
యువనటుడు, క్రికెటర్ ఆకస్మిక మృతి
కన్నడ నటుడు, యువ క్రికెటర్ ధృవ్ శర్మ (35) ఆకస్మికంగా కన్నుమూశారు. గుండెపోటు కారణంగా మంగళవారం తెల్లవారుఝామున మృతి చెందారు. ఆయనకు భార్య , ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇటీవల గుండెపోటు మరణాలు పరిశ్రమను వెంటాడుతుండటంతో తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తమవుతోంది.
సోమవారం రాత్రి గుండెపోటుతో రావడంతో వెంటనే బెంగళూరులోని కొలంబియా ఆసియా హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ధృవ్ శర్మ తుది శ్వాస విడిచారు.. ధృవ్ శర్మ అకాల మరణంపై అనేకమంది పరిశ్రమ పెద్దలు, బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్, టాలీవుడ్ హీరోయిన్ ప్రియమణి, కన్నడ నటీనటులు, తదితరులు ట్విట్టర్‌ద్వారా సంతాపాన్ని వ్యక్తం చేశారు.
వినికిడి, మాట బలహీనత ఉన్నప్పటికీ అటు కన్నడ చలనచిత్ర పరిశ్రమకులో ఇటు క్రికెట్ క్రీడలోనూ ధృవ్ విజయం సాధించారు. 2006 లో విడుదలైన స్నేహాంజలి కన్నడ చిత్రం ద్వారా చలనచిత్ర పరిశ్రమలో అరగేంట్రం చేశారు. ఆ తరువాత లిమ్కా బుక్ రికార్డ్స్ లో ప్రత్యేక నటుడిగా చోటు సంపాదించారు. బెంగుళూరు 560023, నీనండ్రే ఇష్త కానో, టిప్పాజీ లాంటి హిట్ చిత్రాలలో కూడా నటించారు. 2005 లో డెఫ్ క్రికెట్ ప్రపంచ కప్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించినప్పటికీ సెలబ్రిటీ క్రికెట్ లీగ్లో ఆడుతూ ఎక్కువ ప్రజాదరణ పొందారు.
Am so heart broken, shaken beyond words. My dearest Dhruv Sharma you will be missed forever brother. Thank you for ur warm hugs & love. #RIP pic.twitter.com/lILWZPG0wM
— Riteish Deshmukh (@Riteishd) August 1, 2017