చించినాడలో సినిమా షూటింగ్
చించినాడ (యలమంచిలి) : చంద్రబాలాజీ ఫిలింస్ పతాకంపై నిర్మిస్తున్న సినిమా షూటింగ్ శుక్రవారం చించినాడలో జరిగింది. చిత్రంలో హీరో తల్లిదండ్రులుగా నటిస్తున్న సుమన్, పార్వతిలపై సన్నివేశాలను దర్శకుడు సాయికృష్ణ కేవీ చిత్రీకరించారు.
చించినాడ (యలమంచిలి) : చంద్రబాలాజీ ఫిలింస్ పతాకంపై నిర్మిస్తున్న సినిమా షూటింగ్ శుక్రవారం చించినాడలో జరిగింది. చిత్రంలో హీరో తల్లిదండ్రులుగా నటిస్తున్న సుమన్, పార్వతిలపై సన్నివేశాలను దర్శకుడు సాయికృష్ణ కేవీ చిత్రీకరించారు. ఈ సినిమాకు ఇంకా పేరు ఖరారు చేయలేదు. సినిమాలో అశోక్‌వర్మ, ప్రియాంక శర్మ అనే నూతన నటులు హీరో, హీరోయిన్‌లుగా పరిచయమవుతున్నారు. నిర్మాత కె.చంద్రరావు మాట్లాడుతూ తమ బ్యానర్‌లో గతంలో టైటానిక్ అంతర్వేది టు అమలాపురం అనే సినిమా నిర్మించామని, ఇది రెండో సినిమా అన్నారు. ప్రస్తుతం మూడో షెడ్యూల్ జరుగుతుందని, సినిమాను జూన్‌లో విడుదల చేస్తామని తెలిపారు. షూటింగ్ అంతా చించినాడ, అంతర్వేది, కడలి, రాజోలు, శివకోడు గ్రామాల్లో చేస్తున్నట్టు వివరించారు. దర్శకుడు సాయికృష్ణ కేవీ ఎస్‌ఎస్ రాజమౌళి వద్ద విక్రమార్కుడు, ఈగ, మర్యాదరామన్న, మగధీర తదితర చిత్రాలకు అసిస్టెంట్‌గా పని చేశారన్నారు. ఈ సినిమాకు ఎస్.రాజశేఖర్ కెమెరామెన్‌గా పనిచేస్తుండగా వినోద్ సంగీతం అందిస్తున్నారు.