
'నా భార్య నా సినిమాలు చూడదు'
- విలక్షణ నటుడు సత్యప్రకాష్
- బ్యాంకు ఉద్యోగం నుంచి సినిమా ప్రపంచానికి..
సాక్షి, కేకే.నగర్: ఆయన కనపడితే చాలు మహిళలు తిట్ల వర్షం కురిపిస్తారు. పిల్లలైతే భయపడి కళ్లు మూసుకుంటారు. క్రూరమైన వికృత చేష్టలతో అరివీర భయంకరుడుగా అందరినీ భయపెడుతుంటాడు. ఇంతకూ ఇది నిజజీవితంలో కాదు వెండితెరపై మాత్రమే. అతనే ప్రేక్షకులను భయపెట్టే నటుడు సత్యప్రకాష్. తెరపై మా చెడ్డ విలన్... నిజ జీవితంలో మా మంచి అన్నయ్య లాంటి వాడు. చాలా మృదుస్వభావి. ఎవరినీ బాధపెట్టడం కానీ, కన్న పిల్లలపై ఇంత వరకు చెయ్యి చేసుకోవడం కానీ, తిట్టడం కాని చేయలేదని అన్నారు.
సినీ ప్రపంచంలో వెండి తెరపై కత్తులతో పొడవడం, పైశాచికంగా గొంతు కోయ డం చేసే ఈయన నిజజీవితంలో చీమకు కూడా కీడు తలపెట్టనని అంటున్నారు. సినీ ప్రపంచంలో తనకొక ప్రత్యేక స్థానం, గుర్తింపు రావడానికి కారణం సద్గురు బాబానే అంటున్నారు సత్యప్రకాష్. మా ఊరు, మన ఊరు శీర్షికలో ఆయన తన ఊరి కబుర్లను, చిన్ననాటి చిలిపి చేష్టలను సాక్షి పాఠకులతో ఈ విధంగా పంచుకున్నారు. 'మా అమ్మమ్మ ఊరు విజయనగరం. నాన్నమ్మ వాళ్లది శ్రీకాకుళం. నాన్న నటరాజ్. అమ్మ రత్నం పక్కా గృహిణి. నాకొక తమ్ముడు, చెల్లెలు ఉన్నారు.
నాన్న ఒడిశా రూర్కేలాలోని స్టీల్ ప్లాట్‌లో ఉన్నతాధికారిగా పని చేశారు. అదే ప్లాంట్‌లో సుమారు 50 మందికి పైగా స్నేహితులను, బంధువులకు ఉద్యోగాలు ఇప్పించి కంపెనీ తరఫున క్వార్టర్స్ ఇచ్చి తన దగ్గరకు పిలిపించుకున్నారు. అంతేకాదు రూర్కేలాలో 50 మంది తెలుగు కుటుంబాలతో తెలుగు అసోసియేషన్ ను ప్రారంభించారు. నేను పుట్టిన రెండో నెలలోనే రూర్కేలాకు వెళ్లిపోయాను. పెరిగింది, ఎంబీఏ చేసి అలహాబాద్ బ్యాంకులో ఉద్యోగం చేసింది అంతా అక్కడే.
రూర్కేలా టూ చెన్నై:
స్థిరమైన బ్యాంకు ఉద్యోగాన్ని వదిలి సినిమా వేషాల కోసం రూర్కేలా నుంచి చెన్నైకి చేరుకున్నాను. చెన్నైలోని సెంట్రల్ స్టేషన్ లో వెయిటింగ్ రూమ్‌లో ఆరు నెలలు తలదాచుకున్నాను. పగలంతా తిరగడం రాత్రి అక్కడకు చేరుకోవడం. ఆ తర్వాత సినిమా యూనిట్ అంతా టీనగర్‌లో ఉం డడంతో వెస్ట్ మాంబళంలోని నాలుగు అంతస్తుల ఇంటిపైన ఒక గుడిసెలో వంద రూపాయల అద్దెలో ఆరేళ్లు గడిపాను. ఆ ఇంట్లో ప్రతి అవసరానికి గ్రౌండ్‌ఫ్లోర్‌కు రావాల్సిందే. అప్పట్లో నాకొక డొక్కు బైక్ ఉండేది. పెట్రోలు పోయడానికి డబ్బుల్లేక దానిపై కూర్చుని నడిపిన దాని కంటే దాన్ని తోసుకుంటూ నడిచిన రోజులే నాకు గుర్తున్నా యి.
నాకు అమ్మ, నాన్న పూర్తి సహకారం అందించారు. అప్పటి మద్రాసులో సినిమా అవకాశాల కోసం తిరుగుతున్న సమయంలోనే మేనమామ కూతురు హేమతో వివాహం జరిగింది. ఆమెను జంషెడ్‌పూర్‌లోని పుట్టింటిలో ఉంచి ఆరేళ్లు కాళ్లు అరిగేటట్లు ప్రతి సినిమా ఆఫీసు ఎక్కడం, దిగడంతో విరక్తి పుట్టింది. ఇక నాకు ఈ సినిమాలో నటించే అదృష్టం లేదని నిరాశ చెందాను. ఫ్రెండ్ సలహాతో 1995లో షిరిడీ వెళ్లి సాయిబాబాను దర్శించుకుని వచ్చాను. వచ్చిన వెంటనే ప్రముఖ దర్శకుడు నిర్మాత విజయబాపినీడు నన్ను పిలిచి మెగాస్టార్ చిరంజీవి బిగ్‌బాస్ చిత్రంలో విలన్ పాత్ర చేయడానికి అవకాశం ఇచ్చారు.
మెగాస్టార్ నన్ను ఎంతో ప్రోత్సహించి నటనలో మెళకువలు నేర్పించారు. ఆ తర్వాత సాయికుమార్ హీరోగా పోలీసు స్టోరీలో నేను చేసిన విలన్ పాత్ర ఒక్కసారిగా నన్ను ఫీల్డులో ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లింది. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. రాత్రికి రాత్రే తిరుగులేని విలన్ అయ్యాను. ఆ తర్వాత అగ్ని ఐపీఎస్‌లో కూడా సాయికుమార్‌తో విలన్ పాత్రలో నటించాను. వరుస సినిమాలు వి జయాలతో వడపళని సాలిగ్రామంలో సొంత ఇల్లు, కారు కొనుక్కున్నాను.
బాలకృష్ణతో నటించి న సమరసింహారెడ్డి సూపర్ డూపర్ హిట్టయ్యిం ది. సినిమా షూటింగ్‌కు ముందు బాలకృష్ణ నన్ను పిలిపించి సెట్‌లో అందరి ముందు ఆప్యాయం గా ఆలింగనం చేసుకుని విలన్ పాత్రలో నువ్వు జీవిస్తున్నావు అని పొగడడం నాకు ఆనంద బాష్పాలు తెప్పించింది. తెరపై చిరంజీవి, బాలకృష్ణలకు విజిల్ వేస్తూ, చప్పట్లు కొడ్తూ రెండు కళ్లు అనుకున్న అభిమాన హీరోలతో విలన్ గా నటిస్తానని నేను కలలో కూడా ఊహించలేదు. కన్నడ, తెలుగు, తమిళం, ఒరియా, మలయాళం, భోజ్‌పురి, బెంగాళి, రెండు హాలీవుడ్ సినిమాలతో కలిపి 400లకు పైగా సినిమాల్లో నటించాను.
అన్నిట్లో 90 శాతం అతిక్రూరమైన విలన్ పాత్రలే. నాకు తెలుగులో కంటే కన్నడంలోనే ఎక్కువ అవార్డులు వచ్చాయి. లింగ ప్రొడ్యూసర్ రాక్‌లైన్ వెంకటేష్ నాకు ప్రాణస్నేహితుడు. అతను నా కుమారుడు నటరాజ్‌కు 'మనసు మల్లిగై' అనే కన్నడ సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చారు. ఆ సినిమాతో పాటు మరో సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ప్రస్తుతం మూడో సినిమా హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. నా కుమార్తె రామచంద్ర మెడికల్ కాలేజీలో బయోమెడికల్ చేస్తోంది. నేను ఇన్ని సినిమాల్లో నటించినా నా భార్య ఒక్క సినిమా కూడా చూడలేదంటే ఎవరూ నమ్మరు. నాకంత ఇంట్రెస్ట్ లేదు అంటుంది. అయితే నా అభివృద్ధికి ఆమె పూర్తి సహకారం అందించింది.
ఊరులో సెలబ్రిటీ:
ఒకసారి మా ఊరిలో జరిగే పైడితల్లి జాతరకు వెళ్లినపుడు చాలా ఇబ్బంది పడ్డాను. నన్నెవరూ గుర్తుపట్టరనే ధీమాతో ఒంటరిగా వెళ్లాను. అంతే ఎక్కడి నుంచి వచ్చారో కానీ అభిమానులు సముద్రంలా నన్ను చుట్టుముట్టారు. వారి నుంచి తప్పించుకుని గుడిలోకి వెళ్లి దాక్కున్నాను. ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేసి వారి సహాయంతో ఇంటికి చేరాల్సి వచ్చింది.
చిన్నతనం తీపి గురుతులు:
వేసవి సెలవులకు విజయనగరం, శ్రీకాకు ళం వచ్చి రెండు నెలలు ఎంజాయ్ చేసేవాడిని నా ఏడేళ్ల వయస్సులో కొబ్బరిబొండాలు, మామి డి తాండ్ర దొంగతనం చేయడం, షాపు అతనికి దొరక్కుడా పరుగులు తీయడం సరదాగా అని పించేది. 14 ఏళ్ల వయస్సులో విజయనగరం హోటల్‌లోని ఇడ్లీ సాంబార్, ప్యూర్ ఫిల్టర్ కాఫీ నాకెంతో ఇష్టం. చిన్నప్పుడు ఊరికి వస్తే చాలు సినిమాలే సినిమాలు ఒంటరిగా ఒకే రోజు మూడు ఆటలు చూసేవాడిని. సినిమా హాల్లో నేల టికెట్టులో కూ ర్చుని ఇంటర్వెల్‌లో కుర్చీలో కూర్చుని ఫోజు కొ ట్టేవాడిని.
నా 17 ఏళ్ల వయసులో ఊరికి వెళ్లడానికి నాన్న రైలు టికెట్‌కు డబ్బు ఇస్తే నేనే మో టికెట్ కొనకుండా దేశంబండి (దొంగలబండి) అనే పేరుతో పిలుచుకునే రైల్లో విజయనగరం రావడం ఆ డబ్బులతో సినిమాలు చూడ డం, షికార్లు తిరగడం వంటివి చేసేవాడిని. నేనొ క సినిమా పిచ్చాడిని. నాకు సినిమాలంటే తెగ పిచ్చి. మెగా స్టార్, బాలయ్య నాకు రెండు కళ్లు. ఆ సమయంలో అనుకోలేదు నేను వాళ్లతో విలన్ పాత్రలో నటిస్తానని, అలా నటించడం నాకు ఊహకందని విషయం. రూర్కేలాలోని ఇస్పాట్ కాలేజిలో డిగ్రీ పూర్తి చేసుకుని, ఎంబీఏ చేశాను. ఆ తర్వాత అలహాబాద్ బ్యాంక్‌లో ఐదేళ్లు ఆఫీసర్ గ్రేడ్‌లో పని చేస్తున్న సమయంలో మనసంతా సినిమాలపైనే ఉండేది. ఎలాగైనా సినిమాల్లో నటించి పేరు తెచ్చుకోవాలి అనే కోరిక పెరిగింది.
నా స్నేహితులందరూ ఒరేయ్ నువ్వు అచ్చు హిందీ హీరోలా ఉన్నావు. బాలీవుడ్‌లో చేరు అని సలహా ఇచ్చారు. ఇక అంతే వెంటనే బాంబే వెళ్లి ప్రయత్నాలు సాగించాను. ఒకసారి రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెలుగు సినిమా షూటింగ్ బాంబేలో జరుగుతున్నట్లు తెలిసింది. వెంటనే వెళ్లి ఆయన ను కలిశాను. ఆయన ఒకే మాట అన్నారు. తెలుగు వాడివై ఉండి బాంబేలో ఉంటే పది మందిలో ఒకడివిగా ఉంటావు. అదే చెన్నైలో ఉంటే పది మందిలో నువ్వు ప్రత్యేకంగా కనిపిస్తావు. అందువలన చెన్నైకు వెళ్లు అవకాశాలు వస్తాయని సలహా ఇచ్చారు.