ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. పలువురు వైఎస్ జగన్ ప్రజల కోసం చేస్తున్న పాదయాత్రకు ఆకర్షితులవుతున్నారు. చాలామంది నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. ఇటీవల సినీనటుడు, రచయిత పోసాని కృష్ణమురళి వైఎస్ జగన్‌ను కలిసి మద్దతు ప్రకటించారు. తాజాగా మరో నటుడు పృథ్వీ రాజ్ మంగళవారం జననేతను కలిశారు. వైఎస్ జగన్‌తో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు.