సాక్షి, న్యూఢిల్లీ:
ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు టామ్ ఆల్టర్(67) కన్నుమూశారు. స్కిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. క్యాన్సర్ నాలుగో స్టేజ్‌లో ఉండటంతో తీవ్ర అస్వస్థతకు గురై 20 రోజుల క్రితం ఆయన ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.
అమెరికా సంతతికి చెందిన టామ్ ఆల్టర్ ఇండియా షోబిజ్ టీవీ ప్రోగ్రామ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. 2008లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న టామ్‌ఆల్టర్ పలు బాలీవుడ్ చిత్రాల్లో, టీవీ సిరీస్ ప్రోగ్రామ్‌లో నటించారు. ఆషికీ, రామ్ తేరీ గంగా మైలీ చిత్రాలతోపాటూ పాపులర్ శక్తి మాన్ సీరియల్‌లలో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. టామ్ చివరగా ఇమ్రాన్‌ఖాన్ దర్శకత్వం వహించిన ‘సర్గోశియాన్’ చిత్రంలో నటించారు.