నా జన్మభూమి కెనడా కానీ, నా కల్చర్ తమిళ్: నటి
గ్లామర్ ప్రపంచంలో తెలుపు రంగుకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ కాంప్లెక్షన్ను ప్రతిభతో సరిచేసిన నటీమణులెందరో! ఇప్పుడు ఆ జాబితాలోకి చేరింది∙ ఇండియన్ కెనడియన్ నటి మైత్రేయి రామకృష్ణన్.
►పుట్టింది, పెరిగింది, చదివింది కెనడాలోనే. తల్లిదండ్రులు రామ్ సెల్వరాజ్, కృతిక సెల్వరాజ్. శ్రీలంక సివిల్ వార్ సమయంలో తమిళనాడు నుంచి కెనడాకు వెళ్లి స్థిరపడ్డారు.
►మార్వల్, డిస్నీ స్టోరీస్ అంటే ఒళ్లంతా చెవులు చేసుకునేది మైత్రేయి. ఆ ఆసక్తితోనే పెద్దయ్యాక యానిమేటర్ కావాలని నిర్ణయించుకుంది. కానీ, స్కూల్ నాటకాల్లో భాగస్వామ్యం ఆమెను నటనవైపు లాక్కెళ్లింది. అందుకే చదువు పూర్తవగానే అభినయ దిశగా అడుగులేసింది.
►మొదటి అవకాశంతోనే సత్తా చాటింది. సుమారు పదిహేను వేల మంది హాజరైన ఆడిషన్లో తను మాత్రమే ఎంపికై ‘నెవర్ హావ్ ఐ ఎవర్’లో ప్రధాన భూమిక పోషించింది. ‘దేవి’గా అద్భుతంగా నటించి పలు అవార్డులను అందుకుంది. ప్రస్తుతం ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతోంది.
►పియానో వాయించడం, స్నేహితులతో షాపింగ్ చేయటం, పెంపుడు జంతువులతో ఆడుకోవడమంటే ఇష్టం.
►భరత నాట్యం, కథక్‌లో శిక్షణ తీసుకుంది. కొంతకాలం థియేటర్ ఆర్టిస్ట్‌గానూ పనిచేసింది.
►సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే మైత్రేయి పలు సామాజిక పోరాటాల్లో పాల్గొంది. అందుకే ‘ఎయిటీన్ గ్రౌండ్ బేకర్స్’లో ఆమె పేరు చేరింది.
►నా జన్మభూమి కెనడా. కానీ నా కల్చర్ తమిళ్. ఈ నిజం ఒప్పుకోవడానికి, చెప్పుకోవడానికి నేను ఎప్పుడూ సంకోచించను. నిజానికి అదే నా గుర్తింపు’ అంటుంది మైత్రేయి రామకృష్ణన్.