
హెచ్‌ఎంలకు పదోన్నతులు
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 18 ప్రధానోపాధ్యాయుల పోస్టులకు పదోన్నతులను ఖరారుచేశారు.
► రాత్రివరకు కొనసాగిన తర్జనభర్జన
► తమకు అవసరం లేదన్న ఇద్దరు అనడంతో మరో ఇద్దరికి అవకాశం
ఒంగోలు: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 18 ప్రధానోపాధ్యాయుల పోస్టులకు పదోన్నతులను ఖరారుచేశారు. అర్హులైన వారికి జిల్లా విద్యాశాఖ అధికారి డీవీ సుప్రకాష్ శనివారం ఉత్తర్వులు అందించారు. ఉదయం పదోన్నతుల కౌన్సెలింగ్ స్థానిక జిల్లా పరిషత్ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో జరిగింది. జెడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు, జిల్లా రెండో సంయుక్త కలెక్టర్ ఐ.ప్రకాష్‌కుమార్ మాట్లాడుతూ పాఠశాలల అభివృద్ధికి ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. డీఈవో డీవీ సుప్రకాష్ మాట్లాడుతూ జిల్లాలో ఖాళీలు ఉన్న స్కూల్ అసిస్టెంట్లు, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులను కూడా భర్తీ చేస్తామని డీఈవో పేర్కొన్నారు. అయితే పదోన్నతుల కౌన్సెలింగ్ సందర్భంగా ఇద్దరు ఉపాధ్యాయులు తమకు పదోన్నతులు అవసరంలేదని ప్రకటించారు. దీంతో వారి స్థానంలో మరో ఇద్దరిని తీసుకోవాలని నిర్ణయించారు.
ఒక పోస్టు ఎస్సీకి, మరో పోస్టు ఓసీకి కేటాయించేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. ఈ సందర్భంలో పలు ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. నిబంధనల ప్రకారం సీనియార్టీ జాబితాలో ఉన్న ఇద్దరికే అవకాశం కల్పించాలని పేర్కొన్నారు. ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోవడంలో రాత్రి వరకు జాప్యం జరిగింది. అన్ని ఉత్తర్వులను పరిశీలించిన అనంతరం సీనియార్టీ లిస్టులో ఉన్నవారికే అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఉపాధ్యాయ సంఘాలకు చెందిన వై.వెంకట్రావు(హెచ్‌ఎం అసోసియేషన్), జి.ఎస్.ఆర్. సాయి(స్కూల్ అసిస్టెంట్స్ అసోసియేషన్), వెంకటేశ్వర్లు(బీటీఏ), ఎం.వెంకటేశ్వరరెడ్డి(యూటీఎఫ్), చంద్రశేఖర్ (వైఎస్సార్‌టీఎఫ్) తదితరులు పాల్గొన్నారు.
పదోన్నతులు పొందినవారు..
ఎం.దేవంద్రరావు-అన్నంబొట్లవారిపాలెం, కె.వి శ్రీనివాసరావు-తిమ్మాయపాలెం, సీహెచ్ సుధాకరరావు-త్రోవగుంట, ఎం.వెంకటేశ్వర్లు-ఈపూరుపాలెం, జి.రత్నావళి-శంకవరప్పాడు, బి.డేవిడ్-సీఎస్‌పురం, వి.పార్వతిశాంతి-టి.నాయుడుపాలెం, జి.వసుంధరాదేవి-ఇనమనమెళ్లూరు, ఎం.ప్రభాకర్-కె.ఉప్పలపాడు, ఎస్.శ్యాంప్రసాద్-ఎనికపాడు, బి.భారతి-పెట్లూరు, ఐ.పురుషోత్తమరావు-ఓబులక్కపల్లి, కె.వెంకటేశ్వర్లు-దిరిశవంచ, జీఎస్ పద్మజ- పందిళ్లపల్లి, బి.అమూల్య-బిపేట బాలికోన్నత పాఠశాల, పీవీ రామమోహన్-పెద్దరాజుపాలెం, ఆర్.కొండారెడ్డి-యర్రబాలెం, కేవీఎన్ శైలజ-గురవాజీపేట.