ్లి చేసుకున్నామనేది ముఖ్యం కాదు. నేను భారత్ కోసం ఆడతాను. నేను భారతీయురాలిని. జీవితాంతం అలాగే ఉంటాను. నేను మీలాగా స్పందించకుండా ఉండలేను. మానవత్వం ఉన్న ప్రతీ ఒక్కరు ఇలాంటి సమయాల్లో మతాల గురించి, మరే ఇతర అంశాల గురించి మాట్లాడరని’ దీటుగా సమాధానమిచ్చారు. Is this really the kind of country we we want to be known as to the world today ?? If we can’t stand up now for this 8 year old girl regardless of our gender,caste,colour or religion then we don’t stand for anything in this world.. not even humanity.. makes me sick to the stomach pic.twitter.com/BDcNuJvsoO — Sania Mirza (@MirzaSania) April 12, 2018 With all respect madam which country are you talking abt.Last time I checked u had married into Pakistan. You no longer are a Indian. And if u must tweet thn also tweet for the innocents killed by Pak terror outfits.. — Kichu Kannan Namo (@Kichu_chirps) April 12, 2018 -
ఈ బిడ్డది ఏ దేశం!
సాక్షి, బెంగళూరు: ఆయనది భారత్.. ఆమెది పాకిస్తాన్. ఆమె అక్రమంగా భారత్‌లోకి చొరబడింది. వారికి ఈ మధ్యే ఓ అమ్మాయి పుట్టింది. ఆ బిడ్డ జాతీయతను నిర్ధారించడం బెంగళూరు పోలీసులకు పెద్ద సమస్యగా మారింది. కేరళకు చెందిన మహ్మద్ శిహాబ్ 2010లో దుబాయ్‌కి వెళ్లి ఓ నిర్మాణ కంపెనీలో కార్మికుడిగా చేరాడు. పాకిస్తాన్‌లోని కరాచీ నుంచి వచ్చిన సమీరా అబ్దుల్ రెహమాన్ అనే యువతితో అతడు అక్కడ ప్రేమలో పడి వివాహం చేసుకున్నాడు. ఇందుకు యువతి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో వారు మరో ఇద్దరు పాకిస్తాన్‌కే చెందిన దంపతులతో కలసి నేపాల్ మీదుగా కోల్‌కతాకు అక్కడి నుంచి బెంగళూరు చేరుకున్నారు. వీరంతా కుమారస్వామి లేఔట్లో అద్దె ఇంట్లో కలిసే ఉంటూ కూలి పనులు చేసుకుంటున్నారు. మిగిలిన ముగ్గురుకి మహ్మద్ శిహాబ్ నకిలీ ఆధార్ కార్డులను సంపాదించి పెట్టాడు. ఈ సంగతి తెలియడంతో మే నెలలో పోలీసులు నలుగురినీ అరెస్టుచేశారు. అరెస్టు సమయంలో గర్భిణిగా ఉన్న రెహమాన్ సెప్టెంబర్ 19న ఇక్కడి వాణి విలాస్ ఆసుపత్రిలో ఆడబిడ్డకు జన్మినిచ్చింది. తల్లీబిడ్డ ఆస్పత్రిలోనే ఉన్నారు. నిబంధనలు ఏమంటున్నాయి? ద సిటిజన్‌షిప్ యాక్ట్ 1955 ప్రకారం 2004 డిసెంబర్ 3 తర్వాత భారత్‌లో పుట్టే శిశువు భారతీయుడు లేదా భారతీయురాలే. శిశువు తల్లిదండ్రుల్లో కనీసం ఒకరు భారతీయుడై ఉండాలి. మరొకరు అక్రమ వలసదారు కాకూడదు. ఈ సందర్భంలో తల్లి అక్రమంగా వలసొచ్చిందికాబట్టి శిశువు జాతీయత ఏమిటనేది తేల్చలేకపోతున్నారు. నకిలీ ఆధార్ కార్డు కలిగి ఉండటం, అక్రమంగా భారత్‌లో నివసిస్తుండటంలాంటి 9 కేసులను సమీరాతో పాటు మిగిలిన ఇద్దరిపై నమోదుచేశారు. విదేశీ వ్యక్తి ఏదేని కేసులో ఇరుక్కుంటే విచారణ పూర్తయ్యేంత వరకూ అతను లేదా ఆమె దేశం దాటి వెళ్లడానికి లేదు. ప్రస్తుతానికి సమీరా జైలులోనే ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. బిడ్డను కొద్ది నెలల పాటు తల్లితోనే ఉంచాక∙శిశు సంక్షేమ శాఖకు అప్పగించాలా లేక తండ్రికా అనే విషయంపై పోలీసులు న్యాయనిపుణుల సలహాలు తీసుకునే అవకాశముంది. -
జాతీయత ఏది? వీరి బిడ్డకు ఎంత కష్టమో..
సాక్షి, బెంగళూరు: బెంగళూరులోని వాణి విలాస్ ఆసుపత్రిలో ఓ విదేశీ మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ప్రస్తుతం ఆ శిశువు ఏ దేశానికి చెందినదన్న విషయం పై రాష్ట్ర పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. కేరళకు చెందిన మహ్మద్ శిహాబ్ 2010లో దుబాయ్‌కు వెళ్లి అక్కడ నిర్మాణ రంగంలో కార్మికుడిగా పనిచేసేవాడు. అక్కడే ఉపాధి కోసం పాకిస్తాన్‌లోని కరాచీ నుంచి వచ్చిన సమిరా అబ్దుల్ రెహమాన్ అనే యువతి మహ్మద్ శిహాబ్కు పరిచయం అయ్యింది. ఆ పరిచయం ప్రేమగా మారి వివాహానికి దారి తీసింది. అయితే ఇందుకు యువతి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో వారిద్దరు మరో ఇద్దరు పాకిస్తాన్‌కే చెందిన వ్యక్తులతో కలిసి మొదట నేపాల్‌కు అటు పై పశ్చిమబెంగాల్‌కు అక్కడి నుంచి బెంగళూరుకు చేరుకున్నారు. వీరంతా కలిసే ఉంటూ చిన్నచిన్న కూలి పనులు చేసుకునేవారు. ఈ ముగ్గురుకి మహ్మద్ శిహాబ్ నకిలీ ఆధార్ కార్డు కూడా సంపాధించిపెట్టారు. ఇదిలా ఉండగా మే నెలలో నగర పోలీసులు ఓ కారు దొంగతనం కేసులో దర్యాప్తు చేస్తుండగా కుమారస్వామి లే అవుట్లో పాకిస్తాన్‌కు చెందిన ముగ్గురు అక్రమంగా నివాసం ఉంటున్న విషయం బయటపడింది. దీంతో సమిరా అబ్దుల్ రెహమాన్, శిహాబ్తోపాటు మిగిలిన వారిని కూడా అరెస్టు చేసి తమ కస్టడీకి తీసుకున్నారు. ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. అరెస్టు సమయంలో సమిరా అబ్దుల్ రెహమాన్ గర్భిణి. ఈ క్రమంలో సెప్టెంబర్ 18న సమిరా ప్రసవం కోసం వాణి విలాస్ ఆసుపత్రికి చేరగా మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 19న ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అయితే బిడ్డ బరువు తక్కువగా ఉండటంతో ప్రస్తుతం తల్లి, బిడ్డ ఆమె వాణి విలాస్ ఆసుపత్రిలోనే ఉన్నారు. నిబంధనలు ఏమి చెబుతాయి... ద సిటిజన్ షిప్ యాక్ట్ 1955 ప్రకారం ‘2004 డిసెంబర్ 3 తర్వాత భారత దేశంలో పుట్టే ప్రతి శిశువు భారతీయుడు లేదా భారతీయురాలుగానే పరిగణిస్తారు. అయితే సదరు శిశువు తల్లిదండ్రులు ఇద్దరూ లేదా ఇద్దరిలో ఒకరు భారతీయుడై ఉండాలి. మరొకరు అక్రమంగా వలసవచ్చిన వారై ఉండ కూడదు. అయితే, తాజా ఘటనలో శిహాబ్ భారతీయుడైనా ఆయన భార్య సమిరా అక్రమంగా వలస వచ్చిన మహిళ. అందువల్ల సదరు బిడ్డ జాతీయతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్‌కు పంపలేమా? భారతదేశంలో ఎవరైనా విదేశీయులు అక్రమంగా నివశిస్తున్నట్లు తేలితే వారిని ఫారినర్స్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అప్పగించి అక్కడి నుంచి సదరు వ్యక్తి స్వదేశానికి పంపించవచ్చు. అయితే అక్రమంగా ఆధార్ కార్డు కలిగి ఉండటం, అక్రమంగా భారత భూభాగంలో నివశిస్తుండటం తదితర తొమ్మిది నేరాలు ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీఎసీ) ప్రకారం సమిరాతోపాటు మరో ఇద్దరిపై మోపారు. విదేశీ వ్యక్తి ఏదేని కేసులో విచారణ ఎదుర్కొంటుంటే సదరు విచారణ పూర్తయ్యేంత వరకూ ఆ వ్యక్తి దేశం దాటి వెళ్లడానికి లేదు. దీంతో ప్రస్తుతానికి సమిరా ఇక్కడి జైలులోనే ఉండాల్సిన పరిస్థితి. ఈ తొమ్మిది కేసుల విషయం తేలడానికి సంవత్సరాల వ్యవధి పడుతుందని పోలీసులే చెబుతున్నారు. బిడ్డను ఎక్కడ ఉంచాలి? ఈ విషయమై జైలు అధికారులు సంబంధిత తల్లితో మాట్లాడి నిర్ణయం తీసుకోవడానికి అధికారం ఉంది. బిడ్డను కొద్ది నెలలపాటు తల్లితోనే ఉంచి అటుపై శిశు సంక్షేమశాఖ అధికారులకు అప్పగించవచ్చు. తండ్రి మహ్మద్ శిహాబ్కు సదరు బిడ్డను అప్పగించే విషయంపై కూడా కూడా జైలు, పోలీసు అధికారులు న్యాయనిపుణుల సలహాలు తీసుకులే ఆలోచనలో ఉన్నారు. వైద్యం అందించవచ్చా? ఒకవ్యక్తి మెడికల్ ఎమర్జెన్సీలో వైద్యుని దగ్గరకు వచ్చినప్పుడు మిగిలిన విషయాలు వదిలి అతని ప్రాణం కాపాడే విషయంపై వైద్యులు దష్టి సారించాలని వైద్య నిబంధనలు చెబుతాయి. ఈ క్రమంలోనే సమిరా అబ్దుల్ రెహమాన్‌కు వైద్యం అందిచామని వాణి విలాస్ ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు. -
జాతీయభావాలే ఊపిరిగా...
భారతీయత, జాతీయత, లౌకికవాదం వంటి అంశాల మీద టీవీ చానెళ్లలో తీవ్ర వాదోపవాదాలు జరుగుతున్నాయి. పలు సందర్భాలలో శర్మగారు పాల్గొని జాతీయత అనే అంశం పట్ల స్పష్టత ఇచ్చేవారు. విద్య కాషాయీకరణ అంశం మీద చర్చలు జరిగినప్పుడు శర్మ విశిష్టమైన అంశాలను వెల్లడించేవారు. ఏ విషయం గురించి అయినా అవగాహన కలిగి ఉండడం, మార్గదర్శనం చేయగలగడం, అప్పగించిన ప్రతి పనిని రాజీ లేని రీతిలో పూర్తి చేయడం, ఇదంతా సిద్ధాంత స్ఫూర్తి పరిధిలో చేయడం కొందరికే సాధ్యమవుతుంది. సంస్థలేవయినా అలాంటివారిని గొప్ప సంపదగా భావిస్తాయి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్), అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ), సంఘ్ పరివార్‌కు చెందిన ప్రచురణ విభాగాలు తమకు గొప్ప సంపదగా భావించే వ్యక్తి తుమ్మలపల్లి హరిహరశర్మ. అధ్యాపకునిగా, సామాజిక కార్యకర్తగా, అసాధారణ పాఠకునిగా, టీవీ చానళ్లలో వక్తగా హరిహరశర్మ చాలామందికి పరిచయస్థులే. ఈ కార్యకలాపాలకే ఆయన తుది శ్వాస వరకు జీవితాన్ని అంకితం చేశారు. కృష్ణా జిల్లాకు చెందిన శర్మ 1950 ప్రాంతంలోనే ఆరెస్సెస్ కార్యకర్తగా మారారు. కుటుంబం నుంచి వచ్చిన ఆధ్యాత్మిక సంపద, సంస్థ ఇచ్చిన జాతీయతా భావాలు ఆయన ప్రతి మాటలోను, రాతలోను ధ్వనించేవి. శర్మ ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. ఆంగ్ల సాహిత్యం చదివారు. తరువాత ఎల్ఎల్ఎం కూడా పూర్తి చేశారు. రాజమండ్రి, కర్నూలు, కడప ప్రభుత్వ కళాశాలల్లో కొంతకాలం అధ్యాపకునిగా పని చేసిన తరువాత ఆరెస్సెస్ పెద్దల అభిప్రాయం మేరకు ప్రభుత్వోద్యోగాన్ని విడిచిపెట్టారు. సంస్థ నిర్ణయం మేరకు విద్యారంగంలో పనిచేయడానికీ, విద్యార్థి విభాగాన్ని నిర్మాణం చేయడానికీ శ్రమించారు. దాని ఫలితంగానే భాగ్యనగరంలో ఏర్పాటు చేసిన కాలేజ్ ఆఫ్ కామర్స్‌కు ప్రిన్స్‌పాల్‌గా నియమితులయ్యారు. ఇక్కడే పదవీ విరమణ చేశారు కూడా. ఆరెస్సెస్ సూచన మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏబీవీపీని బలోపేతం చేసే పనిని ఆయన స్వీకరించారు. ఆ విధంగా తెలుగు ప్రాంతాలలో ఏబీవీపీ సంస్థ నిర్మాణానికి పూనుకున్న తొలితరం వ్యక్తులలో ఆయన కూడా ఒకరయ్యారు. ఆ సంస్థ ప్రాంత ప్రముఖ్‌గా, అధ్యక్షులుగా శర్మ మూడు దశాబ్దాలు పనిచేశారు. ఏ విధంగా చూసినా శర్మగారి జీవితం ఆదర్శప్రాయంగా కనిపిస్తుంది. ఆయనకు కళాశాల ప్రిన్స్‌పాల్ పదవి ఉంది. గృహస్థు కూడా. కానీ తన పూర్తి సమయాన్ని ఆయన సామాజిక సేవకు వెచ్చించారు. ఉద్యోగ విరమణ తరువాత కూడా అదే దీక్షతో తను నమ్మిన సిద్ధాంతానికీ, సంస్థలకీ సేవలు అందించారు. ఆరెస్సెస్‌లో కనిపించే పూర్తి సమయం కేటాయించే కార్యకర్తల మాదిరిగా (ప్రచారక్‌లు)ఆయన పనిచేశారు. అందుకే ఆయన పట్ల సంస్థకు అచంచలమైన గౌరవం. చాలామందికి ప్రేరణ కూడా. ఎందుకంటే ఒక సంస్థలో, వ్యవస్థలో పనిచేయడం చాలామందికి తెలుసు. కానీ ఆయా సంస్థల మౌలిక లక్షణాలనూ, వ్యవస్థాగత రూపురేఖలనూ, తాత్వికతనూ ప్రతి అడుగులోను గౌరవించుకుంటూ పనిలో నిమగ్నం కావడం నిజంగా ప్రత్యేక లక్షణమే. అదే శర్మగారిలో దర్శనమిస్తుంది. తలమునకలుగా కార్యకలాపాలలో మునిగి ఉన్నా కూడా ఏనాడూ ఆయన తన మృదు స్వభావాన్ని వీడలేదు. కానీ చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పడానికి నీళ్లు నమలడం కూడా ఆయన లక్షణం కాదు. ఆయన నిరాడంబర జీవితం కూడా అద్భుతంగా అనిపించేది. ఇదే కుటుంబ సభ్యులకు కూడా వారసత్వంగా ఆయన అందించారు. పిల్లలను విద్యావంతులను చేశారు. నిజానికి ఆయన తన పిల్లలకు ఇచ్చిన ఆస్తులు ఇవి మాత్రమే. జాతీయత, సచ్చీలత వంటి అంశాలను, సిద్ధాంతాలను ఆయన కార్యకర్తలకు ఎరుక పరిచే తీరు స్మరణీయమైనది.వాటి గురించి ఉపన్యాసాలతో వివరించే ప్రయత్నం శర్మగారు ఏనాడూ చేయలేదు. ఆచరణతోనే వాటిని కార్యకర్తలు, తన చుట్టూ ఉన్నవారు గ్రహించేలా చేయడంలో ఆయన ప్రతిభ విశేషంగా కనిపించేది. ఆయన పనిచేసినది ప్రిన్స్‌పాల్‌గా. తరువాత ఏబీవీపీ నిర్మాణం పని. అంటే మొత్తం యువతరంతో, విద్యార్థులతో వ్యవహారం. యువతరాన్ని మంచిబాటలో పెట్టడం చిన్న విషయం కాదు. ఆ వయసునీ, ఆ వయసు తత్వాన్నీ ఆయన అర్థం చేసుకుని ఎందరినో చక్కని పౌరులుగా తీర్చి దిద్దగలిగారు. ఆయన జీవన విధానమే ఎందరినో పరివార్ సంస్థలతో శాశ్వత బంధం ఏర్పరుచుకోవడానికి దోహదం చేసిందంటే అతిశయోక్తి కాదు. ఆయన సరైన సమయంలో నిర్ణయాలు తీసుకునేవారు. అవి సరైన నిర్ణయాలేనని కాలం రుజువు చేసేది. ఇది ఆయన తయారు చేసిన కార్యకర్తలలో ప్రతిబింబించేది కూడా. కార్యకర్తల వ్యక్తిగత జీవితం మీద కూడా శర్మగారి ప్రభావం గణనీయంగా కనిపిస్తుంది. వ్యక్తిగత సమస్యలతో సంస్థ కార్యక్రమాన్ని, నిజం చెప్పాలంటే సామాజిక కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేయకుండా సంయమనం, సమతుల్యత పాటింప చేయడంలో ఆయన ఇచ్చిన ప్రేరణ ప్రభావం కనిపిస్తుంది. అలాగే సంస్థను నడపడంలో జరిగే పొరపాట్లను సరిచేయడంలో ఆయన చూపిన నైపుణ్యం కూడా ప్రత్యేకమైనది. సమాజం కోసం పనిచేస్తున్న వారు చేసే పొరపాట్లను సరిదిద్దే విధానం చెప్పుదగినది. ఎవరి మనసు నొప్పించకుండా, జరిగిన నష్టాన్ని గుర్తించేటట్టు చేస్తూనే మళ్లీ సంస్థ నడకను గాడిలో పెట్టడంలో శర్మగారు ఉద్దండులు. ఆరెస్సెస్ విద్యా వ్యాప్తికి చేస్తున్న కృషిలో కూడా ఆయన భాగస్థులయ్యారు. అన్ని సంస్థలలో పని చేస్తూ కూడా శర్మగారు కేశవ మెమోరియల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఈ సంస్థ మార్గదర్శకత్వంలో ఎన్నో విద్యాసంస్థలు పనిచేస్తున్నాయి. శర్మగారు మంచి పాఠకుడు. అన్ని పత్రికలు, వార, మాస పత్రికలు చదివేవారు. అందులో వచ్చే ధారావాహికలు కూడా ఆయన ఓపికగా చదివేవారు. సాహిత్యంలో, రచనలలో నడుస్తున్న చరిత్ర ప్రతిబింబిస్తున్నదా లేదా అనే అంశం ఆయనకు పట్టింపుగా ఉండేది. రచనలలో విలువల పతనం గురించి కూడా ఆయన గమనించేవారు. ఏబీవీపీ సంస్థ కోసం ప్రచురించే ‘సాందీపని’పత్రికకు ఆయన సలహాదారు. జాగృతి ప్రకాశన్ ట్రస్ట్‌కు అధ్యక్షులుగా, కార్యదర్శిగా పదిహేనేళ్లు సేవలు అందించారు. ఎంత తక్కువ సమయం ఉన్నా, పత్రికకు అవసరమైన వ్యాసాన్ని అందివ్వడం ఆయనకే సాధ్యమయ్యేది. ఆ పత్రిక కోసం ఎన్నో సంపాదకీయాలు రాశారు. అలాగే రచన జర్నలిజం కళాశాల ప్రిన్సిపాల్‌గా, అధ్యాపకునిగా కూడా ఆయన సేవలు అందించారు. గత కొన్నేళ్ల నుంచి భారతీయత, జాతీయత, లౌకికవాదం వంటి అంశాల మీద టీవీ చానెళ్లలో తీవ్ర వాదోపవాదాలు జరుగుతున్నాయి. అందులో పలు సందర్భాలలో శర్మగారు పాల్గొని జాతీయత అనే అంశం పట్ల స్పష్టత ఇచ్చేందుకు శ్రమించారు. విద్య కాషాయీకరణ అనే అంశం మీద సైద్ధాంతిక సంఘర్షణ జరిగినప్పుడు నిజానిజాల గురించి శర్మ విశిష్టమైన అంశాలను వెల్లడించేవారు. సంఘ్ పరివార్ అభిప్రాయాలను లోకానికి తెలియచేయడానికి, వివరించడానికి ఉద్దేశించిన సమాచార భారతి సంస్థకు ఆయన 12 సంవత్సరాలు అధ్యక్షులుగా పనిచేశారు. ఇన్ని కోణాలలో ప్రతిభను కలిగి ఉన్నప్పటికీ, వాగ్ధాటి ఉన్నప్పటికీ ఆయన ఏనాడూ ఏకపక్షంగా వ్యవహరించేవారు కాదు. సమష్టి నిర్ణయాలను ఆయన మనస్ఫూర్తిగా ఆహ్వానించేవారు. హరిహరశర్మ గారు కన్ను మూయడం ఏబీవీపీకీ, ఆరెస్సెస్‌కు తీరని లోటు. (జూన్ 29న హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచిన హరిహరశర్మకు నివాళిగా) – రాంపల్లి మల్లికార్జునరావు ‘సమాచార భారతి సంపాదకులు‘ 95022 30095 -
అసలు ఓటమి భారతీయతదే!
సందర్భం జేఎన్‌యూలో జరిగిన ఫిబ్రవరి 9 సంఘటనకు ఏడాది పూర్తయిన సందర్భంగా నాకు ఇందోర్ నుంచి వచ్చిన ఒక టెలిఫోన్ కాల్ గుర్తుకొచ్చింది. ఆ రోజుల్లో దేశమంతటా దేశభక్తులకూ, దేశద్రోహులకూ ముద్రలు వేసే క్రమం జోరుగా సాగుతోంది. జేఎన్యూయైట్లూ, భుజానికి జోలెసంచీలు వేలాడేసుకునేవాళ్లూ, గడ్డం కలిగి ఉన్న వాళ్లూ వేధింపులకు గురవుతున్న రోజులవి. నేను కూడా టీవీ చర్చల్లో పాల్గొన్నాను. రెండు బృందాలకు విడిగా మూడో దృక్పథాన్ని ముందుకు తెచ్చే ప్రయత్నం చేశాను. ఆ సమయంలోనే ఆ కాల్ వచ్చింది. ‘నేను మిమ్మల్ని బాగా గౌరవిస్తాను. మీరు చాలా అర్థవంతంగా, గంభీ రంగా మాట్లాడుతారు. మీరు ఏదో ఒక పార్టీ పక్షం వహించడానికి బదులు దేశ ప్రయోజనాలనే పరమావధిగా భావిస్తారు. కానీ జేఎన్‌యూ సమస్యలో మీరు దేశద్రోహుల వైపు ఎందుకు నిలబడ్డారు?‘ ఇదీ అటువైపు నుంచి వచ్చిన ప్రశ్న. కాలర్ నిజంగానే బాధలో ఉన్నారు. నేను ఈ సమస్యకు సంబంధించిన వాస్త వాల్ని ఆయనకు తెలిపాను. ఫిబ్రవరి 9న జేఎన్‌యూలో జరిగిందని చెబుతున్న వాటి పట్ల అంత గట్టి నమ్మకంతో ఎందుకున్నారని ప్రశ్నించాను. కోర్టు ఆవ రణలో కన్హయ్యకుమార్పై దాడి చేసి కొట్టిన సంఘటన గురించి అడిగాను. అట్లాగే జాతీయవాదం విషయంలో జేఎన్యూకు చెందిన చాలా మంది అభిప్రాయంతో నాకు ఏకీభావం లేదని కూడా స్పష్టం చేశాను. అయితే ఆ సంఘటనలకు సంబంధించిన వాస్తవాల ఆధారంగా నేను వాళ్లతో ఏకీభవి స్తాను. ఏం చెప్పినా నా మాటలు కాలర్‌ను సంతృప్తి పర్చలేకపోయాయి. ఎందుకంటే అప్పుడాయన వాస్తవాలను పట్టించుకోవడానికి సిద్ధంగా లేరు. ‘ఒకవైపు భారతమాతకు అవమానం జరుగుతుంటే మీరు అవీ ఇవీ చెబు తున్నారు. అసలు ప్రశ్నపై మీరే వైపు నిలబడి ఉన్నారు?‘ అని సూటిగా అడిగారాయన. ఆయన ఆవేశంతో ఉన్నట్టుగా అనిపించింది. మరెప్పుడైనా శాంతంగా మాట్లాడుకోవచ్చని భావించాను. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ ఆయనతో సంభాషణ జరగలేదు. ఇందోర్ గుర్తుంది కానీ ఫోన్ చేసిన వ్యక్తి పేరు గానీ, అతని ఫోన్ నంబరు గానీ ఏవీ నా దగ్గర లేవిప్పుడు. ఇప్పుడు, ఈ సంఘటన జరిగి సంవత్సరం పూర్తయిన సందర్భంగా నేను మనసులోనే ఆయనతో సంభాషిస్తున్నాను. అదేమిటో మీరూ వినండి. నిరుడు మనం మాట్లాడుకున్నప్పుడు మీరు చాలా ఆవేశంగా ఉన్నారు కదా. కానీ జేఎన్‌యూలో జరిగిన పరిణామాల్లో చివరకు వెల్లడైన వాస్తవాలేమిటో చూడండి. మీరు ఏ వీడియో టేపు గురించి చాలా ఆవేశంగా మాట్లాడారో, చివరకు ఆ టేపు అసలైంది కాదనీ, నకిలీదనీ తేలిపోయింది. దానిని తారుమారు చేసి అందులో రెచ్చగొట్టే మాటల్ని జొప్పించారు. ఇప్పటికి సంవత్సర కాలం గడచిపోయింది కదా. జేఎన్‌యూ విద్యార్థి నేతలు నిజంగానే భారత్‌కు వ్యతి రేకంగా నినాదాలు చేసినట్టయితే పోలీసులు వాటికి సంబంధించిన సాక్ష్యాలను ఇంకా కోర్టుకు ఎందుకు సమర్పించలేకపోయారో మీరే ఆలోచించండి. మరో వైపు, కన్హయ్యకుమార్పై కోర్టు ఆవరణలో పట్టపగలే దాడి చేసి కొట్టారు కదా. సంవత్సరం గడచినా పోలీసులు నేరస్థులపై కేసు నమోదు చేయడానికి కూడా సిద్ధపడడం లేదు. అందుకే ఇదంతా మీ లాంటి వారిలో భావావేశాలను రెచ్చగొట్టడం కోసమే ఒక చిన్న విషయాన్ని అనవసరంగా ఒక పెద్ద వివాదంగా సృష్టించారేమో ఆలోచించండి. వాస్తవాలకు మసిపూసి మారేడుకాయ చేశారేమో? ఆ సంఘటనకు సంబంధించిన వాస్తవాలను లేవనెత్తడం ద్వారా నేను విష యాన్ని పక్కదారి పట్టిస్తున్నానని మీరు భావించవద్దు. విషయం కేవలం వాస్తవ సంఘటనలకు మాత్రమే పరిమితమైంది కాదని మీరన్న మాటలు నాకు గుర్తు న్నాయి. దీన్ని నేను అంగీకరిస్తాను. మీ దృష్టిలో ఇది భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించిన విషయం కూడా కాదు. ప్రస్తుత పరిస్థితిలో బాహాటంగా చేసే దేశ వ్యతిరేక నినాదాలను పట్టించుకోకుండా ఉండగలిగే స్థితిలో మనం లేమన్న విష యాన్ని నేనూ అంగీకరిస్తాను. ఒక పెద్ద దేశం.. ఆత్మవిశ్వాసం తొణకిసలాడే దేశం ఇలాంటి చర్యల పట్ల ఊరకే నవ్వేసి ఉండిపోగలుగుతుంది. కానీ మన మింకా అక్కడి వరకు చేరుకోలేదు. మనం జాతి పట్ల విధేయంగా ఉన్నామా, లేదా అన్నదే అసలు సమస్య అని మీరన్నారు. ఇదే ప్రశ్నను నేను మరో విధంగా అడుగుతాను–జాతి పట్ల మనం ఏ భావాన్ని కలిగి ఉండాలి? దేశంపట్ల అభి మానానికి ఉండాల్సిన ధర్మాలేమిటి? నా అభిప్రాయాలను గౌరవిస్తానని మీరన్నారు. కాబట్టి వాటిని ఒప్పు కున్నా, ఒప్పుకోకున్నా కనీసం వాటిని శ్రద్ధగా విననైతే వింటారుగా! నిజానికి గత సంవత్సరం జేఎన్‌యూ చర్చలో భాగమైన రెండు సమూహాలూ దేశీయ లక్షణాలు కలిగినవి కావు. తమను తాము జాతీయవాదులుగా ప్రకటించుకున్న వాళ్లదీ, జాతివ్యతిరేకులనే ముద్ర పడిన వాళ్లదీ ఇద్దరివీ అరువు తెచ్చుకున్న భావ జాలంపై ఆధారపడినవే. జాతి గురించి డబ్బాకొట్టుకున్న వాళ్లు చెబుతున్న జాతీయవాదపు అవగాహన యూరప్ భావజాలానికి నకలు మాత్రమే. జాతీయ వాదంపై సాగిన ఈ చర్చలో భారతీయత అన్నది పూర్తిగా కనిపించకుండా పోయింది. నిజానికి దేశభక్తులు లేదా జాతీయవాదుల బృందం అంధ భక్తిని డిమాండ్ చేస్తూ వచ్చింది. నా దేశం సరైందేనా, కాదా అన్న ప్రశ్ననే లేవనెత్తగూడదు. దేశం పట్ల అభిమానం అంటే జాతికి సంబంధించిన ఏ విమర్శనైనా వ్యతిరేకించడమే. నా దేశం గొప్పది, ఎందుకంటే ఇది నాది కాబట్టి. భారతదేశాన్ని మాతృ భూమిగా, పితృభూమిగా, శ్రేష్ఠభూమిగా అంగీకరించేవాళ్లే దేశానికి యజమా నులు. మిగిలిన వాళ్లంతా కిరాయికి ఉంటున్న వాళ్లే. నిరుటి చర్చలో ఈ సమూ హం చాలా దూకుడుతనాన్ని ప్రదర్శించింది. గెలుపు తనదేనన్న తీరులో వ్యవహ రించింది. మిగిలిన వారందరి దేశభక్తినీ అది పరీక్షకు పెట్టింది. మరో సమూహానికి అసలు ఏ పేరూ లేదు. దానిని ఓసారి సెక్యులర్ అని పిలిచారు. మరోసారి వారు తమను తాము లిబరల్స్ (ఉదారవాదులు) అని చెప్పుకున్నారు. మొదటి సమూహం వీరిని జాతిద్రోహులని అన్నది. కానీ వారిని జాతి అలీనులు అనడం సరిగ్గా ఉంటుంది. వాళ్ల అభిప్రాయం ప్రకారం జాతి అనేది మన అపరిమిత విధేయతకు హక్కుదారేమీ కాదు. కుటుంబం నుంచి విశ్వాంతరాల దాకా మనమంతా వేర్వేరు విభాగాల్లో సభ్యులం మాత్రమే. ప్రతి స్థాయిలోనూ మనపై బాధ్యతలుంటాయి. ఏదో ఒక విభాగాన్ని మాత్రమే కళ్లు మూసుకొని గుడ్డిగా సమర్థించడమేంటి? ఈ సమూహానికి జాతి పట్ల వ్యతిరేకత ఏమీ లేదు కానీ దానిలో గందరగోళం లేదా సంకోచం ఉందని చెప్పొచ్చు. గత సంవత్సరం జరిగిన చర్చలో ఈ సమూహం ఆత్మరక్షణాయుతంగా, ఓటమికి గురైనట్టుగా వ్యవహరించింది. అయితే జాతీయవాదంపై ఈ రెండు బృందాల అవగాహనా యూరప్ నుంచి అరువు తెచ్చుకున్నదే. 19, 20 శతాబ్దాల్లో జాతీయవాదం అనేది ఒక సంకుచిత భావజాలంగా ఉండింది – ఒక జాతి, ఒక సంస్కృతి, ఒక భాష, ఒక మతం, ఒక రేస్. యూరప్‌కు జాతీయ సమైక్యత అంటే ఏకరూపకత మాత్రమే. నిరుటి చర్చలో తమను తాము జాతీయవాదులుగా చెప్పుకున్న వాళ్లు జర్మనీ, ఇటలీలకు చెందిన ఈ సంకుచిత జాతీయవాదాన్నే భారతదేశంలో కాపీ కొట్టా లని భావించారు. నిరుడు జాతీయవాదాన్ని వ్యతిరేకించిన బృందం జాతీయ వాదం తప్పనిసరిగా సంకుచితత్వమే అవుతుందని భావించింది. ఈ రెండు బృందాలూ అరువు తెచ్చుకున్న భావజాలం, అనారోగ్యకరమైన మనస్తత్వానికి చెందిన రెండు ముఖాలు మాత్రమే. నిజమైన జాతీయ లక్షణాలను అర్థం చేసుకోవడానికి మనం యూరప్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. భారత స్వాతంత్య్ర సంగ్రామానికి చెందిన జాతీయ వాదం దేశాభిమానంపై మనకు మెరుగైన అవగాహనను అందిస్తుంది. ఈ జాతీయవాదంలో జాతీయ సమైక్యత అంటే అర్థం ఏకరూపకత కాదు. మన జాతీయవాదం యూరప్‌కు చెందిన అవగాహన నుంచి వైదొలగుతూ బహు ళత్వానికి పెద్ద పీట వేసింది. భిన్నత్వంలో ఏకత్వం అనే తత్వాన్ని అందించింది. భారతీయ జాతీయవాదం జాత్యహంకారపూరితమైంది కాదు. అది తెల్ల చర్మాన్ని లేదా బైటివారిని వ్యతిరేకించలేదు. అందుకు భిన్నంగా మన జాతీయవాదం మనల్ని ఆఫ్రికా, ఆసియా, మిగతా ప్రపంచంలో బానిసత్వంలో మగ్గుతున్న వారితో జోడించింది. మన జాతీయవాదం మనల్ని ఇతర దేశాలకు వ్యతిరేకంగా నిలబెట్టేది కాదు, దేశం లోపలే ఉన్న వేర్వేరు కులాలను, ప్రాంతాలను, మతా వలంబికులను జోడించేది. నేను ఈ మొత్తం చర్చతో ఏకీభవించడం లేదన్న విషయాన్ని మీతో ఫోన్లో చెప్పింది గుర్తుండే ఉంటుంది. నేనలా ఎందుకన్నానో ఈపాటికి మీకు అర్థమై ఉంటుందని కూడా ఆశిస్తున్నాను. గత సంవత్సరం జరిగిన జేఎన్‌యూ చర్చలో దేశభక్తులు గెలవనూ లేదు, దేశద్రోహులు ఓడిపోనూ లేదు. నిజానికి యూరప్ జాతీయవాదం గెలిచింది. భారత జాతీయవాదం ఓడిపోయింది. నా దగ్గర మీ పేరు గానీ, ఫోన్ నంబరు గానీ ఏవీ లేవు. కానీ దేశాభిమానం అనేది ఊరూ పేరూ తెలియని వ్యక్తుల కలయికతోనే నిర్మితమవుతుంది కదా! - యోగేంద్ర యాదవ్ మొబైల్ : 98688 88986 Twitter : @_YogendraYadav -
పాకిస్తాన్, అమెరికాలకు జాతీయత లేదు
పట్నా హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఎల్.నర్సింహారెడ్డి ఏబీవీపీ ఆధ్వర్యంలో ‘జాతీయవాదం – భావవ్యక్తీకరణ’పై సదస్సు హన్మకొండ చౌరస్తా : పాకిస్తాన్, అమెరికాలకు జాతీయత లేనే లేదని, జాతీయత అంటే భారత దేశానిదని పట్నా హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఎల్.నర్సింహారెడ్డి అన్నారు. హన్మకొండ బాలసముద్రంలోని సామా జగన్మోహన్రావు స్మారక భవనంలో శనివారం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యం లో ‘జాతీయవాదం – భావ వ్యక్తీకరణ’ అంశంపై సదస్సు జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన జ్యోతి ప్రజ్వళన చేసి సదస్సు ప్రారంభించారు. అనంతరం రావుల కృష్ణ అధ్యక్షతన జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ వేల ఏళ్ల చరిత్రకు ఆనవాళ్లు ఇప్పటికీ మన కళ్ల ముందు కనిపిస్తుండటమే మన జాతీయతకు నిదర్శనమన్నారు. ఆయా దేశాల్లో ఎక్కడ చూసినా వేల ఏళ్ల చరిత్రకు నిదర్శనాలు కనబడవని చెప్పారు. ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచి సంస్కృతీ సంప్రదాయాలకు కట్టుబడి ఉండటమే మనదేశం గొప్పదనమన్నారు. భారతదేశంపై దండయాత్రకు వచ్చిన అలెగ్జాండర్ మరో పదేళ్లు బతికి ఉంటే ప్రపంచాన్ని హిందూయిజంలోకి మార్చేవాడని చెప్పారు. దేశ సంస్కృతిని దెబ్బతీసేందుకు నాటి నుంచి అనేక మంది పనికట్టుకొని విషప్రచారం చేస్తున్నారని చెప్పారు. సుమతి శతకాలు, వందేమాతరం తదితరాలతో దేశభక్తిని, సంస్కృతిని చాటేలా పుస్తకాలను ముద్రించాల్సిన ప్రభుత్వం, 2006లో కేంద్ర మంత్రిగా పనిచేసిన అర్జున్‌సింగ్ సెక్స్ ఎడ్యుకేషన్ పేరిట పాఠశాల వి ద్యార్థులకు అందించే పుస్తకాలపై బూతు బొమ్మలు ముద్రించి పంపిణీ చేశారని అన్నారు. ఉపాధ్యాయినులు బోధించలేని దుస్థితిలో ఉండగా నిరసనలు వ్యక్తం కాగా వాటిని పడేశారని అన్నారు. భారత రాజ్యాం గంలో భావ స్వేచ్ఛ ఉందే తప్పా, భావహక్కు లేదన్నారు. ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడే వ్యక్తులను దేశద్రోహులుగా గుర్తించి ప్రజలే బుద్దిచెప్పాలన్నారు. దేశంలో 30 లక్షల ఎన్జీఓలు ఉండగా వాటిలో 15లక్షలవి బోగస్ అని మన్మోహన్సింగ్ ప్రభుత్వం గుర్తించిందన్నారు. వీరసైనికులు ప్రాణా లు తెగించి జాతిని రక్షిస్తుంటే, మరికొందరు ప్రభుత్వం అందిస్తున్న అన్ని సుఖాలు అనుభవిస్తూ దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యాఖ్యానిస్తున్నారు. విశిష్ట అతిథిగా హాజరైన కేయూ ప్రొఫెసర్ రంగారావు మాట్లాడుతూ దేశభక్తి, గౌరవం కలిగి ఉండటం ప్రతిపౌరుడి బాధ్యత అన్నా రు. నేటి సమాజంలో దేశాన్ని ఎంత వ్యతిరేకిస్తే అంత మేధావిగా పాపులారిటీ వస్తోందన్నారు. భారత రాజ్యాంగంలో వాక్స్వాతంత్ర్యం ఉందే తప్ప ఇష్టమొచ్చినట్లు మా ట్లాడే హక్కు లేదన్నారు. దేశ రక్షణకు, సం స్కృతీ సంప్రదాయాలకు వ్యతిరేకగా మాట్లాడితే కఠినంగా శిక్షించేలా ప్రభుత్వాలు చట్టాలు సవరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సదస్సులో మాజీ ఎమ్మేల్యే మందాడి సత్యనారాయణరెడ్డి, గుజ్జుల నర్సయ్య, ముద్దసాని సహోదర్‌రెడ్డి, మాజీ మేయర్ రాజేశ్వర్‌రావు, బీజేపీ జిల్లా అద్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, చాడ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. -
'ఇక్కడే చస్తా.. అస్థికలు కలిసేది గంగలోనే'
తిరువనంతపురం: తన జాతీయతపై మరోసారి చెలరేగుతున్న విమర్శకులకు ధీటుగా బదులిచ్చారు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ. తాను భారతీయురాలినేనని, తన ప్రియమైన వ్యక్తుల నెత్తురు కలిసిపోయిన ఈ గడ్డపైనే మరణిస్తానని, అస్తికలు ఇక్కడి గంగలోనే కలుస్తాయని ఉద్వేగభరితంగా మాట్లాడారు. కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం తిరువనంతపురంలో ఏర్పాటుచేసిన సభలో సోనియా మాట్లాడారు. 'అవును. నేను ఇటలీలో పుట్టానని చెప్పుకోవడానికి సిగ్గుపడను. 90 ఏళ్ల నా తల్లి అక్కడే ఉందని చెప్పడానికి సంకోచించను. ఇందిరాగాంధీ కోడలినయిన తర్వాత గడిచిన 48 ఏళ్ల నుంచి నేను ఇక్కడే ఉంటున్నా. ఇదే నా ఇల్లు. ఇదే నాదేశం. నా చావు ఇక్కడే. అస్తికలు కలిసేది ఈ నీటిలోనే' అని సోనియా గాంధీ అన్నారు. ఘనమైన తన జాతీయతను మోదీగానీ, ఆర్ఎస్ఎస్ గానీ అర్థంచేసుకోలేరని, అలా అర్థం చేసుకోవాలని తాను భావించనూలేదని వ్యాఖ్యానించారు. ఇటలీలోని ఒక గౌరవప్రదమైన కుటుంబంలో జన్మించానని, అక్కడ తన తల్లి, ఇద్దరు సోదరీమణులు ఉన్నారన్న సోనియా.. తన దేశం భారత్ లో తనకెంతో ప్రియమైన వ్యక్తుల రక్తం కలిసిపోయిందని, తుది శ్వాస వరకు ఇక్కడే ఉంటానని స్పష్టంచేశారు. వ్యక్తులను దూషించడం, ఎప్పుడూ అబద్ధాలు చెప్పడమే వాళ్ల పని అంటూ ప్రధాని మోదీని విమర్శించారు. శుక్రవారం కేరళలో జరిగిన బీజేపీ సభలో ప్రధాని మోదీ సోనియా జాతీయతపై వ్యంగ్యాస్త్రాలు సంధించిన సంగతి తెలిసిందే. కాగా, తమిళనాడు, కేరళల్లో శుక్ర, శనివారాల్లో పోలింగ్ జరగనుంది. ప్రచారానికి మరో మూడు రోజుల్లో గడువు ముగియనుండటంతో పార్టీలు తమ కీలక నేతలతో ప్రచారం నిర్వహిస్తున్నారు. -
ఈ తరహా జాతీయవాదం వద్దే వద్దు...!
శత్రువుతో గుసగుసలాడుతారనే భయం కారణంగా మన సొంత పౌరులనే నిర్బంధించడం ద్వారా ‘ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక’ భారతఖను మనం అవమానిస్తున్నాం. ఇలాంటి చర్యల ద్వారా మనది ఆత్మవిశ్వాసం కలిగిన రిపబ్లిక్ కాదని మనకు మనం ప్రదర్శించుకుంటున్నాం. మనకు ఏ ప్రయోజనం ఒనగూరకపోయినా సరే... మనం అవతలిపక్షాన్ని శత్రువైఖరితోనే చూస్తుండాలనే సంకుచితత్వాన్ని నేను ఇకపై ఆమోదించలేను. పాకిస్తాన్‌తో భారత్ యుద్ధానికి తలపడుతున్నట్లు కనిపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో టెలివిజనఖ విశ్లేషకుడిగా నెట్టుకు రావడం ఏమంత సులభమైన విషయం కాదు. అయితే అది నిజమైన యుద్ధం కాదనుకోండి. పొఖ్రానఖ, చాగైలో ఆ మతి హీన పేలుళ్లు (అణుపరీక్షలు) జరిపిన తర్వాత మనకు అలాంటి పరిస్థితి ఇక ఎదురు కాదు కూడా. మనం మాట్లా డుకోవాలా లేదా అనే విషయంలో ఈ చిన్న పిల్లల తరహా వాగ్వాదంపైనే నేనిలా అంటున్నాను... ఎవరైనా తల్చుకుంటే టెలిఫోన్, ఇమెయిల్ ఇతరత్రా మార్గాల్లో సులభంగా ఏ సమాచారాన్నయినా పంపిణీ చేసుకోగలుగుతున్న నేటి కాలంలో ప్రజలను కలుసుకోకుండా మనం ఎందుకు ఆపుతున్నామో అర్థం చేసుకోవడం నాకయితే కష్టమే. అంత ర్జాతీయ దౌత్యంలోని సూక్ష్మభేదాలను బహుశా నేను అర్థం చేసుకోవడం లేదేమో మరి. మూర్ఖత్వంతో, మొండితనంతో ఉండటం కూడా వాస్తవానికి చాణక్య మేథకు సంబంధించిన ఒక యుక్తిగా నాకు అనిపిస్తుంటుంది. ఏమయినప్పటికీ, నేను చెబుతున్నదేమిటంటే, స్వతంత్ర బుద్ధి కలిగిన వారు ఈ రోజుల్లో విశ్లేషకులుగా ఉండటం అంత సులభం కాదనే. టీవీ స్టూడియోలో ఉన్న ఇతరులకు ఇది చాలా సులభమే కావచ్చునేమో కానీ పార్టీ పంథాను లేదా జాతీయ పంథాను అవలంబించడం నాకయితే సాధ్యం కాని పని. నా అభిప్రాయంలో వాస్తవం, సందర్భం అనేవి చాలా ముఖ్యమైనవి. చాలాకాలంగా నేను అంధ జాతీయ వాద దృష్టిని కలిగి ఉండేవాడిని కానీ ప్రపంచాన్ని చదువుతూ, దాన్ని ఎదుర్కొంటూ ఉన్న వారు ఎవరైనా తామున్న స్థితి నుంచి మరింత పరిణతి చెందుతారు. ప్రాంతీయ జాతీయవాద స్వభావం శూన్యతతోనే ఉం టుందని ఎవరైనా అర్థం చేసుకుంటారు. అంటే మీరు నష్ట పోతున్నప్చడు లేదా నష్టపోతున్నట్లు కనిపిస్తున్నప్చడు మాత్రమే నేను లాభపడతానని దీని అర్థం. మీకు కలిగే ప్రయోజనం నాకు నష్టంగా పరిణమిస్తుంది. భారత్‌లో మన జాతీయవాద వైఖరి ఏమిటి? అది పాకిస్తాన్, చైనా వ్యతిరేక వైఖరే. ఇది ఎలాంటి సూక్ష్మ భేదాన్ని కూడా అనుమతించదు. మనం దీనికి పూర్తిగా ఆమోదమైనా తెలపాలి లేదా పూర్తిగా విరోధించక పోయి నా, కనీసం తిరస్కరిస్తున్నట్లయినా కనిపించాలి. మనకు నష్టం జరుగుతున్నా సరే, లేదా అలాంటి వైఖరి వల్ల భార తఖకు ఎలాంటి ప్రయోజనం కలగకున్నా సరే.. మనం ఎన్న టికీ పాకిస్తానఖ వ్యతిరేకతనే కలిగి ఉండాలి మరి. (హురి యతఖ వేర్పాటువాదులను కలిసేందుకు అనుభవజ్ఞుడైన సర్తాజ్ అజీజ్‌ను అనుమతించకపోవడంలో భారతఖకు ఒరిగే ప్రయోజనం శూన్యమే). శత్రువుతో గుసగుసలాడుతారనే భయం కారణంగా మన సొంత పౌరులను నిర్బంధిస్తున్నప్చడు, ‘ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక’ భారత్‌ను మనం అవమాని స్తున్నాం. ఇలాంటి చర్యల ద్వారా మనది ఆత్మ విశ్వాసం కలిగిన రిపబ్లిక్ కాదని మనకు మనం ప్రద ర్శించుకుం టున్నాం. ఏమాత్రం కొత్తగా ఆలోచించడానికి సిద్ధపడని విశ్లేషకుడికి ఇది చాలా స్పష్టతను ఇవ్వగలగాలి. పైగా దీన్ని టెలివిజనఖలో ప్రకటించడం అనేది జాతీయ వ్యతిరేకిగా ఉంటున్నారని ఆరోపణలకు గురయ్యేలా చేస్తుంది. మరొక విషయం ఏమిటంటే ఒక ప్రత్యేక సందర్భంలో ఎవరైనా ఒక నిర్దిష్ట దృక్పథానికి కట్టుబడి ఉన్నప్చడు ఇలాంటి ఆరోపణలకు గురవడం. తర్కం, హేతువు నుంచి తప్పించుకోలేని ఒకరకమైన సిద్ధాంతంతో మనందరం రం గేసుకున్నాం అని మనపై నేరారోపణ చేస్తుంటారు. మనం నిర్దిష్టంగా అర్థం చేసుకోకుండానే లె?ఫ్ట, లిబరలఖ, రైటఖ అనే పదాలను అలవోకగా వాడేస్తుంటాము. దీనికి ఒక కారణ ముందని నేను అనుకుంటున్నాను. అదేమిటంటే, హిందు వులకు ఎలాంటి అనుకూలతను కలిగించకున్నా, ముస్లిం లకు, క్రైస్తవులకు వ్యతిరేకంగా ఆగ్రహం, వైరం ప్రతి పాదిం చే హిందూత్వం వంటి విద్వేషంపై ఆధారపడిన వర్గీకరణ లను మనం కలిగి ఉన్నాం. ఇలాంటి విద్వేషాన్ని పుణికిపుచ్చుకున్న వ్యక్తులు ఎలాంటి సమస్యకు సంబంధించి అయినా సరే.. తమ బుద్ధిని, తమ ఉద్వేగాలను వేరుపర్చుకోవడం కష్టం. అయి తే మనం అలాంటి వారి వెనుక ఎందుకు నిలబడాలి. నా వరకు నేను ఆ వరుసలో నిలబడను, నిలబడలేను కూడా. ‘‘చర్చలు విఫలమైతే పాకిస్తానఖనే తప్చపట్టవచ్చనే అంశంపై స్టూడియోలో ఉన్న మనమంతా అంగీకరిస్తు న్నాం’’ అంటూ ఒక యాంకర్ ఓ చర్చా కార్యక్రమంలో పేర్కొన్నారు. కాని ఆ చర్చలో నేను దానికి అంగీకరించ లేదు. ఇది ఇండియా వెరసి పాకిస్తానఖకు సంబంధించిన సమస్య కాబట్టి భారతీయులందరూ తమ ప్రభుత్వ వైఖరిని బలపర్చాలని ఇలాంటి వారు భావిస్తున్నారు. ఇప్పటికే రేఖలను గీసేశారు.. ఇక ఇరుపక్షాలూ సమరా నికి పోవడమే తరువాయి అని ఈ భావనకు అర్థం. విశ్లేష కులు, రాజకీయనేతలు, పౌరులు, క్రికెటర్లు, లేదా గృహిణు లు ఇలా మనందరం అవతలి పక్షాన్ని శత్రువుగానే చూడా లి, పైగా ఆ శత్రుపక్షం చెప్పే ప్రతి అంశాన్నీ వ్యతిరేకించాలి. దాన్నుంచి మనకు ఏ లబ్ధి ఒనగూరకపోయినా సరే మనం అవతలిపక్షాన్ని అలాగే చూస్తుండాలి. ఇలాంటి మూర్ఖ త్వాన్ని, మూఢత్వాన్ని నేను ఏమాత్రం ఆమోదించను. దీంతో టీవీలో కనిపించటం నాకు కష్టంగానే ఉంటుంది. మరి ఇలాంటి వైఖరిని ఎంతగానో ద్వేషిస్తూ లేదా కనీసం అసంతృప్తిగా చూస్తూ మీరెందుకు ఇంకా టీవీ ప్రసా రాల్లో కనిపిస్తున్నారు? అని ఎవరైనా బుద్ధిమంతులు నన్ను అడగవచ్చు. దీనికి కారణం ఏమిటంటే ఈ పని చేయడానికి నాకు డబ్బు చెల్లిస్తున్నారు. పైగా తరచుగా కాకున్నా కొన్ని సార్లయినా టీవీలో కనిపించడాన్ని నేను ఆస్వాదిస్తుంటాను కూడా. మరొక కారణం ఏదంటే నాలాగే మరి కొందరు కూడా ఆలోచిస్తూ ఉండవచ్చు. వారి సంఖ్య ఏమంత పెద్దది కాక పోవచ్చు కానీ, ఉన్మాదాన్ని, అల్పత్వాన్ని తిరస్కరించే మావంటి బృందం ఒకటి ఉంటుందని విశ్వసించడాన్ని నేను ఇష్టపడతాను. (వ్యాసకర్త కాలమిస్టు, రచయిత) ఆకార్ పటేల్, aakarpatel@icloud.com